వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఫ్రీలాన్స్, మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నారా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బాస్‌లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగుల్ని, వారి పనితీరును గుర్తించే పనిలో పడినట్లు ఓ నివేదిక చెబుతోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోనున్నట్లు హైలెట్ చేసింది
ప్రపంచ దేశాల్లో మూన్‌లైటింగ్ అంశం సరికొత్త చర్చకు దారితీస్తోంది. మూన్‌లైటింగ్‌తో ఉద్యోగుల ప్రొడక్టివిటీ దెబ్బతింటుందని సంస్థలు..ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అదనపు ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్న ఉద్యోగులతో ఈ పని విధానం అనేక మార్పులకు కారణం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.అందుకు ఊతం ఇచ్చేలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగుల్ని వారి బాస్‌లు చూసీ చూడనట్లు వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. గతంలో కంటే ఇప్పుడే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులపై ఓ కన్నేసి ఉంచాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
యూకేకి చెందిన చార్టర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ అండ్ డెవలప్‌మెంట్ (సీఐపీడీ)..హెచ్‌ఆర్ ఉద్యోగులు, మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ విభాగాల్లో జరిపిన సర్వేల్లో 55శాతం మంది బాస్‌లు.. ఉద్యోగుల ప్రొడక్టివిటీని మరింత పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు తెలిపింది.
2 వేలు అంతకంటే ఎక్కువ మంది పై స్థాయి అధికారులతో సీఐపీడీ ప్రతినిధులు మాట్లాడగా.. ఉద్యోగులు ప్రతిరోజూ ల్యాప్‌టాప్‌లపై గడిపిన సమయం, ఇమెయిల్ పంపే విధానంతో పాటు రిమోట్ వర్క్ చేస్తున్న ఉద్యోగుల డేటాను సేకరించాలని అంటున్నారు. అయితే, పది మందిలో ముగ్గురు (28శాతం మంది) మాత్రమే ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల ప్రొడక్టివిటీని గుర్తించేందుకు సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.
మరికొంత మంది..వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉద్యోగులు ఏం చేస్తున్నారో తెలుసుకునే ముందు..ఇలా చేయడం వల్ల సంస్థకు ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఉద్యోగులకు తెలియజేయాలని కోరుతున్నట్లు చార్టర్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ అండ్ డెవలప్‌మెంట్ సర్వే తన నివేదికలో హైలెట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment