పదేళ్లకు మించి నేను సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయగలను. నా ఈక్విటీ పెట్టుబడుల్లో 50 శాతం నుంచి 60 శాతం మేర స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – ఉమేష్ యాదవ్
దీర్ఘకాల పెట్టుబడులకు సంబంధించి ఈక్విటీలకు పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం సరైనది. ఒకే రకం ఫండ్ లేదా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోనే ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి దూరంగా ఉండాలి. 50–60% మేర మిడ్, స్మాల్ క్యాప్స్ పెట్టుబడులతో ప్రధాన పోర్ట్‌ఫోలియో నిర్మించుకోవడం అన్నది సూచనీయం కాదు. దీనికి బదులు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే మిడ్, స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 25– 30 శాతానికి పరిమితం అవుతాయి. లార్జ్‌క్యాప్ పెట్టుబడులు 70% మేర ఉంటాయి.
వృద్ధికితోడు, స్థిరత్వాన్ని ప్రదర్శించే స్టాక్స్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. రిస్క్ ఎక్కువగా ఉండే సాధనాలకు తక్కువ కేటాయింపులు చేసుకోవాలి. మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ అనేవి దీర్ఘకాలంలో ఫ్లెక్సీక్యాప్ కంటే ఎక్కువ రాబడులను ఇస్తాయి. కానీ, స్వల్పకాలంలో తీవ్ర అస్థిరతల మధ్య చలిస్తాయి. కనుక వీటిల్లో రిస్క్ ఎ క్కువగా ఉంటుంది. అందుకే వీటికి 50–60% కేటాయింపులు చేయడం వల్ల పెట్టుబడుల్లో అధిక భాగం అస్థిరతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక అస్థితరలు ఉన్నా సరే, దీర్ఘకాలంలో అధిక రాబడులు కో రుకుంటే అప్పుడు ఫ్లెక్సీక్యాప్‌తోపాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
నేను ఒకే విడతలో రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా? లేదా నెలవారీ, త్రైమాసికం వారీ ఆదాయం వచ్చేలా ఎస్‌డబ్ల్యూపీ ఎంపిక చేసుకోవాలా? – శంకర్ నారాయణన్
ఇండెక్స్ ఫండ్ అనేది నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ తదితర సూచీల్లో (ఇండెక్స్‌ల్లో) ఇన్వెస్ట్ చేసేది. మరోవైపు సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) అనేది పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకునే సాధనం. ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే సంబంధిత సూచీ రాబడులకు అనుగుణంగానే ఉంటాయి. ఎస్‌డబ్ల్యూపీ ద్వారా మీరు కోరుకున్నంత ప్రతి నెలా ఉపసంహరించుకోవచ్చు. రూ.లక్షను 10 నెలల్లో ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంటే ప్రతి నెలా రూ.10వేలను ఎస్‌డబ్ల్యూపీగా ఎంపిక చేసుకోవాలి.
మీ దగ్గర కొంత మొత్తం ఫండ్ ఉండి, ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటుంటే దాన్ని ఒకే విడత కాకుండా ఆరు నుంచి 12 నెలల పరిధిలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టుకోవాలి. క్రమం తప్పకుండా ఆదాయ మార్గం ఏర్పాటు చేసుకోవాలంటే.. మూడింట ఒక వంతును ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రిస్క్ వద్దనుకునే వారు లార్జ్‌క్యాప్ ఫండ్ లేదా ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవాలి. ఒక ఏడాది అవసరాలకు సరిపడా (మొత్తం పెట్టుబడిలో 6 శాతం మించకుండా) లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.
మిగిలిన మొత్తాన్ని ఫిక్స్‌డ్ ఇన్‌కమ్‌లో, అది కూడా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టుకోవాలి. ఏడాదికోసారి మీ ఈక్విటీ పెట్టుబడులు 33–35 శాతం మించకుండా, తగ్గకుండా రీబ్యాలన్స్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఏటా ఏడాది అవసరాలకు సరిపడా మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లోకి మళ్లించుకోవాలి. ఈ మొత్తాన్ని ఏటా 5 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. అలాగే, ఉపసంహరించుకునే మొత్తం ఏటా పెట్టుబడిలో 6 శాతం మించకుండా చూసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment