ఐటీ రంగలో అలజడిని సృష్టించిన మూన్‌లైటింగ్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కోవిడ్-19 సమయంలో వర్క్ ఫ్రం హోమ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆఫీస్ అయ్యాక మిగిలిన సమయంలో వేరే సంస్థలో ఉద్యోగం చేస్తూ అదనపు ఆదాయాన్ని సంపాదించే వారు. దీనిని విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టెక్ టెక్ కంపెనీలు వ్యతిరేకించాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సిబ్బందిని తొలగించాయి.
తాజాగా ఈ మూన్‌లైటింగ్‌పై మైక్రోసాఫ్ట్ మాజీ హెచ్‌ఆర్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ విలియమ్స్ మరోలా స్పందించారు. రెండో ఉద్యోగం చేసుకోకుండా కంపెనీలు ఉద్యోగుల్ని ఆపకూడదన్నారు. ఉద్యోగుల జీవితాల్ని తమకే అంకితం చేయాలని సంస్థలు కోరుకోకూడదని చెప్పారు. ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి దిగ్గజ టెక్ కంపెనీల్లో చర్చకు దారితీశాయి. మూన్‌లైటింగ్‌పై ఆయన ఇంకేం అన్నారంటే..
మూన్‌లైటింగ్‌పై క్రిస్ విలియమ్స్ కామెంట్
‘మూన్‌లైటింగ్ అనేది శ్రామిక రంగంలో ఒక భాగం. ఈ పని విధానంతో జీవితంలో అనేక విజయాలు సాధించిన గొప్ప గొప్ప వారున్నారు. మా అమ్మ మమ్మల్ని కాలేజీలో చేర్చడానికి రెండు ఉద్యోగాలు చేసింది’ అని బిజినెస్ ఇన్‌సైడర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
అలా ఆలోచించడం తప్పు
‘సంస్థ కోసం ఉద్యోగులు ప్రత్యేక సమాయాన్ని కేటాయించాలని మేనేజర్లు ఆశించడం తప్పే అవుతుందని వెల్లడించారు. ఉద్యోగులు వారి సమయాన్ని సంస్థలకు మాత్రమే అంకితం చేయలేరు. ఓ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు సదరు ఉద్యోగి మిగిలిన సమయంలో ఏం చేయాలో అతని ఇష్టంపైన ఆధారపడి ఉంటుంది. సంస్థల్ని ఉద్దేశిస్తూ .. మీ నిర్ణయాన్ని వారి ఇష్టాల మీద రుద్దకూడదని’ చెప్పారు.
ఉద్యోగులపై చర్యలు తీసుకోవచ్చు
అయితే తమ ప్రత్యర్ధి సంస్థల్లో పనిచేస్తుంటే పరిమితులు విధించొచ్చు. అదనపు ఆదాయం కోసం వేరే పనులు చేసుకుంటూ సంస్థల్లో ప్రొడక్టవిటీ తగ్గితే తగు చర్యలు తీసుకునే అధికారం మేనేజర్లకు ఉంటుంది. కొన్ని అంశాల్లో మేనేజర్లు అతిగా స్పందిస్తారు. దాన్ని ఉద్యోగులు ఒక ద్రోహంగా భావిస్తారు. మీతిమీరిన స్పందనతో సిబ్బంది ఉన్న ఫళంగా రాజీనామాలు చేసి బయటకు వెళ్లడానికి అదే కారణమవుతుందని సూచించారు.
ఇలా చేస్తే మూన్‌లైటింగ్ చేయరు
బదులుగా, మేనేజర్లు తమ కింది స్థాయి సిబ్బంది సాధించిన విజయాల్ని గుర్తించాలి. రెండో ఉద్యోగం చేసుకునే అవకాశమూ కల్పించాలి. ఇలాంటి సందర్భాలలో ఉద్యోగులు మూన్‌లైటింగ్‌కు దూరంగా ఉంటారు. సంస్థలు తగిన ప్రాధాన్యం ఇస్తాయి. ఇక వారు వేరే చోట పనిచేసేందుకు మక్కువ చూపరని మైక్రోసాఫ్ట్ మాజీ హెచ్‌ఆర్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ విలియమ్స్ టెక్ కంపెనీలను హితబోధ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment