జీవిత బీమా రంగంలో తొలి స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్‌ ఇదే..  | Nifty Smallcap Quality Index Fund first small cap index fund in life insurance | Sakshi
Sakshi News home page

జీవిత బీమా రంగంలో తొలి స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్‌ ఇదే.. 

Published Mon, Aug 14 2023 10:37 AM | Last Updated on Mon, Aug 14 2023 10:37 AM

Nifty Smallcap Quality Index Fund first small cap index fund in life insurance - Sakshi

ముంబై: మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తాజాగా యులిప్స్‌ విభాగంలో నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. జీవిత బీమా రంగంలో ఇదే తొలి స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ ఫండ్‌ అని సంస్థ సీనియర్‌ డైరెక్టర్‌ మిహిర్‌ వోరా తెలిపారు.

పదేళ్ల వ్యవధిలో 22 శాతం రాబడి అందించిన నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 250 క్వాలిటీ 50 సూచీ దీనికి ప్రామాణికంగా ఉంటుందని వివరించారు. యూనిట్‌కు రూ. 10 చొప్పున ఈ న్యూ ఫండ్‌ ఆఫర్‌ ఆగస్టు 25 వరకు అందుబాటులో ఉంటుంది. అధిక రిస్కు సామరŠాధ్యలు కలిగి ఉండి, దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు కోరుకునే ఇన్వెస్టర్లకు ఇది అనువైనదిగా ఉంటుందని వోరా వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement