Index Fund
-
మెరుగైన రాబడులకు.. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్..
గడిచిన దశాబ్దకాలంగా దేశీయంగా మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో ఒకటిగా మారింది. ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ విస్తృతి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లకు (సిప్) ఆదరణ పెరుగుతుండటం మొదలైన సానుకూలాంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి. గత పదేళ్లుగా ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. 2014లో మొత్తం ఏయూఎంలో (నిర్వహణలోని ఆస్తులు) వీటి పరిమాణం 2 శాతమే ఉండగా 2024 జూన్ నాటికి ఏకంగా 17 శాతానికి (మొత్తం ఏయూఎం రూ. 10,00,000 కోట్లకు పైగా ఉంటుంది) ఎగిసింది. ఇంత వేగంగా పరిశ్రమ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారిపోతున్న ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణంగా వినూత్నమైన ఉత్పత్తులు, కొత్త వ్యూహాలను ప్రవేశపెట్టడంపై అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీ) కసరత్తు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ వ్యూహం తెరపైకి వచ్చింది. అధిక రాబడులనిస్తూ, రిస్కులను తగ్గిస్తూ, మెరుగైన డైవర్సిఫికేషన్ ప్రయోజనాలను అందించే విధంగా ఇది ఉంటుంది.సెక్యూరిటీస్‌లో అంతర్గతంగా మెరుగైన రాబడులు అందించే నిర్దిష్ట లక్షణాలను లక్ష్యంగా చేసుకుని ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ పని చేస్తుంది. ఫ్యాక్టర్ ఫండ్స్ అనేవి భారత్‌లో ఇండెక్స్ ఫండ్, ఈటీఎఫ్ ఫార్మాట్లో తక్కువ వ్యయాలతో అందుబాటులో ఉంటున్నాయి. నాణ్యత (క్వాలిటీ), విలువ (వేల్యూ), పరిమాణం (సైజ్), గతి (మూమెంటమ్), తక్కువ ఒడిదుడుకులు వంటి నిర్దిష్ట గుణాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ద్వారా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా తమ పోర్ట్‌ఫోలియోలను తీర్చిదిద్దుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు, వేల్యూ ఇన్వెస్టింగ్ అనేది ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్లో ఒక భాగం. ఇది తక్కువ వేల్యుయేషన్లతో ఉన్న సెక్యూరిటీలను టార్గెట్ చేయడం ద్వారా ప్రయోజనాలను అందించేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే, మూమెంటమ్ ఇ న్వెస్టింగ్ అనే విధానం, ధర పెరుగుతున్న ట్రెండ్ ఆధారితమైనదిగా ఉంటుంది.సంపద సృష్టి: చారిత్రకంగా మార్కెట్‌ను మించి రాబడులు పొందడానికి తోడ్పడే నిర్దిష్ట గుణాలను లక్ష్యంగా పెట్టుకుని ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ పని చేస్తుంది. వివిధ మార్కెట్లు, అసెట్ క్లాస్‌లు, కాలవ్యవధులవ్యాప్తంగా ఇది పనిచేస్తుంది. ఒక పద్ధతి ప్రకారం ఈ ఫ్యాక్టర్లను ఉపయోగించడం ద్వారా ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను ఎలాంటి ఆరి్థక పరిస్థితుల్లోనైనా, మార్కెట్లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా నిలదొక్కుకోగలిగేలా మరింత పటిష్టంగా తీర్చిదిద్దుకోవచ్చు. పరిశోధనల ప్రకారం చారిత్రకంగా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది మార్కెట్ బెంచ్‌మార్క్‌లను మించిన పనితీరు కనపర్చింది. సరిగ్గా ఉపయోగించుకుంటే ఇది ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో సంపద సృష్టించి ఇవ్వగలదు.రిస్క్ మేనేజ్మెంట్: వివిధ మార్కెట్ పరిస్థితుల్లో మెరుగ్గా రాణించే ఫ్యాక్టర్లను లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా రిసు్కలను సమర్ధవంతంగా అదుపులో ఉంచుకునేందుకు ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ సహాయపడుతుంది. ఉదాహరణకు మార్కెట్లు పతనమవుతున్న తరుణంలో, తక్కువ హెచ్చుతగ్గులకు లోనయ్యే స్టాక్స్ మెరుగ్గా ఉంటాయి. నష్టభారాన్ని తగ్గిస్తాయి. తీవ్ర ఒడిదుడుకులు ఉన్న పరిస్థితుల్లో పోర్ట్‌ఫోలియోను స్థిరపర్చుకునేందుకు ఈ విధానం సహాయపడుతుంది.పారదర్శకత: మిగతా పాసివ్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్, ఈటీఎఫ్) తరహాలోనే ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ వ్యూహాలు కూడా సాధారణంగా రూల్స్ ఆధారితమైనవిగా ఉంటాయి. అంటే, పెట్టుబడులను పెట్టేందుకు నిర్దిష్ట నిబంధనలను పాటిస్తాయి. పెట్టుబడి నిర్ణయాల వెనుక గల హేతుబద్ధతను అర్థం చేసుకునేందుకు, తమ పోర్ట్‌ఫోలియోలను సులభతరంగా పర్యవేక్షించుకునేందుకు, నిర్వహించుకునేందుకు ఇన్వెస్టర్లకి ఈ పారదర్శకత ఉపయోగకరంగా ఉంటుంది.డైవర్సిఫికేషన్: ఒకదానితో మరొక దానికి మరీ అధిక స్థాయిలో పరస్పర సంబంధం ఉండని వివిధ ఫ్యాక్టర్లవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది వైవిధ్యానికి సంబంధించిన ప్రయోజనాలను కల్పిస్తుంది. ఏదైనా ఒక ఫ్యాక్టర్ పనితీరు బాగా లేకపోతే పోర్ట్‌ఫోలియోలో దాని ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది. రిస్కులకు తగ్గ మెరుగైన రాబడులను అందుకోవడానికి వివిధ ఫ్యాక్టర్లను కలిపి వాడే వ్యూహాన్ని అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు ఉపయోగిస్తుంటారు.సౌలభ్యం: టెక్నాలజీ, డేటా వంటి అంశాల్లో పురోగతి కారణంగా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ ప్రస్తుతం ఇన్వెస్టర్లకు మరింతగా అందుబాటులోకి వచ్చింది. ఫ్యాక్టర్ ఆధారిత వ్యూహాలను సులభతరంగా అమలు చేయడానికి సాధనాలు, ప్లాట్‌ఫాంలు వీలు కల్పిస్తున్నాయి. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది మెరుగైన రాబడులు అందించేలా, రిస్కులను నియంత్రించుకునేలా, తక్కువ వ్యయాలతో కూడుకున్న పెట్టుబడి సాధనాలను వినియోగించుకునేలా పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోవాల్సిన అంశాలు.. ఫ్యాక్టర్స్ కొన్నాళ్ల పాటు అండర్పెర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు వేల్యూ స్టాక్స్ అనేవి నిర్దిష్ట మార్కెట్ పరిస్థితుల్లో గ్రోత్ స్టాక్స్‌తో పోలిస్తే వెనుకబడొచ్చు. ఒకే ఫ్యాక్టర్‌లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఒకవేళ ఆ ఫ్యాక్టర్ పనితీరు సరిగ్గా లేకపోతే గణనీయంగా నష్టాలు రావచ్చు. తప్పిదాల వల్ల పనితీరు దెబ్బతినే అవకాశం ఉన్నందున, ఫ్యాక్టర్ ప్రీమియంలను కచ్చితంగా గుర్తించి, అందిపుచ్చుకోవాలంటే అధునాతన మోడల్స్, విస్తృతమైన డేటా విశ్లేషణ అవసరమవుతుంది. మార్కెట్ పరిస్థితులు గానీ ఇన్వెస్టర్ ధోరణి గానీ మారితే ఫ్యాక్టర్ వ్యూహాల సామర్థ్యాలపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు ఒకవేళ పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు అదే ఫ్యాక్టర్ వ్యూహాన్ని అమలు చేయడం మొదలుపెట్టారంటే, ఫ్యాక్టర్ ప్రయోజనం తగ్గిపోవచ్చు. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ వ్యూహాలు అమలు చేయాలనుకునే ఇన్వెస్టర్లు ఈ రిస్కులను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. రిసు్కలను తగ్గించుకునేందుకు వివిధ ఫ్యాక్టర్లవ్యాప్తంగా డైవర్సిఫికేషన్ పాటించాలి. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటే సహాయకరంగా ఉంటుంది. చదవండి: మిడ్‌క్యాప్ విభాగంలో మెరుగైన రాబడులు ఇలా!రిస్కు సామర్థ్యాలను బట్టి.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి లక్ష్యాలు, రిస్కు సామర్థ్యాలకు అనుగుణంగా నిర్దిష్ట ఫ్యాక్టర్స్‌ను టార్గెట్‌గా పెట్టుకుని తమ పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకోవచ్చు. ఉదాహరణకు అధిక రిస్కు సామర్థ్యాలున్న ఇన్వెస్టర్లు, మూమెంటమ్ లేదా సైజ్ వంటి ఫ్యాక్టర్లకు మరింత ఎక్కువగా కేటాయించవచ్చు. ఇవి మరింత ఎక్కువ ఒడిదుడుకులకు లోనైనా అధిక రాబడులనిచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారు నాణ్యమైన, తక్కువ ఒడిదుడుకులుండే ఫ్యాక్టర్లను ఎంచుకోవచ్చు. ఇక, గ్రోత్ కోరుకునే ఇన్వెస్టర్లు, వేల్యూ అలాగే మూమెంటమ్కి ప్రాధాన్యతనివ్వొచ్చు. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు కూడా దాదాపు ఇలాంటి ఫ్యాక్టర్ మేళవింపులనే ఎంచుకుంటూ ఉంటారు. చివరగా చెప్పాలంటే, ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది అధిక రాబడులను అందించే నిర్దిష్ట చోదకాలను అందిపుచ్చుకునేందుకు ఉపయోగపడే ఒక విధానం. రిసు్కలను తగ్గించుకుని, అధిక రాబడులను అందుకునే అవకాశాలను ఇది కల్పిస్తుంది. అదే సమయంలో దీనిలో కూడా ఉండే కొన్ని రిస్కులను దృష్టిలో ఉంచుకుని, తమ వ్యక్తిగత ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్‌ను బట్టి ఇన్వెస్టర్లు వ్యూహాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాక్టర్లను అర్థం చేసుకుని, జాగ్రత్తగా ఎంచుకోగలిగితే ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాలను మరింత సమర్ధమంతంగా సాధించుకోగలుగుతారు. -
ఈటీఎఫ్ లేదా ఇండెక్స్ ఫండ్స్.. ఏది బెస్ట్?
ద్రవ్యోల్బణానికి దీటైన రాబడులు ఇవ్వడంలో షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్, ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్లు ప్రభావవంతమైనవేనా? – జితేంద్రషార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్, ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్లు మంచి రాబడులను ఇవ్వగలవు. ఇవి ద్రవ్యోల్బణాన్ని మించి స్వల్ప రాబడులను ఇస్తాయి. అధిక రాబడుల కోసం ఈ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే మరోసారి పునరాలోచించాల్సిందే.సాధారణంగా స్థిరాదాయ (ఫిక్స్డ్ ఇన్కమ్/డెట్) పథకాల్లో పెట్టుబడులు పెట్టడంలో ప్రధాన లక్ష్యాలు.. 1. పెట్టుబడిని కాపాడుకోవడం. 2. పెట్టుబడులకు స్థిరత్వాన్ని అందించడం. ఇవి ఊహించతగిన రాబడులు ఇవ్వగలవు. అలా కాకుండా ఫిక్స్డ్ ఇన్కమ్ ద్వారా గొప్ప రాబడులు ఆశిస్తున్నట్టు అయితే, అది రిస్కీ ఆప్షన్లలో పెట్టుబడి పెట్టడం అవుతుంది. కానీ, దీన్ని మేము సూచించం. పోర్ట్‌ఫోలియోలో డెట్ సాధనాలకు కేటాయింపుల లక్ష్యాన్ని ఇది నీరుగారుస్తుంది. ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు ఆశిస్తున్నట్టు అయితే అప్పుడు పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని ఈక్విటీలకు కేటాయించడాన్ని పరిశీలించొచ్చు.నేను నా రిటైర్మెంట్ అవసరాల కోసం 2040 వరకు ప్రతి నెలా రూ.25,000 చొప్పున ఇన్వెస్ట్ చేయగలను. ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఏది మెరుగైన ఆప్షన్ అవుతుంది? – వినాయక్ రావు భోలేఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) ఏదో ఒక ఇండెక్స్‌కు అనుగుణంగా ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఉదాహరణకు సెన్సెక్స్, నిఫ్టీ 50. స్టాక్స్ మాదిరే ఇవి స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్ అవుతుంటాయి. ఈటీఎఫ్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టడం ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అవుతుంది. ఈటీఎఫ్‌లు అన్నవి చాలా తక్కువ వ్యయాలతో కూడిన పెట్టుబడి సాధనాలు.మ్యూచువల్ ఫండ్స్‌లో వీటికి ప్రత్యామ్నాయం ఇండెక్స్ ఫండ్స్. ఈటీఎఫ్‌లలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) సాధ్యం కాదు. ఎందుకంటే ఇవి స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్ అవుతుంటాయి. అదే ఇండెక్స్ ఫండ్స్‌లో అయితే సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిప్ ద్వారా అయితే పెట్టుడులు ప్రతి నెలా క్రమం తప్పకుండా వెళ్లేందుకు సాధ్యపడుతుంది. పెట్టుబడులు సులభంగా ఉండేందుకు ఇండెక్స్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్స్‌లో సిప్ పెట్టుబడి వేతనానికి అనుగుణంగా ఏటా పెరిగేలా చూసుకోవడం మర్చిపోవద్దు. లార్జ్‌క్యాప్ విభాగంలో యాక్టివ్ ఫండ్స్‌తో పోల్చితే ఇండెక్స్ ఫండ్స్ స్థానం బలమైనది.ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
దీర్ఘకాలంలో నమ్మకమైన లాభాలనిచ్చే ఫండ్.. ఓ లుక్కేయండి..
లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ వేల్యుయేషన్లను అర్థం చేసుకోవడం సాధారణ ఇన్వెస్టర్లకు కష్టమైన విషయమే. భవిష్యత్తులో వీటిల్లో ఏ విభాగం, మిగిలిన విభాగాలతో పోలిస్తే మంచి పనితీరు చూపిస్తుందని ముందుగా గుర్తించడం కూడా కష్టమే. గత 15 ఏళ్ల కాలంలో లార్జ్‌క్యాప్ ఇండెక్స్ నాలుగేళ్ల కాలంలో మంచి పనితీరు చూపించగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా నాలుగు సంవత్సరాలలో మంచి పనితీరు ప్రదర్శించింది. కానీ, స్మాల్‌క్యాప్ మాత్రం ఏడేళ్లలో మంచి పనితీరు చూపించింది. కనుక ప్రతీ విభాగంలోనూ ఇన్వెస్టర్ దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రాబడులు ఆర్జించడానికి మంచి అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇలా లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టి మంచి రాబడులు ఇచ్చేవే ఫ్లెక్సీక్యాప్, మలీ్టక్యాప్ ఫండ్స్. ఈ విభాగంలో ఎంతో కాలంగా పనిచేస్తూ, మంచి పనితీరు చూపుతున్న పథకాల్లో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. రాబడులు ఈ పథకం ఏ కాలంలో చూసినా కానీ, బెంచ్ మార్క్ అయిన బీఎస్ఈ 500 టీఆర్ఐ కంటే మెరుగైన పనితీరు చూపించింది. గడిచిన ఏడాది కాలంలో 37.58 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. మూడేళ్లలో కాలంలో వార్షిక రాబడి 24.27 శాతంగా ఉంది. ఇక ఐదేళ్ల కాలంలో 19.40 శాతం, ఏడేళ్లలో 16.44 శాతం, పదేళ్లలో 17.13 శాతం చొప్పున వార్షిక రాబడి ఈ పథకంలో భాగంగా ఉంది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడితో పోల్చి చూస్తే, ఈ పథకమే 3 శాతం నుంచి 8 శాతం మేర అధిక రాబడిని వివిధ కాలాల్లో అందించినట్టు తెలుస్తోంది. ఇక బీఎస్ఈ 500 టీఆర్ఐతో చూసినా కానీ, ఈ పథకంలోనే 1–6 శాతం మేర వివిధ కాలాల్లో అధిక రాబడి కనిపిస్తుంది. ఈ పథకం 1995 జనవరి 1న ప్రారంభమైంది. గతంలో హెచ్డీఎఫ్సీ ఈక్విటీ ఫండ్ కాగా, అనంతరం ఫ్లెక్సీక్యాప్గా మారింది. ఆరంభం నుంచి వార్షిక రాబడి 19 శాతం మేర ఉండడం గమనించొచ్చు. పెట్టుబడుల విధానం/ఫోర్ట్‌ఫోలియో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌కు దేశ ఈక్విటీ మార్కెట్లో సుదీర్ఘ ట్రాక్ రికార్డు ఉండడం గమనార్హం. తొలుత రూ.52 కోట్లతో ఆరంభమైన ఈ పథకంలో ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ ఏడాది జనవరి చివరికి రూ.47,642 కోట్లుగా ఉన్నాయి. ప్రతి మార్కెట్ సైకిల్లో మంచి పనితీరు చూపించే అవకాశం ఉన్న రంగాలు, కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం ప్రత్యేకత. ప్రస్తుతం ఈ పథకం తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 87.5 శాతమే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. డెట్ సాధనాల్లో 0.42 శాతం పెట్టుబడులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాల్లోనూ 3.79 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. నగదు, నగదు సమానాల రూపంలో 8.29 శాతం పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీల్లో 91 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 7.61 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 1.52 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్‌ఫోలియోలో 41 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 32 శాతం పెట్టుబడులు పెట్టింది. హెల్త్‌కేర్ కంపెనీలకు 12.59 శాతం, టెక్నాల జీ కంపెనీలకు 9.5 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 7.39 శాతం చొప్పున కేటాయించింది. -
జీవిత బీమా రంగంలో తొలి స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఇదే..
ముంబై: మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తాజాగా యులిప్స్ విభాగంలో నిఫ్టీ స్మాల్‌క్యాప్ క్వాలిటీ ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. జీవిత బీమా రంగంలో ఇదే తొలి స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫండ్ అని సంస్థ సీనియర్ డైరెక్టర్ మిహిర్ వోరా తెలిపారు. పదేళ్ల వ్యవధిలో 22 శాతం రాబడి అందించిన నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 క్వాలిటీ 50 సూచీ దీనికి ప్రామాణికంగా ఉంటుందని వివరించారు. యూనిట్‌కు రూ. 10 చొప్పున ఈ న్యూ ఫండ్ ఆఫర్ ఆగస్టు 25 వరకు అందుబాటులో ఉంటుంది. అధిక రిస్కు సామరŠాధ్యలు కలిగి ఉండి, దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు కోరుకునే ఇన్వెస్టర్లకు ఇది అనువైనదిగా ఉంటుందని వోరా వివరించారు. -
ఒకే విడతలో రూ.3 లక్షలు ఇన్వెస్ట్.. ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా?
పదేళ్లకు మించి నేను సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయగలను. నా ఈక్విటీ పెట్టుబడుల్లో 50 శాతం నుంచి 60 శాతం మేర స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – ఉమేష్ యాదవ్ దీర్ఘకాల పెట్టుబడులకు సంబంధించి ఈక్విటీలకు పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం సరైనది. ఒకే రకం ఫండ్ లేదా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోనే ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి దూరంగా ఉండాలి. 50–60% మేర మిడ్, స్మాల్ క్యాప్స్ పెట్టుబడులతో ప్రధాన పోర్ట్‌ఫోలియో నిర్మించుకోవడం అన్నది సూచనీయం కాదు. దీనికి బదులు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే మిడ్, స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 25– 30 శాతానికి పరిమితం అవుతాయి. లార్జ్‌క్యాప్ పెట్టుబడులు 70% మేర ఉంటాయి. వృద్ధికితోడు, స్థిరత్వాన్ని ప్రదర్శించే స్టాక్స్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. రిస్క్ ఎక్కువగా ఉండే సాధనాలకు తక్కువ కేటాయింపులు చేసుకోవాలి. మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ అనేవి దీర్ఘకాలంలో ఫ్లెక్సీక్యాప్ కంటే ఎక్కువ రాబడులను ఇస్తాయి. కానీ, స్వల్పకాలంలో తీవ్ర అస్థిరతల మధ్య చలిస్తాయి. కనుక వీటిల్లో రిస్క్ ఎ క్కువగా ఉంటుంది. అందుకే వీటికి 50–60% కేటాయింపులు చేయడం వల్ల పెట్టుబడుల్లో అధిక భాగం అస్థిరతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక అస్థితరలు ఉన్నా సరే, దీర్ఘకాలంలో అధిక రాబడులు కో రుకుంటే అప్పుడు ఫ్లెక్సీక్యాప్తోపాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేను ఒకే విడతలో రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా? లేదా నెలవారీ, త్రైమాసికం వారీ ఆదాయం వచ్చేలా ఎస్‌డబ్ల్యూపీ ఎంపిక చేసుకోవాలా? – శంకర్ నారాయణన్ ఇండెక్స్ ఫండ్ అనేది నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ తదితర సూచీల్లో (ఇండెక్స్‌ల్లో) ఇన్వెస్ట్ చేసేది. మరోవైపు సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) అనేది పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకునే సాధనం. ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే సంబంధిత సూచీ రాబడులకు అనుగుణంగానే ఉంటాయి. ఎస్‌డబ్ల్యూపీ ద్వారా మీరు కోరుకున్నంత ప్రతి నెలా ఉపసంహరించుకోవచ్చు. రూ.లక్షను 10 నెలల్లో ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంటే ప్రతి నెలా రూ.10వేలను ఎస్డబ్ల్యూపీగా ఎంపిక చేసుకోవాలి. మీ దగ్గర కొంత మొత్తం ఫండ్ ఉండి, ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటుంటే దాన్ని ఒకే విడత కాకుండా ఆరు నుంచి 12 నెలల పరిధిలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టుకోవాలి. క్రమం తప్పకుండా ఆదాయ మార్గం ఏర్పాటు చేసుకోవాలంటే.. మూడింట ఒక వంతును ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రిస్క్ వద్దనుకునే వారు లార్జ్‌క్యాప్ ఫండ్ లేదా ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒక ఏడాది అవసరాలకు సరిపడా (మొత్తం పెట్టుబడిలో 6 శాతం మించకుండా) లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్లో, అది కూడా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టుకోవాలి. ఏడాదికోసారి మీ ఈక్విటీ పెట్టుబడులు 33–35 శాతం మించకుండా, తగ్గకుండా రీబ్యాలన్స్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఏటా ఏడాది అవసరాలకు సరిపడా మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లోకి మళ్లించుకోవాలి. ఈ మొత్తాన్ని ఏటా 5 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. అలాగే, ఉపసంహరించుకునే మొత్తం ఏటా పెట్టుబడిలో 6 శాతం మించకుండా చూసుకోవాలి. -
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, కొత్త ఫండ్ చూశారా?
హైదరాబాద్: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తాజాగా యాక్సిస్ నిఫ్టీ ఎస్డీఎల్ సెప్టెంబర్ 2026 డెట్ ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది ఓపెన్ ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్. నవంబర్ 16తో ముగుస్తుంది. కనీసం రూ. 5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నిఫ్టీ ఎస్డీఎల్ సెప్టెంబర్ 2026 ఇండెక్స్‌లోని సెక్యూరిటీల ఆధారంగా మెరుగైన రాబడులు అందించడం దీని లక్ష్యం. దీర్ఘకాలిక కోణంలో 3-5 ఏళ్ల వ్యవధికి నాణ్యమైన డెట్ పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు అనువైనది. (పీఎన్బీ ఖాతాదారులకు గుడ్ న్యూస్) -
ఏ ఫండ్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలొస్తాయ్!
ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే విషయంలో పరిశీలించాల్సిన ముఖ్య అంశాలు రెండున్నాయి. ఒకటి ఎక్స్పెన్స్ రేషియో. ప్రస్తుతం ఇండెక్స్ ఫండ్స్ మధ్య చాలా పోటీ ఉంది. 10–15 బేసిస్ పాయింట్ల (0.1–0.15 శాతం) ఎక్స్పెన్స్ రేషియోకే ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుక అంతకంటే ఎక్కవ చెల్లించాల్సిన అవసరం లేదు. రెండోది ట్రాకింగ్ ఎర్రర్. ఒక ఇండెక్స్ ఫండ్.. తాను పెట్టుబడులను అనుసరించే ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంత మెరుగ్గా పనిచేసిందన్నది ఇది చెబుతుంది. ఇండెక్స్ ఫండ్ నిర్వహణ బృందం సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. తక్కువ ఎక్స్పెన్స్ రేషియోతోపాటు.. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉన్న పథకం మెరుగైనది అవుతుంది. ఈ రెండు అంశాలను ప్రామాణికంగా చేసుకుని చూస్తే ఎస్బీఐ, యూటీఐ, హెచ్డీఎఫ్సీ సంస్థల పథకాలు మెరుగ్గా పనిచేస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్ యూనిట్లను గతేడాది కొనుగోలు చేశాను. వాటిని నేను ఇప్పుడు విక్రయించినట్టయితే ఎగ్జిట్ లోడ్ ఉంటుందా? – శశికళ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్‌లో మీ పెట్టుబడి తేదీ నుంచి ఏడాది పూర్తయినట్టయితే ఎటువంటి ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. ఒకవేళ ఒకే విడత కాకుండా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చి ఉంటే అప్పుడు పెట్టుబడి మొత్తానికి ఏడాది పూర్తయి ఉండదు. అలా ఏడాది పూర్తి కాని మొత్తాలను వెనక్కి తీసుకుంటే ఆ మొత్తం విలువపై ఒక శాతం ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి వస్తుంది. ఎగ్జిట్ లోడ్ విషయంలో చాలా మంది అయోమయానికి గురవుతుంటారు. కానీ, వారు పెట్టుబడి చేసిన నాటికి ఉన్న ఎగ్జిట్ లోడ్ విధానమే అమలవుతుందని గుర్తు పెట్టుకోవాలి. పైగా కొందరికి అసలు ఎగ్జిట్ లోడ్ గురించే తెలియదు. పెట్టుబడి వెనక్కి తీసుకున్న సమయంలో.. అందులోంచి ఎగ్జిట్‌లోడ్‌ను మిహాయించిన తర్వాతే వారికి ఆ విషయం తెలిసి వస్తుంది. కనుక మీ పెట్టుబడులకు సంబంధించి ఎగ్జిట్ లోడ్ విషయంలో స్పష్టత కోసం కస్టమర్ కేర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు. కామ్స్ వెబ్సైట్ నుంచి ఎగ్జిట్ లోడ్ స్టేట్మెంట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్యాల్యూ రీసెర్చ్ ప్రీమియం చందాదారులు ‘మై ఇన్వెస్ట్మెంట్’ టూల్ సాయంతో తాము ఇన్వెస్ట్ చేసిన పథకానికి సంబంధించి ఎగ్జిట్ లోడ్ వివరాలను తెలుసుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లలో వ్యయాలు, లిక్విడిటీ పరంగా ఏది మెరుగైనది? – దినేష్ జనార్థన్ వ్యయాల పరంగా చూస్తే ఈటీఎఫ్ (ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్) పథకాలకు అనుకూలత ఎక్కువ. 5–7 బేసిస్ పాయింట్లకే ఈటీఎఫ్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు సైతం 10–15 బేసిస్ పాయింట్ల ఎక్స్పెన్స్ రేషియోకి పెట్టుబడుల సేవలను ఆఫర్ చేస్తున్నవీ ఉన్నాయి. వ్యయాల పరంగా ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్ మధ్య పెద్ద వ్యత్యాసం లేదు. లిక్విడిటీ పరంగా చూస్తే, ఇండెక్స్ఫండ్స్ విషయంలో ఆందోళన అక్కర్లేదు. పెట్టుబడుల ఉపసంహరణను అన్ని పనిదినాల్లో నాటి ఎన్ఏవీ ఆధారంగా చెల్లింపులకు ఫండ్స్ సంస్థలు కట్టుబడి ఉండాల్సిందే. కనుక లిక్విడిటీ విషయంలో ఇక్కడ ఆందోళన అనవసరం. ఈటీఎఫ్‌ల విషయంలో లిక్విడిటీ వివిధ పథకాల మధ్య కొంత భిన్నంగా ఉండొచ్చు. కొన్ని పథకాలు రోజువారీగా అధిక వ్యాల్యూమ్ (పరిమాణం)లో ట్రేడ్ అవుతుంటాయి. కానీ, అన్నింటి విషయంలో ఇలా ఉండదు. కనుక ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఆయా పథకాల ట్రేడింగ్ పరిమాణాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే ఇండెక్స్ ఫండ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను ఈటీఎఫ్ కోసం తెరవాల్సిన శ్రమ తప్పుతుంది. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలున్న వారికి ఈటీఎఫ్‌లు కూడా మెరుగైన ఎంపికే అవుతుంది. -
మంచి ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక ఎలా?
మల్టీక్యాప్ ఎన్‌ఎఫ్‌వోల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? మల్టీక్యాప్ పేరుతో కొత్తగా వస్తున్న ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?– ఆశిష్ ఈ తరహా పథకాల నుంచి అర్థవంతమైన రాబడులు అందుకోగలమా? అన్నది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. మల్టీక్యాప్, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ మధ్య వ్యత్యాసం ఉంది. నేడు ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ అనుసరిస్తున్న పెట్టుబడుల విధానాన్ని గతంలో మల్టీక్యాప్ ఫండ్స్ పాటించాయి. వాటిపై ఎటువంటి నియంత్రణలు లేవు. కనుక మార్కెట్ క్యాప్ పరిమితితో సంబంధం లేకుండా ఫండ్ మేనేజర్లు తమ స్వేచ్ఛ కొద్దీ ఇన్వెస్ట్ చేసుకునేవారు. దీంతో వాటి విధానం మార్చే దిశగా సెబీ మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఇప్పుడు మల్టీక్యాప్ ఫండ్స్ కచ్చితంగా 25 శాతం చొప్పున లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. చాలా వరకు మల్టీక్యాప్ ఫండ్స్ నిర్వహణ ఆస్తుల పెరంగా పెద్దగా మారిపోయాయి. దీంతో 25 శాతం చొప్పున ప్రతీ విభాగంలో పెట్టుబడులు కచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలన్నది వాటికి ప్రతిబంధకమే. ఎందుకంటే భారీ పెట్టుబడులకు తగ్గ అవకాశాలు స్మాల్ క్యాప్, మిడ్‌క్యాప్ విభాగంలో అన్ని వేళలా ఉండాలని లేదు. దీంతో వాటి నుంచి ఆందోళన వ్యక్తం అయింది. పరిశ్రమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సెబీ మార్కెట్‌కు ఇది ప్రతికూలంగా మారుతుందని గుర్తించింది. దీంతో ఫ్లెక్సీక్యాప్ పేరుతో మరో విభాగాన్ని తీసుకొచ్చింది. 25% చొప్పున కచ్ఛితంగా ప్రతీ విభాగంలో ఇన్వెస్ట్ చేయడం వీలు కాకపోతే మల్టీక్యాప్ పథకాలు ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి మారిపోవచ్చంటూ వెసులుబాటునిచ్చింది. దీంతో చాలా మల్టీక్యాప్ పథకాలు ఫ్లెక్సీక్యాప్ కిందకు మారిపోయాయి. కొత్త పథకం ఆవిష్కరించడం ద్వారా మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించొచ్చని మ్యూచువల్ ఫండ్ సంస్థలు భావించాయి. ఒక్కో విభాగంలో ఒక్క పథకమే ఉండాలన్నది సెబీ నిబంధన. దీంతో మల్టీక్యాప్ నుంచి ఫ్లెక్సీక్యాప్ కిందకు మారిపోయిన ఫండ్స్ సంస్థలు.. ఇప్పుడు మల్టీక్యాప్ విభాగంలో కొత్త పథకాలను (ఎన్‌ఎఫ్‌వోలు) ప్రకటిస్తున్నాయి. కనుక అవి తమకు అనుకూలమా? కాదా? అని ఇన్వెస్టర్లు ప్రశ్నించుకోవాలి. మల్టీక్యాప్ పథకాలు వాటి పనితీరును నిరూపించుకోవాల్సి ఉంది. వీటిల్లో ఆరంభంలో ఇన్వెస్ట్ చేయకపోతే పెద్దగా కోల్పోయేదేమీ ఉండదు. దూరంగా ఉండొచ్చు. మంచి ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక ఎలా? – శశాంక్ ఎక్స్పెన్స్ రేషియో చూడాలి. ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల తీరు ఎలా ఉందన్నది పరిశీలించాలి. వ్యాల్యూ రీసెర్చ్ పోర్టల్‌లో అన్ని పథకాలకు సంబంధించి పనితీరు ప్యారా మీటర్లను పరిశీలించుకోవచ్చు. ఇండెక్స్‌తో పోలిస్తే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారం కూడా లభిస్తుంది. కొంత ట్రాకింగ్ లోపం ఉండే అవకాశం లేకపోలేదు. ఎక్స్పెన్స్ రేషియోను పరిశీలించడం కీలకమన్నది గమనించండి. మూడేళ్లలో రూ.10 లక్షలు సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. పెట్టుబడి మొత్తంలో 60 శాతాన్ని ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌కు, 40 శాతాన్ని లార్జ్‌క్యాప్ ఫండ్స్‌కు కేటాయించుకోవచ్చా? – అంకిత్ రాజీపడలేని లక్ష్యం కోసం అయితే ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి. మూడేళ్ల కాలం అన్నది ఈక్విటీ పెట్టుబడులకు సరిపోదు. ఎందుకంటే అంత స్వల్పకాలంలో ఈక్విటీ మార్కెట్ తీరు ఎలా ఉంటుందన్నది ఎవరూ చెప్పలేరు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో మూడేళ్ల కాలం ఇన్వెస్ట్ చేసినా, నష్టపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎవరైనా ఒకరు ప్రతినెలా రూ.10,000 చొప్పున మూడేళ్లకాలంలో రూ.3.6 లక్షలను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చూస్తూ వెళితే చివర్లో ఆ మొత్తం విలువ రూ.2.5 లక్షలుగానే ఉండొచ్చు. ఒకవేళ రిస్క్ తీసుకునే అవకాశం ఉండి, వచ్చే మూడేళ్లలో ఈక్విటీలు మంచి రాబడులను ఇస్తాయన్న నమ్మకం మీకు ఉంటే అప్పుడు మూడేళ్లకోసం అయినా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులు ఏవైనా కనీసం ఐదేళ్ల పాటు వేచి చూడగలనన్న సన్నద్ధతతో ఉండాలి. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) -
క్రిప్టోల ఫండమెంటల్స్ విశ్లేషించడం ఎలా?
ఫండ్స్‌లో లాభాలపై పన్ను ఆదా చేసుకోవచ్చా? మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చే లాభాలపై పన్ను ఆదా చేసుకునే మార్గం ఉందా? –జగన్మోహన్ 2018 వరకు ఈక్విటీ పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను లేదు. 2018లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో దీన్ని ప్రతిపాదించారు. ఏడాదికి మించిన దీర్ఘకాల పెట్టుబడులపై మూలధన లాభం రూ.లక్ష వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను ఉండదు. అంతకుమించిన లాభంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక మీరు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. లాభం రూ.లక్ష వరకు ఉంటే విక్రయించుకోవాలి. లాభాలను కాపాడుకోవడానికి మార్గం ఇదే. నిర్ణీత కాలానికి మీ పెట్టుబడులపై పన్నుల్లేని లాభాలను సమకూర్చుకోవచ్చు. అంటే మినహాయింపుల పరిమితి మేరకు లాభం తీసుకుంటూ, తిరిగి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం. కానీ, దీని గురించి పెద్దగా పట్టించుకోవద్దన్నది నేనిచ్చే సలహా. మీరు 15–20 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఇదేమీ పెద్దదిగా అనిపించదు. ప్రతీ రూ.లక్ష లాభంపై ఆదా చేసేది కేవలం రూ.10,000. ఇంత చిన్న మొత్తానికి తలపోటు పని పెట్టుకోవడం అనవసరం. ఒకవేళ ఇదేమీ శ్రమగా భావించడం లేదనుకుంటే లాభం రూ.