ముందుచూపుతో వ్యవహరించాల్సిందే
అన్ని డాక్యుమెంట్లలోనూ సవరణ తప్పదు
విద్యార్హతల పత్రాల్లోనూ ఆ మేరకు మార్పు
మ్యారేజ్ సరి్టఫికెట్, అఫిడవిట్‌ల అవసరం
భర్త ఇంటి పేరుకు మారితే ఏకరూపత
కుటుంబం అంతా ఒక్కటేనన్న గుర్తింపు
వివాహానంతరం మహిళల ఇంటి పేరులో మార్పు చూస్తుంటాం. ఆమెకు, ఆమె సంతానానికి సహజంగానే భర్త ఇంటి పేరు వర్తిస్తుంది. అప్పటి వరకు తండ్రి ఇంటి పేరును వారసత్వంగా మోసిన ఆమె, తన విద్యార్హతలు, ఇతర ధ్రువీకరణ, గుర్తింపు పత్రాల్లో అదే పేరును కలిగి ఉంటుంది.
మరి పెళ్లి తర్వాత ముఖ్యమైన పత్రాల్లో భర్త ఇంటి పేరును చేర్చుకోవాలా..? వద్దా..? ఇదొక పెద్ద సందేహం. చాలా మంది ఈ విషయంలో డోలాయమాన స్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. వివాహానంతరం తండ్రి ఇంటి పేరుతో కొనసాగేందుకు అందరూ అంగీకరించకపోవచ్చు. భర్త అంగీకరించినా, మార్చుకోవడం సులభమేమీ కాదు. ఇందులోని సాధక బాధకాలను పూర్తిగా తెలుసుకుంటే అప్పుడు ఏం చేయాలో సులభంగా తేల్చుకోవచ్చు.
వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత కేవలం ఆధార్‌లో మాత్రమే ఇంటి పేరును మార్చుకుని వదిలివేయడం సరైనది కాదు. విద్యార్హతలు సహా చట్టబద్ధమైన అన్ని పత్రాలు, పెట్టుబడుల డాక్యుమెంట్లలో ఇంటి పేరును మార్చుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు ఎదురుకావు. కేవలం పాన్, ఆధార్‌లోనే ఇంటి పేరు మార్చుకుంటే, అది ఎన్నో ఇక్కట్లకు దారితీయవచ్చు.
ఈపీఎఫ్, బ్యాంక్ ఖాతాల్లోని పేర్లకు, పాన్, ఆధార్‌లోని పేర్ల మధ్య అంతరం ఏర్పడుతుంది. ఆయా ఖాతాల నుంచి నిధులను వెనక్కి తీసుకోవాలంటే.. పేరును అప్‌డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం మరోసారి కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియ పూర్తి చేయక తప్పదు. పేర్ల అప్‌డేట్ కోసం అఫిడవిట్, ఇతర డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి రావచ్చు. ‘‘వివాహం తర్వాత ఇంటి పేరును మార్చుకోవడం అన్నది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమే. కానీ ఈ విషయంలో లాభ, నష్టాలు రెండింటినీ పరిశీలించుకోవాలి.
పేరును మార్చుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే కుటుంబం అంతటికీ ఒకే విధమైన గుర్తింపు, ఏకరూపత ఉంటుంది. అన్ని రకాల డాక్యుమెంట్లలోనూ పేరు ఒకే విధంగా ఉండేందుకు శ్రమ పడాల్సి రావడమే ప్రతికూలం’’అని ఫిన్‌ఎడ్జ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ దీపికా భారతి వివరించారు. పెళ్లయిన తర్వాత ఇంటి పేరును మార్చుకోవడం వల్ల ఎన్నో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ‘అలగ్ అండ్ కపూర్ లా ఆఫీసెస్’ (న్యాయ సేవల సంస్థ) పార్ట్‌నర్ సోనాల్ అలఘ్ పేర్కొన్నారు. గతంలోని పేరుకు, ప్స్ట్రేతుత పేరుకు మధ్య మార్పు నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో ఎన్నో పరిశీలనలకు తోడు వృత్తిపరమైన ధ్రువీకరణలు అవసరం
పడతాయన్నారు.
భర్త ఇంటి పేరు
అప్పటి వరకు ఉన్న ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకుంటున్నట్టు అయితే చట్టబద్ధంగా గుర్తింపును మారుస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. అధికారిక రికార్డుల్లో పేర్లు మార్చుకోవడం అన్నది పరిపాలనాపరమైన పెద్ద చిక్కుగా, సవాలుతో కూడుకున్నదిగా అభివర్ణించారు సోనాల్ అలఘ్. ‘‘దీనికి తోడు విద్యా, ప్రభుత్వ సంస్థల్లో పేరు మార్పునకు సంబంధించిన కఠిన ప్రక్రియ కష్టాలను మరింత పెంచుతుంది. దీంతో గుర్తింపు సమస్యలు ఎదురుకావచ్చు’’అని ఆమె పేర్కొన్నారు.
మహిళ ఇంటి పేరును మార్చుకుంటుంటే, అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లలోనూ ఆ మేరకు మార్పులు చేసుకోవాలని దీపికా భారతి సూచించారు. కేవలం కొన్నింటిలోనే మార్పు చేసుకుని వదిలేస్తే, విదేశాలకు వెళ్లే సందర్భాల్లో, పెట్టుబడుల సమయంలో, లేదంటే నామినీగా ఉండి పెట్టుబడులను క్లెయిమ్ చేసుకోవాల్సిన సందర్భాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆస్తులు తదితర చట్టబద్ధమైన డాక్యుమెంట్లు, బీమా పాలసీల్లో పేరులో మార్పు చేయకపోతే, గుర్తింపును నిరూపించుకునేందుకు లేదా ఆయా ఆస్తులను సొంతం చేసుకునేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుందని కరంజ్‌వాలా అండ్ కో పార్ట్‌నర్ మేఘనా మిశ్రా పేర్కొన్నారు.
ఆస్తి పత్రాల్లో
అధికారిక డాక్యుమెంట్లలో ఇంటి పేరును మార్చుకున్న ప్రతి ఒక్కరూ.. తమ పేరిట ఉన్న భౌతిక, ఆర్థిక ఆస్తులు అన్నింటిలోనూ ఆ మేరకు సవరణ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక్కసారి ఆధార్, పాన్‌లో కొత్త ఇంటి పేరు ఆధారంగా సవరణ చేసుకుంటే, ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల్లో మార్చుకోవడం సులభతరం అవుతుందని భారతి తెలిపారు. ఉద్యోగం చేసే చోట అధికారిక రికార్డుల్లోనూ ఇంటి పేరులో మార్పు చేసుకోవడం ద్వారా ఇబ్బందులను అధిగమించొచ్చు.
మార్చుకోవడం వల్ల ప్రయోజనం ఉందా?
నేటి రోజుల్లో దాదాపు అధిక శాతం మహిళలు పెళ్లయిన తర్వాత తమ ఇంటి పేరును మార్చుకుంటున్నారు. భర్త ఇంటి పేరుకు మారిపోవడం వల్ల గుర్తింపు సులభంగా ఉంటుందని మిశ్రా తెలిపారు. సామాజికంగా ఒకే కుటుంబం అన్న భావన, కుటుంబంలో ఐక్యతకు ఇది అనుకూలిస్తుందన్నారు. పాన్, ఆధార్, ఇతర డాక్యుమెంట్లు కీలక పత్రాల్లో ఇంటి పేరు మార్చుకునేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ (వివాహ ధ్రువీకరణ) సమరి్పంచాల్సి వస్తుంది.
పాస్ పోర్ట్ ఆఫీస్, ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లి నిర్ధేశిత దరఖాస్తుకు అనుబంధంగా వివాహ ధ్రువీకరణ పత్రం, ఇతర డాక్యుమెంట్లను ఇవ్వాలి. మ్యారేజ్ సర్టిఫికెట్‌తోపాటు గుర్తి్తంపు, చిరునామా ధ్రువీకరణ, పేరు మార్పునకు సంబంధించి అఫడవిట్ అవసరమవుతాయని మిశ్రా తెలిపారు. ‘‘నిర్ధేశిత మార్పునకు సంబంధించి చటబద్ధమైన ప్రక్రియలకు కట్టుబడి ఉండడం కీలకం. ఇక్కడ చెప్పినవన్నీ ప్రాథమికంగా సమర్పించాల్సినవి. విడిగా ఆయా డాక్యుమెంట్లలో మార్పులకు గాను సమరి్పంచాల్సినవి వేరేవి కూడా ఉండొచ్చు’’అని మిశ్రా పేర్కొన్నారు.
పదో తరగతి మెమో
చాలా వాటికి పదో తరగతి విద్యార్హత సర్టిఫికెట్ కీలకంగా పనిచేస్తుంది. ఇందులో పేరు మార్చుకోవడం కష్టమేనంటున్నారు మేఘన మిశ్రా. ‘‘సీబీఎస్‌ఈ వంటి బోర్డులు సాధారణంగా సర్టిఫికెట్లలో పేర్ల మార్పునకు అనుమతించడం లేదు. పాన్, పాస్‌పోర్ట్‌కు టెన్త్ సర్టిఫికెట్ కీలకంగా పనిచేస్తుంది. పాన్/ఆధార్‌కు, సీబీఎస్‌ఈ పదో తరగతి సర్టిఫికెట్‌లో పేరుకు వ్యత్యాసం ఉంటే బ్యాంక్ ఖాతా లేదా పాస్‌పోర్ట్ తీసుకునే విషయంలో ధ్రువీకరణ కోసం అదనపు డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.
వివాహానంతరం వృత్తిపరమైన విద్యార్హతల డాక్యుమెంట్లు, కోర్సుల్లో ప్రవేశాలకు నమోదు చేసే పేరు, అంతకుముందు డాక్యుమెంట్లలో మాదిరే ఉండాలి’’అని మిశ్రా వివరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయవాది ఏక్తా రాయ్ అభిప్రాయం భిన్నంగా ఉంది. స్కూల్ సర్టిఫికెట్లు అన్నవి ఒక నిరీ్ణత కాలం వరకు పుట్టిన తేదీకి ధ్రువీకరణలుగా కొనసాగుతాయి. ఇతర కీలక డాక్యుమెంట్లు అయిన పాన్, ఆధార్ తదితర ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఇంటి పేరును అప్‌డేట్ చేసుకున్న తర్వాత, స్కూల్ సర్టిఫికెట్లకు అంత ప్రాధాన్యం ఉండదు. అయినప్పటికీ వివాహానంతరం మహిళ పాన్ లేదా ఆధార్‌లో పేరు మార్చుకునేట్టు అయితే లేదా ఉన్నత కోర్సులకు దరఖాస్తు చేసుకుంటున్నట్టు అయితే తన వివాహాన్ని రిజిస్టర్ చేసుకుని,
వివాహ రిజిస్ట్రేటేషన్ సర్టిఫికెట్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. జిల్లా మేజి్స్ట్రేట్ నుంచి పాఠశాల సర్టిఫికెట్లలో ఇంటి పేరు మార్పును ధ్రువీకరిస్తున్నట్టు అటెస్టేషన్ తీసుకున్నా అది కూడా పరిగణనలోకి వస్తుంది’’అని ఏక్తా రాయ్ తెలిపారు.
ఆస్తుల క్లెయిమ్
కుటుంబ పెద్దలు కొందరు వీలునామా రాస్తుంటారు. కుమార్తెలకు సంబంధించి వివరాలు నమోదు చేస్తున్నప్పుడు తమ ఇంటి పేరునే పేర్కొంటారు. వీలునామా రాసిన వ్యక్తి మరణానంతరమే అది అమల్లోకి వస్తుంది. అలా అమల్లోకి వచ్చే నాటికి మహిళలు వివాహాలు చేసుకుని, భర్త ఇంటి పేరుకు మారి ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో వీలునామాలోని వివరాల మేరకు తమ హక్కులను క్లెయిమ్ చేసుకునే సందర్భంలో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ప్రాపర్టి, యాజమాన్యం లేదా వారసత్వ వివాదాల్లో ఇంటి పేరు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లలోని ఇంటి పేరు ఒకే మాదిరిగా ఉండకపోతే సవాళ్లు ఎదురవుతాయని ఏక్తారాయ్ అంటున్నారు. వీలునామాలోని పేరుకు, ప్స్ట్రేతుతం మహిళ పేరుకు మధ్య వ్యత్యాసం ఉంటే, అదనపు రుజువులు, డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి ఉంటుందని సోనాల్ అలఘ్ తెలిపారు. మహిళ ఇంటి పేరు మార్పు వెనుకనున్న అంశాలను కోర్టులు, అధికారులు పరిగణనలోకి తీసుకోవచ్చని చెప్పారు. ఏవైనా వ్యత్యాసాలు ఉంటే అందుకు సంబంధించి సహేతుక ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని, దాంతో ఆస్తుల బదిలీ సాఫీగా పూర్తవుతుందని సూచించారు.
వీసాకు దరఖాస్తు
‘‘వీసాలో పేరు అప్‌డేట్ చేసుకోవడం లేదంటే భాగస్వామి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంతర్జాతీయంగా ఉన్న భిన్నమైన కుటుంబ నిర్మాణాల నేపథ్యంలో ఇంటి పేరులో వ్యత్యాసాన్ని ఆయా దేశాల్లో గుర్తించేందుకు ఎన్నో రకాల రుజువులు సమరి్పంచాల్సి రావచ్చు. వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు.. మారిన పేరుకు అనుగుణంగా అప్‌డేట్ చేసుకోవాలని భావించే వారికి ఈ సవాలు ఎదురవుతుంది’’అని అలఘ్ అంటున్నారు. పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకుని వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే, అప్పుడు వివాహ స్థితిని తెలిపే డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఇది వీసా జారీని ఆలస్యం చేయవచ్చు. అందుకే పెళ్లి తర్వాత పాస్‌పోర్ట్‌లో భర్త ఇంటి పేరు ప్రతిఫలించేలా మార్పు చేసుకోవాలని మిశ్రా సూచించారు. దీనివల్ల ధ్రువీకరణ సమస్యలు తక్కువగా ఉంటాయన్నారు.
పేరు మార్చుకోకపోతే..?
వివాహం తర్వాత కూడా తన ఇంటి పేరునే కొనసాగించే మహిళలూ కొందరు ఉన్నారు. అలాంటప్పుడు సదరు మహిళ భర్త పేరును పేర్కొనే సమయంలో ఇద్దరి ఇంటి పేరు వేర్వేరుగా ఉంటుంది. కనుక తనకు, తన భర్తకు మధ్య బంధానికి నిదర్శనంగా మ్యారేజ్ సర్టిఫికెట్ ఒక్కటి దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. ‘‘వివాహం తర్వాత మహిళ ఇంటి పేరు మార్చుకోకపోతే అప్పుడు వారి బంధాన్ని నిరూపించుకునేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. ఆదాయపన్ను రిటర్నుల దాఖలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్, ఆస్తుల లావాదేవీల సమయంలో ఇది అవసరపడుతుంది. మ్యారేజ్ సర్టిఫికెట్ లేకపోతే భర్త పేరుతో అప్‌డేట్ చేసిన ఆధార్, పాస్‌పోర్ట్, బ్యాంక్ జాయింట్ అకౌంట్ పాస్‌బుక్ లేదా స్టేట్‌మెంట్, ఒకే ఇంట్లో నివసిస్తున్నట్టు రుజువులు, అఫిడవిట్ సాయపడతాయి’’అని మిశ్రా తెలిపారు.
పిల్లల బర్త్ సర్టిఫికెట్
వివాహానంతరం మహిళల ఇంటి పేరులో మార్పు లేనప్పుడు.. ఆ దంపతులకు జని్మంచే పిల్లల బర్త్ సర్టిఫికెట్‌లో తల్లి, తండ్రి ఇంటి పేరు వేర్వేరుగా ఉంటుంది. ఇదేమైనా సమస్యలు కలిగిస్తుందా.? అన్న సందేహం రావచ్చు. పిల్లల పేరిట పీపీఎఫ్, సుకన్య సముృద్ధి యోజన తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చే యాలనుకుంటే ఈ బర్త్ సర్టిఫికెట్ అవసరం పడు తుంది. అంతేకానీ, అందులో తల్లి, తండ్రి ఇంటి పేర్లు వేర్వేరుగా ఉంటే ఎలాంటి సమస్య రాదని మిశ్రా పేర్కొన్నారు.
మొత్తం పేరే మారితే?
కొన్ని వర్గాల ప్రజల్లో పెళ్లి తర్వాత మహిళ ఇంటి పేరే కాకుండా, మొదటి పేరులోనూ మార్పు చోటు చేసుకుంటుంది. ఇది సమస్యలకు దారితీస్తుందని మిశ్రా చెప్పారు. అధికారిక రికార్డులతో పోలిస్తే పేర్ల మధ్య పోలిక లేకపోవడం వల్ల సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పేరు మార్చుకునే విషయంలో చట్టబద్ధమైన నిబంధనలను పాటించడం వల్ల సవాళ్లను అధిగమించొచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment