బీమా పాలసీలకు ప్రామాణిక ఫార్మాట్
న్యూఢిల్లీ: జీవిత, సాధారణ బీమా పాలసీలకు ప్రామాణిక ఫార్మాట్‌ను ఐఆర్‌డీఏ నిర్దేశించింది. పాలసీ వ్యవహారాల్లో పారదర్శకతను పెంచేందుకు, ప్రజలు సంపూర్ణ అవగాహనతో నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఈ చర్య చేపట్టినట్లు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
పాలసీదారుల అవసరాలకు తగినట్లుగా బీమా కంపెనీలు ఇకనుంచి పాలసీ సర్వీసింగ్ ఫారాలను రాజ్యాంగం గుర్తించిన భాషల్లోనూ అందించాలని తెలిపింది. ఫారాల్లోని అక్షరాలు కనీస పరిమాణంలో ఉండడం అవసరమని పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్లో నిధుల ప్రవాహాన్ని పెంచేందుకు దోహదపడేవిధంగా ఈక్విటీ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లలో బీమా కంపెనీల పెట్టుబడులను అనుమతిస్తూ ఐఆర్‌డీఏ నిర్ణయించింది. అయితే, ఇందుకు కొన్ని నిబంధనలు విధించారు.