లక్షకు చేరగానే వెనక్కి తీసుకోవచ్చు. క్రిప్టోల ఫండమెంటల్స్ విశ్లేషించడం ఎలా? ఈక్విటీ షేర్ల మాదిరిగా.. క్రిప్టోలను వాటి ఫండమెంటల్స్ (ఆర్థిక మూలాలు) ఆధారంగా విశ్లేషించే మార్గం ఏదైనా ఉందా? – పీఎం అన్నాదురై క్రిప్టో కరెన్సీలను వాటి మూలాల ఆధారంగా విశ్లేషించే మార్గమే లేదు. ఒక దేశం గురించి తెలుసుకోవడం ద్వారా కరెన్సీని విశ్లేషించగలరు. ఒక దేశంగా భారత్ మరిన్ని డాలర్లను కొనుగోలు చేయగలదు. లేదా విక్రయించగలదు. ఎందుకంటే మనం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. ఎన్నో స్థూల ఆర్థిక వ్యత్యాసాలున్నా కానీ ఒక దేశ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా కరెన్సీని విశ్లేషించుకోవచ్చు. క్రిప్టోలకు సంబంధించి విశ్లేషించేందుకు అటువంటి అంశాలేవీ లేవు. ఒకే ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తున్నా కానీ వివిధ ఇండెక్స్ ఫండ్స్ ఎన్ఏవీల్లో వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? – అశోక్ కుమార్ ఒక్కో పథకం ఒక్కో సమయంలో ప్రారంభం కావడం వల్లే ఈ అంతరం కనిపిస్తుంది. ఉదాహరణకు బీఎస్ఈ సెన్సెక్స్ ఆధారితంగా 2000 సంవత్సరంలో ఒక పథకం రూ.10 ఎన్ఏవీతో ప్రారంభమై ఉంటే.. సెన్సెక్స్ పనితీరు ఆధారంగా ఇప్పుడు అదే పథకం ఎన్ఏవీ ఎన్నో రెట్లు పెరిగి ఉంటుంది. ఒకవేళ ఏడాది క్రితం ప్రారంభమైన సెన్సెక్స్ ఆధారిత పథకం ఎన్ఏవీ రేటు భిన్నంగా ఉంటుంది. ఇండెక్స్ ఫండ్ ఎన్ఏవీ అన్నది ఇక్కడ కీలకం కాదు. మీరు పెట్టుబడులు పెట్టిన తర్వాత సంబంధిత పథకం రాబడి రేటు.. ఇండెక్స్ రాబడికి అనుగుణంగా ఉందా, లేదా అన్నదే చూసుకోవాలి. సిప్‌లు అన్నింటికీ ఒకటే తేదీ ఉండడం సరైనదేనా? నేను ఐదు మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ప్రతీ నెలా మొత్తం మీద రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇలా పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలన్నది నా ప్రణాళిక. తద్వారా రిటైర్మెంట్ కోసం ఒక నిధిని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాను. అయితే ఐదు మ్యూచువల్ ఫండ్స్ పథకాలకూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) తేదీ 15వ తేదీనే ఉంది. ఇలా ఉంటే ప్రతికూలమా? – విష్ణు కుమార్ మీ పెట్టుబడులను ప్రణాళికకు అనుగుణంగా కొనసాగించుకోండి. ప్రతీ నెలా అనుకున్నట్టుగానే, అనుకున్న రోజున నిర్ణీత మొత్తం పెట్టుబడిగా వెళ్లేలా చూసుకోండి. పెట్టుబడి కొనుగోలు వ్యయం సగటుగా మారడం వల్ల ప్రయోజనం లభిస్తుంది. దీర్ఘకాలంలో ఇది మెరుగైన ఫలితాన్నిస్తుంది. ఐదు మ్యూచువల్ ఫండ్స్ సిప్‌లకు నెలలో భిన్నమైన తేదీలను నిర్ణయించుకోవడం అన్నది క్లిష్టమైనది. కనుక అన్నింటికీ ఒక్కటే తేదీ సిప్‌గా ఉండడం ప్రతికూలమేమీ కాదు. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు వచ్చే స్కీమ్స్ ఇవే -
మోతీలాల్ ఓస్వాల్ ఎంఎస్‌ఈఐ ఇండెక్స్ ఫండ్
మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ‘మోతీలాల్ ఓస్వాల్ ఎంఎస్సీఐ ఈఏఎఫ్‌ఈ టాప్ 100 సెలక్ట్ ఇండెక్స్ ఫండ్’ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. దీనిద్వారా ఎంఎస్‌ఈఐ ఈఏఎఫ్ఈలో టాప్–10 దేశాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని పేర్కొంది. యూరోప్, ఆస్ట్రేలియా తదితర 21 వర్ధమాన మార్కెట్ల వెయిటేజీతో ఎంఎస్సీఐ ఈఏఎఫ్ఈని ఏర్పాటు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి తీసుకొచ్చిన మొదటి ఇండెక్స్ ఫండ్ ఇదని, దీనివల్ల అంతర్జాతీయంగా ఉన్న చక్కని అవకాశాలను కోల్పోకుండా చూసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఈ నెల 15న మొదలై.. 25న ముగుస్తుంది. -
బీమా పాలసీలకు ప్రామాణిక ఫార్మాట్
న్యూఢిల్లీ: జీవిత, సాధారణ బీమా పాలసీలకు ప్రామాణిక ఫార్మాట్‌ను ఐఆర్డీఏ నిర్దేశించింది. పాలసీ వ్యవహారాల్లో పారదర్శకతను పెంచేందుకు, ప్రజలు సంపూర్ణ అవగాహనతో నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఈ చర్య చేపట్టినట్లు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. పాలసీదారుల అవసరాలకు తగినట్లుగా బీమా కంపెనీలు ఇకనుంచి పాలసీ సర్వీసింగ్ ఫారాలను రాజ్యాంగం గుర్తించిన భాషల్లోనూ అందించాలని తెలిపింది. ఫారాల్లోని అక్షరాలు కనీస పరిమాణంలో ఉండడం అవసరమని పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్లో నిధుల ప్రవాహాన్ని పెంచేందుకు దోహదపడేవిధంగా ఈక్విటీ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లలో బీమా కంపెనీల పెట్టుబడులను అనుమతిస్తూ ఐఆర్డీఏ నిర్ణయించింది. అయితే, ఇందుకు కొన్ని నిబంధనలు విధించారు.