ముంబై: ఐటీ రంగంలో మూన్‌లైటింగ్‌కు (రెండు ఉద్యోగాలు) వివాదం మరింత ముదురుతోంది. దీనికి వ్యతిరేకంగా గళమెత్తే కంపెనీల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. విప్రో, ఇన్ఫోసిస్ తర్వాత ఆ జాబితాలో తాజాగా ఐబీఎం ఇండియా కూడా చేరింది. మూన్‌లైటింగ్ అనైతికమని ఐబీఎం ఇండియా, దక్షిణాసియా విభాగం ఎండీ సందీప్ పటేల్ వ్యాఖ్యానించారు. (ఇన్ఫోసిస్ ఉద్యోగులపైకొరడా: అతిక్రమిస్తే అంతే!)
‘ఉద్యోగులు మా దగ్గర చేరేటప్పుడు ఐబీఎం కోసం మాత్రమే పనిచేస్తామన్న ఒప్పందంపై సంతకం చేస్తారు. పని వేళల తర్వాత ఖాళీ సమయాల్లో వారు ఏదైనా చేసుకోవచ్చన్న విషయం పక్కన పెడితే, మూన్‌లైటింగ్ మాత్రం అనైతికమే’ అని పేర్కొన్నారు. (Bank of Baroda: ఖాతాదారులకు గుడ్ న్యూస్,రూ.2 కోట్ల వరకు)
కాగా తొలుత విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ మూన్‌లైటింగ్ విధానం మోసపూరితమన్నారు. ఆ తరువాత ఇన్ఫోసిస్ మూన్‌లైటింగ్ విధానాన్ని తప్పుబట్టింది. నిబంధనలు అతిక్రమిస్తే టెర్మినేషన్ తప్పదంటూ ఉద్యోగులను తీవ్రంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. గ్లోబల్ టెక్ దిగ్గజం ఐబీఎంలో భారత దేశంలో లక్ష మందికి పైగా ఉద్యోగులున్నారు. (బిలియనీర్ అదానీ భారీ పెట్టుబడులు: అంబానీకి షాకేనా?)
Comments
Please login to add a commentAdd a comment