ఈ వారం ట్యాక్స్ కాలంలో పొరుగింటి మీనాక్షమ్మ మొగుడు పుల్లయ్యను చూడక తప్పదు. తగిన జాగ్రత్త తీసుకోక తప్పదు. వగలే కాని నగలెప్పుడైనా కొన్నారా అని నిలదీసి అడిగిన ఆండాళమ్మకు మొగుడు .. పక్కింటి పుల్లయ్య చేసే వ్యవహారం బైటపెడతాడు. వాడికి జీతం కన్నా గీతం ఎక్కువ.. తెలుసుకోవే.. అని. చంద్రయానం గురించి తర్వాత తెలుసుకుందాం. ‘‘చల్లని రాజా ఓ చందమా నీ కథలన్నీ తెలిసాయి’’ ఇది నాటి పాట. ప్రస్తుతం మన కథలన్నీ ఆదాయపు పన్ను వారికి తెలిసిపోతున్నాయి. మూన్‌లైటింగ్ కాదు.. మూన్ చేజింగ్.
కరోనా కాలంలో ఇంటివద్దే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఎంతో ఆదాయం సంపాదించారు. ఒక యజమాని దగ్గర పని చేస్తూ సంపాదిస్తూ, అదే సమయంలో మరో యజమాని దగ్గర చేస్తూ ఎడాపెడా రెండు చేతులా సంపాదించారు. ఇలా సంపాదించడంలో తప్పు లేదు ‘‘కష్టే ఫలి’’ అన్నారు. అలాంటి రాబడిని ఆదాయపు పన్ను వారికి చూపెట్టక పోవడమే తప్పు. 2019, 2020, 2021 ఆర్థిక సంవత్సరాల్లో ఇలా సంపాదించి వారు రిటర్నుల్లో ఆదాయాన్ని డిక్లేర్ చేయని వారికి తాఖీదులు వెళ్లాయి.
ఈ విషయం ఎలా తెలిసింది?
- ఆదాయం ఆన్‌లైన్‌లో వచ్చింది. బ్యాంకులో జమయ్యింది. డిజిటల్ ద్వారా చెల్లింపులు జరిగాయి.
- కొంత మంది ఆస్తులు కొన్నారు.
- కొంత మంది బ్యాంకు ఎఫ్‌డీలు, షేర్లు.. డిబెంచర్లలో ఇన్వెస్ట్‌మెంట్లు చేశారు.
- కొంత మంది విలాసవంతమైన వస్తువులు కొన్నారు.
- టూర్లు.. బార్లు.. కార్లూ..
- కొంత మంది రుణాలను బుద్ధిగా తీర్చేశారు.
- విదేశాలకు పంపారు కొంతమంది.
- గూగుల్ పేమెంట్లు, పేటీఎంలు.. ఇలా ఎన్నో. మీకు పేమెంట్లు చేసిన యజమానులు ఎప్పటికప్పుడు వివరాలను డిపార్టుమెంటు వారికి తెలియజేస్తున్నారు.
మీకు రాబడి .. వారికి ఖర్చు. ఆ ఖర్చులు క్లెయిమ్ చేయడం వల్ల ఆ కంపెనీలకు ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి ఆదాయపు పన్ను భారం తగ్గుతుంది. కాబట్టి వాళ్లు అన్ని వివరాలు, ఖర్చులు, జమలు, లాభనష్టాలు, సమర్పిస్తారు. టీడీఎస్ పరిధిలోకి రాకపోయినా వివరాలు మాత్రం ఇచ్చి ఉంటారు. ఇది కాకుండా పుల్లయగారికి ‘‘గీతం’’.. అంటే లంచంగా భావించారు ‘‘సంబరాల రాంబాబు’’లో పాట రచయిత. లంచం తప్పు. చట్టరీత్యా నేరం. దాన్నీ ఆదాయంగా పరిగణిస్తారు.
ఇదీ చదవండి: జీఎస్టీ రివార్డ్ స్కీమ్: బిల్లు ఉంటే చాలు.. రూ.కోటి వరకూ నగదు బహుమతులు
ఎలా బైటపడాలి?
- లెక్కలన్నీ సక్రమంగా చూపించి, బుద్ధిగా పన్ను కట్టండి.
- మీ ఇంట్లో ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద ఆ పని చేసి, వ్యవహారాలన్నీ కుటుంబ సభ్యుల అకౌంటులో వేస్తే పన్ను భారం తగ్గుతుందేమో చెక్ చేయాలి. అలాంటప్పుడు పన్ను పరిధిలో లేని వారిని ఎంచుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించి అడుగేయండి.
పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్‌కు పంపించగలరు.
Comments
Please login to add a commentAdd a comment