న్యూఢిల్లీ: పన్ను ఆదా ప్రయోజనంతో కూడిన ఈఎల్‌ఎస్‌ఎస్ (equity-linked savings scheme )పథకాలకు సంబంధించి సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రతి మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ఒక్కటే ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాన్ని నిర్వహించేందుకు సెబీ అనుమతించేది. ఒకటే సంస్థ ఒకటికి మించిన ఈఎల్‌ఎస్‌ఎస్ స్కీమ్‌లను నిర్వహించకూడదు.
కానీ, ఇక మీదట యాక్టివ్ ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాలను ఆఫర్ చేసే ప్రతి సంస్థ ప్యాసివ్ విభాగంలో (ఇండెక్స్‌ల పరిధిలోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేవి) ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాన్ని తీసుకొచ్చేందుకు అనుమతించింది. ఈ మేరకు అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలకు సమాచారం ఇచ్చింది.
కానీ, ఈ విషయంలో పలు షరతులు విధించింది. ఇప్పటికే యాక్టివ్ ఈఎల్‌ఎస్‌ఎస్ పథకం నిర్వహించే అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ/మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థ) ప్యాసివ్ స్కీమ్‌ను కూడా తీసుకురావాలని భావిస్తే.. యాక్టివ్ పథకంలోకి ఇక మీదట పెట్టుబడులను తీసుకోకూడదు.
Comments
Please login to add a commentAdd a comment