మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ప్రచారకర్తలుగా సెలబ్రిటీలు
కొత్త అడ్వర్టైజింగ్ కోడ్‌కు సెబీ ఓకే
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లలో అవగాహన పెంచే దిశగా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొత్త అడ్వర్టైజింగ్ కోడ్‌కు ఆమోదముద్ర వేసింది. దీనితో ఇకపై మ్యూచువల్ ఫండ్స్ రంగానికి సెలబ్రిటీలు కూడా ప్రచారకర్తలుగా వ్యవహరించవచ్చు. అయితే ఇది మొత్తం పరిశ్రమకు ప్రచారం కల్పించేలా ఉండాలే తప్ప ఏ ఒక్క పథకాన్నో లేదా ఏ ఒక్క అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ) ప్రమోట్ చేసేలా ఉండకూడదు.
ఇలా సెలబ్రిటీలతో జారీ చేసే ప్రకటనలకు మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ.. సెబీ ఆమోదముద్ర కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వివిధ పథకాల వివరాల ప్రచారానికి సంబంధించిన నిబంధనలను కూడా సెబీ సమీక్షించింది. మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల పనితీరును ఏడాది, మూడేళ్లు, అయిదేళ్లు, ప్రారంభ తేదీ నుంచి ఆయా సంస్థలు ప్రచురించాల్సి ఉంటుంది. అలాగే, వివిధ స్కీమ్‌ల పనితీరు వివరాలను తెలియజేయాలి.