ఈటీఎఫ్‌ లేదా ఇండెక్స్‌ ఫండ్స్‌.. ఏది బెస్ట్? | EPF Or Index Fund Which is Best | Sakshi
Sakshi News home page

ఈటీఎఫ్‌ లేదా ఇండెక్స్‌ ఫండ్స్‌.. ఏది బెస్ట్?

Published Mon, Sep 2 2024 7:26 AM | Last Updated on Mon, Sep 2 2024 9:44 AM

EPF Or Index Fund Which is Best

ద్రవ్యోల్బణానికి దీటైన రాబడులు ఇవ్వడంలో షార్ట్‌ డ్యురేషన్‌ డెట్‌ ఫండ్స్, ఆర్‌బీఐ ఫ్లోటింగ్‌ రేట్‌ బాండ్లు ప్రభావవంతమైనవేనా? – జితేంద్ర

షార్ట్‌ డ్యురేషన్‌ డెట్‌ ఫండ్స్, ఆర్‌బీఐ ఫ్లోటింగ్‌ రేట్‌ బాండ్లు మంచి రాబడులను ఇవ్వగలవు. ఇవి ద్రవ్యోల్బణాన్ని మించి స్వల్ప రాబడులను ఇస్తాయి. అధిక రాబడుల కోసం ఈ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటే మరోసారి పునరాలోచించాల్సిందే.

సాధారణంగా స్థిరాదాయ (ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌/డెట్‌) పథకాల్లో పెట్టుబడులు పెట్టడంలో ప్రధాన లక్ష్యాలు.. 1. పెట్టుబడిని కాపాడుకోవడం. 2. పెట్టుబడులకు స్థిరత్వాన్ని అందించడం. ఇవి ఊహించతగిన రాబడులు ఇవ్వగలవు. అలా కాకుండా ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ద్వారా గొప్ప రాబడులు ఆశిస్తున్నట్టు అయితే, అది రిస్కీ ఆప్షన్లలో పెట్టుబడి పెట్టడం అవుతుంది. కానీ, దీన్ని మేము సూచించం. పోర్ట్‌ఫోలియోలో డెట్‌ సాధనాలకు కేటాయింపుల లక్ష్యాన్ని ఇది నీరుగారుస్తుంది. ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు ఆశిస్తున్నట్టు అయితే అప్పుడు పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని ఈక్విటీలకు కేటాయించడాన్ని పరిశీలించొచ్చు.

నేను నా రిటైర్మెంట్‌ అవసరాల కోసం 2040 వరకు ప్రతి నెలా రూ.25,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేయగలను. ఈటీఎఫ్‌లు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఏది మెరుగైన ఆప్షన్‌ అవుతుంది? – వినాయక్‌ రావు భోలే

ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌లు) ఏదో ఒక ఇండెక్స్‌కు అనుగుణంగా ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. ఉదాహరణకు సెన్సెక్స్, నిఫ్టీ 50. స్టాక్స్‌ మాదిరే ఇవి స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్‌ అవుతుంటాయి. ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టడం ప్యాసివ్‌ ఇన్వెస్టింగ్‌ అవుతుంది. ఈటీఎఫ్‌లు అన్నవి చాలా తక్కువ వ్యయాలతో కూడిన పెట్టుబడి సాధనాలు.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో వీటికి ప్రత్యామ్నాయం ఇండెక్స్‌ ఫండ్స్‌. ఈటీఎఫ్‌లలో సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) సాధ్యం కాదు. ఎందుకంటే ఇవి స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్‌ అవుతుంటాయి. అదే ఇండెక్స్‌ ఫండ్స్‌లో అయితే సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. సిప్‌ ద్వారా అయితే పెట్టుడులు ప్రతి నెలా క్రమం తప్పకుండా వెళ్లేందుకు సాధ్యపడుతుంది. పెట్టుబడులు సులభంగా ఉండేందుకు ఇండెక్స్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇండెక్స్‌ ఫండ్స్‌లో సిప్‌ పెట్టుబడి వేతనానికి అనుగుణంగా ఏటా పెరిగేలా చూసుకోవడం మర్చిపోవద్దు. లార్జ్‌క్యాప్‌ విభాగంలో యాక్టివ్‌ ఫండ్స్‌తో పోల్చితే ఇండెక్స్‌ ఫండ్స్‌ స్థానం బలమైనది.

ధీరేంద్ర కుమార్‌ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement