కొంత కాలం క్రితం ఐటీ రంగంలో మూన్‌లైటింగ్ తీవ్ర చర‍్చంనీయంశమైంది. ఒకే సమయంలో లేదా విధులు ముగిసిన తరువాత వేరే ఉద్యోగం చేయడం దీని ఉద్దేశం. ఐటీ సంస్థలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగులు మాత్రం అదనపు నైపుణ్యాల కోసమో లేదా ఖర్చులు భరించలేక రెండో కొలువు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ తరుణంలో తాను ఒకే సారి రెండు ఉద్యోగాలు చేసి ఏడాదికి రూ.1.4 కోట్లు సంపాదించినట్లు ఓ ఐటీ ఉద్యోగి తెలిపాడు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాల్ని షేర్ చేసుకున్నాడు.
ఐటీ ఉద్యోగి ఆడమ్ ఎడ్యుకేషన్ లోన్ కింద రూ.98లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం అతను ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. కానీ ఫలితం శూన్యం.పేరుకే రెండు ఉద్యోగాలు చేస్తున్నాడనే మాటగాని కొండలా పేరుకుపోయినా అప్పుల్ని తీర్చేందుకు ఇది సరిపోదని ఓ నిర్ణయానికి వచ్చాడు.
ఏడాదికి కోటి సంపాదన
అంతే 2022లో రిమోట్ జాబ్ కోసం అన్వేషించాడు. చివరికి తాను కోరుకున్నట్లుగా భారీ వేతనంతో రెండు ఉద్యోగాలు చేయడం ప్రారంభించాడు. అలా 2023 జనవరి నుంచి రెండు ఉద్యోగాలు చేయగా వచ్చిన మొత్తం ఏడాదికి రూ.70లక్షలుగా కాగా..అదే ఏడాది చివరి నాటికి ఆడమ్ సంపాదించిన మొత్తం రూ.కోటికి పెరిగింది. సంపాదన పెరగడంతో ఎడ్యుకేషన్ లోన్ చెల్లించాడు.
డబ్బులు బాగా సంపాదించాలనే
ఈ సందర్భంగా రెండు ఉద్యోగాలు చేరేందుకు తాను నిర్ధేశించుకున్న లక్ష్యాలేంటో చెప్పాడు. అందులో ఒకటి సంపాదన రెట్టింపు చేసుకోవడం, రెండోది రెండేళ్లలో తాను ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేయడం. ఇందుకోసం తన లింక్డిన్ ప్రొఫైల్‌లో ఉద్యోగాల కోసం అన్వేషించగా.. రెండు వారాల్లో రెండు ఉద్యోగాలు పొందాడు. స్వల్ప కాలంలో తన ఎడ్యుకేషన్‌లోన్ మెల్లమెల్లగా తిరిగి చెల్లించడంతో పాటు నాలుగు నెలల అత్యవసర సేవింగ్స్‌ను కూడబెట్టుకున్నాడు. అదే సమయంలో కొంతమంది స్నేహితులకు ఆర్థిక సహాయం చేసినట్లు చెప్పిన టెక్కీ వారానికి 30 నుంచి 60 గంటల మధ్య పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
ఈ టిప్స్ మీకోసమే
అదే సమయంలో మూన్‌లైటింగ్ చేయాలని ఉద్యోగులకు పలు టిప్స్ చెప్పాడు. వాటిల్లో ప్రధానంగా .. ఒకే సమయంలో రెండు ఆఫీసుల్లో మీటింగ్స్ లేకుండా చూసుకోవడం, రెండవది.. ఆఫీస్ వర్క్ మొత్తం ఒకేసారి మీదేసుకుని చేసుకోకుండా భాగాలు, భాగాలుగా విభజించి పని సులభం అవుతుందని అన్నాడు. దీంతో పాటు ఆఫీస్‌లో ఇచ్చే పబ్లిక్ హాలిడేస్, వీకాఫ్స్‌ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఓ అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment