inheritance
-
సీసీఎస్‌ను ఆశ్రయించిన ఏడో నిజాం మనవరాలు
సాక్షి, హైదరాబాద్: నిజాం ఆస్తులకు సంబంధించిన ఓ వివాదం హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్)కు చేరింది. తన పేరిట ముగ్గురు వ్యక్తులు నకిలీ జీపీఏ సృష్టించి కోర్టు ద్వారా వారసత్వ సర్టిఫికెట్ పొందారని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ మనవరాలు ఫాతిమా ఫౌజియా సీసీఎస్‌లో క్రిమినల్ ఫిర్యాదు చేశారు. ఏడో నిజాం రెండో కుమారుడైన వాలాషాన్ ప్రిన్సెస్ మౌజ్జమ్ ఝా బహదూర్ కుమార్తె ఆమె. తొలుత నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కేసు నమోదు చేయకపోవడంతో హైదరాబాద్‌లోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. స్పందించిన న్యాయస్థానం.. కేసు నమోదు చేయాలని సీసీఎస్‌ను ఆదేశించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వారసత్వ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలి..: ‘బషీర్‌బాగ్‌కు చెందిన మిలాద్ అలీ ఖాన్, నాంపల్లికి చెందిన సాజిద్ అలీఖాన్, బంజారాహిల్స్‌కు చెందిన మీర్ మిర్జా అలీఖాన్ ఉమ్మడిగా ఏడో నిజాంకు సంబంధించిన ఆస్తులకు వారసులమని.. నా పేరిట నకిలీ జీపీఏతో 2016లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ద్వారా వారసత్వ సర్టిఫికెట్ పొందారు. అనంతరం నా ఆస్తిలోనూ వాటా ఉందంటూ కోర్టులో పిటిషన్ వేశారు. అలాగే తమిళనాడులోని నీలగిరి, ఊటీల్లో ఉన్న దాదాపు రూ. 121 కోట్ల విలువైన ఏడో నిజాం ఎస్టేట్స్‌లో వాటా పంచాలని కోర్టుకెక్కారు. నా తండ్రి, సోదరుడి నుంచి నాకు సంక్రమించిన 36 శాతం ఆస్తుల వాటాను తక్కువగా చూపించడంతోపాటు పూర్తిగా ఎస్టేట్‌ను కాజేసేందుకు కుట్ర చేస్తున్నారు’అని ఫాతిమా కోర్టులో వేసిన ప్రైవేటు ఫిర్యాదులో ఆరోపించారు. నిందితులు పొందిన వారసత్వ సరి్టఫికెట్ బోగస్ అని, దాన్ని రద్దు చేయాలని కోరారు. -
PM Narendra Modi: చచ్చినా వదలరట!
అంబికాపూర్/సాగర్: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారసత్వ పన్నుతో ప్రజల నడ్డి విరవడం తథ్యమని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు. బతికున్నంత కాలం ప్రజలను పన్నులతో పీడించడమే గాక మరణించిన తర్వాత కూడా వదలకుండా లూటీ చేసే కుట్రలకు పదును పెడుతోందని మండిపడ్డారు.కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా తాజాగా సంపద పంపిణీ గురించి మాట్లాడుతూ అమెరికాలో అమల్లో ఉన్న వారసత్వ పన్ను గురించి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమన్నారు. ‘‘మరణించిన వారి ఆస్తులపైనా కాంగ్రెస్ పంజా (హస్తం గుర్తునుద్దేశించి) విసరనుంది. వారసత్వంగా పిల్లలకు దక్కకుండా లాగేసుకోనుంది. ‘జిందగీ కే సాథ్ భీ... జిందగీ కే బాద్ భీ... (బతికున్నప్పుడు కూడా, చనిపోయాక కూడా)’.ఇదే కాంగ్రెస్ నయా దోపిడీ మంత్రం!’’ అని ఎల్ఐసీ పాపులర్ స్లోగన్ అన్వయిస్తూ ప్రధాని దుయ్యబట్టారు. ‘‘సమాజంలో సంపద పునఃపంపిణీ అనే ముసుగులో ప్రజల స్థిర చరాస్తులను జీవితాంతమూ, మరణించిన తర్వాతా అడ్డంగా లూటీ చేయడమే కాంగ్రెస్ విధానం. ఆ క్రమంలో చివరికి వారసత్వ ఆస్తులను కూడా వదలిపెట్టడం లేదు. కాంగ్రెస్ తాలూకు ఈ రహస్య అజెండాను, పిట్రోడా వ్యాఖ్యలు బయటపెట్టాయి.మన సామాజిక, కుటుంబ విలువలకు కాంగ్రెస్ పూర్తిగా దూరమైపోయింది. అందుకే ప్రజల జీవితాంతం పొదుపు చేసి తమ వారసులకు అందజేయాలనుకునే సొమ్మును కూడా చట్టబద్ధంగా లాగేసుకోవాలని కుట్ర చేస్తోంది. ఆ పార్టీ చేస్తున్న ఇలాంటి ప్రమాదకర ఆలోచనలన్నీ ఎన్నికల వేళ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి’’ అని బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ ఎన్నికల ర్యాలీలో మోదీ తూర్పారబట్టారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్, హర్దా ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. ఆయన ఏం మాట్లాడారంటే...చట్టబద్ధంగా దోచేస్తారు ‘‘మీ (ప్రజల) ఆస్తులను, మీ పిల్లల హక్కులను కాజేయడానికి కాంగ్రెస్ పథకం వేసింది. జనం ఆస్తులను, పిల్లల కోసం జీవితాంతం కష్టపడి పొదుపు చేసుకున్న మొత్తాలను చట్టబద్ధంగా దోచేయజూస్తోంది. మధ్యతరగతి ప్రజలపై, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకొనేవారిపై మరింత పన్ను విధించాలని కాంగ్రెస్ యువరాజు (రాహుల్) సలహాదారు (పిట్రోడా) అంటున్నారు.గతంలో యువరాజు తండ్రికి కూడా ఆయనే సలహాదారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే తల్లిదండ్రుల నుంచి సంతానానికి వారసత్వంగా వచ్చే ఆస్తులపై కచ్చితంగా పన్ను విధిస్తుంది. అప్పుడిక తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకు బదిలీ కావాలంటే పన్ను కట్టాల్సిందే. బతికున్నంత కాలమూ మీనుంచి వీలైనంతగా పన్నులు పిండుతారు. మరణించాక వారసత్వ పన్ను విధిస్తారు!ఓబీసీలకు కాంగ్రెసే అతి పెద్ద శత్రువు‘‘మతపరమైన రిజర్వేషన్ల నుంచి వెనక్కి తగ్గే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేదు. అధికారంలోకి వస్తే ఎస్టీ, ఎస్టీల రిజర్వేషన్లను తగ్గించి, స్వీయ రాజకీయ లబ్ధి కోసం మరో వర్గానికి వర్తింపజేస్తుంది. ఇందులో సందేహం లేదు. కర్ణాటకలో గతంలో కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగానికి, అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మతాధారంగా రిజర్వేషన్లు అమలు చేశారు.అక్కడ బీజేపీ అధికారంలోకి అవి రద్దయ్యాయి. కొన్ని నెలల క్రితం కర్ణాటకలో మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పెద్ద పాపం చేసింది. ముస్లింల్లోని అన్ని వర్గాలను ఓబీసీ కేటగిరీలో చేర్చి దొడ్డిదారిన రిజర్వేషన్లు ఇచ్చేసింది. దీనివల్ల ఓబీసీ కేటగిరీలోని ఇతర కులాలకు అన్యాయం జరుగుతోంది. కాంగ్రెస్ ఆడుతున్న ఈ ప్రమాదకరమైన ఆటతో భవిష్యత్తు తరాలు నాశనమవుతాయి. దేశమంతటా కర్ణాటక మోడల్ అమలు చేయడానికి కుట్ర పన్నింది’’ రాజ్యాంగమంటే కాంగ్రెస్‌కు లెక్కలేదు ‘‘ఎన్నికల్లో నెగ్గడానికి ఓటు బ్యాంకు రాజకీయాలనే నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ మతాధారితంగా రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తోంది. దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలో బలహీన ప్రభుత్వం అధికారంలోకి రావాలని కొన్ని శక్తులు కోరుకుంటున్నాయి. బలమైన ప్రభుత్వముండి దేశం స్వావలంబన సాధిస్తే తమ దుకాణం మూత పడుతుందని ఆ శక్తులు భయపడుతున్నాయి. కాంగ్రెస్‌ది ముమ్మాటికీ ముస్లిం లీగ్ ఆలోచనా ధోరణే. ఆ పార్టీ మేనిఫెస్టో ముస్లింలీగ్ సిద్ధాంతాలకు నకలు.మతాధారంగా రిజర్వేషన్లు ఉండొద్దని రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు అంబేడ్కర్ భావించారు. దళితులకు, గిరిజనులకే రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆశయాలను కాంగ్రెస్ లెక్కచేయడం లేదు. కొన్నేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మతాధారంగా రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రయతి్నంచింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో కోత విధించి, మతం ఆధారంగా ఓ వర్గానికి 15 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గట్టిగా వాదించింది. 2009, 2014 మేనిఫెస్టోల్లో ఇదే అంశాన్ని చేర్చింది’’‘ఇండియా’ వస్తే ఏడాదికో ప్రధానికేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వం కొలువుతీరితే ప్రతి ఏడాదికో ప్రధాని మారతారని మోదీ ఎద్దేవా చేశారు. నాయకత్వ సమస్యను పరిష్కరించుకోవడానికి ఇండియా కూటమి ఈ ఫార్ములాను అమలు చేస్తుందన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో ఏడాదికో ప్రధాని మారితే ప్రపంచం దృష్టిలో మనం నవ్వులపాలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలన వస్తే ప్రజలకు ఒకటి కంటే ఎక్కువ కార్లు, మోటార్ సైకిళ్లు, ఇళ్లుంటే ప్రభుత్వపరమవుతాయన్నారు. -
ప్రియుడి కోసం వేలకోట్ల సంపదను వదిలేసిన బిజినెస్ టైకూన్ కూతురు
నిజమైన ప్రేమ ఎంతటి కష్టాన్నైనా ఎదురిస్తుంది. స్వచ్ఛమైన ప్రేమ ప్రేమించిన మనిషికోసం ఎంతటి త్యాగానికైనా సాహసానికైనా పూను కుంటుంది. ఇవి సినిమాడైలాగుల్లా, డ్రమటిగ్గా అనిపిస్తున్నాయా? కానీ ఈ మాటల్ని అక్షరాలా నిజం చేసింది ఓ మహిళ . ఆమె ఎవరో తెలుసుకుందాం రండి..! కుటుంబాన్ని, వేలకోట్ల సంపదను వదులుకుని మరీ తన ప్రియుడు కోసం తృణప్రాయంగా త్యజించింది. మలేషియాకు చెందిన కోటీశ్వర కుటుంబానికి చెందిన ఏంజెలిన్ ఫ్రాన్సిస్. ఆమె మలేషియా బిజినెస్ టైకూన్ కూ కే పెంగ్ కుమార్తె. ఈయన కోరస్ హోటల్స్ డైరెక్టర్. మలేషియాలో 44వ ధనవంతుడు. అంతేకాదు మాజీ మిస్ మలేషియా పౌలిన్ సాయ్ కుమార్తె. ధనిక కుటుంబానికి చెందిన ఏంజిలిన్ ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు, మిత్రుడు జెడిడియాతో ప్రేమలో పడింది. అతణ్ణే పెళ్లాడనుకుంది. భయపడుతూనే తల్లిదండ్రులను సంప్రదించింది. కానీ ఏంజెలిన్ తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించ లేదు. భిన్న ఆర్థిక నేపథ్యాలను ఏంజెలిన్ తండ్రి వీరి పెళ్లికి ససేమిరా అన్నాడు. బాయ్‌ఫ్రెండ్ కావాలో లేక వేల కోట్ల వారసత్వ ఆస్థి కావాలో తేల్చుకో మన్నాడు. చివరికి ఏంజెలిన్ జెడిడియా ఫ్రాన్సిస్‌ను వివాహం చేసుకోవడానికే నిర్ణయించుకుంది. ఈ పెళ్లి చేసుకోవడం ద్వారా వారసత్వంగా దాదాపు రూ. 25వేల కోట్లు (300 మిలియన్ల డాలర్లు)ను వదిలేసుకుంది. విలాసవంతమైన జీవితం కన్నా ప్రేమించినవాడితో జీవితం చాలునుకుంది. అలా 2008లో ఏంజెలిన్, జెడిడియా వివాహం చేసుకున్నారు. అయితే సాధారణమైన ప్రియుడి కోసం వేల కోట్ల సంపదను కుటుంబాలను వదులుకున్న ఉదంతం మరొకటి కూడా ఉంది. జపాన్ యువరాణి మాకో ప్రేమకోసం అపారమైన సంపదను, రాయల్ బిరుదును కూడా వదులుకుంది. 2021లో మాకో, కీ కొమురోవాను వివాహం చేసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ ఆన్లైన్లో గేమ్ ఆడుతూ భారత్‌కు చెందిన వ్యక్తితో ప్రేమలో పడి, ఇండియాకు వచ్చేసిన సంగతి తెలిసిందే. -
ఇంటి పేరు మార్చుకుంటున్నారా..?
వివాహానంతరం మహిళల ఇంటి పేరులో మార్పు చూస్తుంటాం. ఆమెకు, ఆమె సంతానానికి సహజంగానే భర్త ఇంటి పేరు వర్తిస్తుంది. అప్పటి వరకు తండ్రి ఇంటి పేరును వారసత్వంగా మోసిన ఆమె, తన విద్యార్హతలు, ఇతర ధ్రువీకరణ, గుర్తింపు పత్రాల్లో అదే పేరును కలిగి ఉంటుంది. మరి పెళ్లి తర్వాత ముఖ్యమైన పత్రాల్లో భర్త ఇంటి పేరును చేర్చుకోవాలా..? వద్దా..? ఇదొక పెద్ద సందేహం. చాలా మంది ఈ విషయంలో డోలాయమాన స్థితిని ఎదుర్కొంటూ ఉంటారు. వివాహానంతరం తండ్రి ఇంటి పేరుతో కొనసాగేందుకు అందరూ అంగీకరించకపోవచ్చు. భర్త అంగీకరించినా, మార్చుకోవడం సులభమేమీ కాదు. ఇందులోని సాధక బాధకాలను పూర్తిగా తెలుసుకుంటే అప్పుడు ఏం చేయాలో సులభంగా తేల్చుకోవచ్చు. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత కేవలం ఆధార్‌లో మాత్రమే ఇంటి పేరును మార్చుకుని వదిలివేయడం సరైనది కాదు. విద్యార్హతలు సహా చట్టబద్ధమైన అన్ని పత్రాలు, పెట్టుబడుల డాక్యుమెంట్లలో ఇంటి పేరును మార్చుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు ఎదురుకావు. కేవలం పాన్, ఆధార్‌లోనే ఇంటి పేరు మార్చుకుంటే, అది ఎన్నో ఇక్కట్లకు దారితీయవచ్చు. ఈపీఎఫ్, బ్యాంక్ ఖాతాల్లోని పేర్లకు, పాన్, ఆధార్‌లోని పేర్ల మధ్య అంతరం ఏర్పడుతుంది. ఆయా ఖాతాల నుంచి నిధులను వెనక్కి తీసుకోవాలంటే.. పేరును అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం మరోసారి కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియ పూర్తి చేయక తప్పదు. పేర్ల అప్డేట్ కోసం అఫిడవిట్, ఇతర డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి రావచ్చు. ‘‘వివాహం తర్వాత ఇంటి పేరును మార్చుకోవడం అన్నది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమే. కానీ ఈ విషయంలో లాభ, నష్టాలు రెండింటినీ పరిశీలించుకోవాలి. పేరును మార్చుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే కుటుంబం అంతటికీ ఒకే విధమైన గుర్తింపు, ఏకరూపత ఉంటుంది. అన్ని రకాల డాక్యుమెంట్లలోనూ పేరు ఒకే విధంగా ఉండేందుకు శ్రమ పడాల్సి రావడమే ప్రతికూలం’’అని ఫిన్‌ఎడ్జ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ దీపికా భారతి వివరించారు. పెళ్లయిన తర్వాత ఇంటి పేరును మార్చుకోవడం వల్ల ఎన్నో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని ‘అలగ్ అండ్ కపూర్ లా ఆఫీసెస్’ (న్యాయ సేవల సంస్థ) పార్ట్నర్ సోనాల్ అలఘ్ పేర్కొన్నారు. గతంలోని పేరుకు, ప్స్ట్రేతుత పేరుకు మధ్య మార్పు నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో ఎన్నో పరిశీలనలకు తోడు వృత్తిపరమైన ధ్రువీకరణలు అవసరం పడతాయన్నారు. భర్త ఇంటి పేరు అప్పటి వరకు ఉన్న ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకుంటున్నట్టు అయితే చట్టబద్ధంగా గుర్తింపును మారుస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. అధికారిక రికార్డుల్లో పేర్లు మార్చుకోవడం అన్నది పరిపాలనాపరమైన పెద్ద చిక్కుగా, సవాలుతో కూడుకున్నదిగా అభివర్ణించారు సోనాల్ అలఘ్. ‘‘దీనికి తోడు విద్యా, ప్రభుత్వ సంస్థల్లో పేరు మార్పునకు సంబంధించిన కఠిన ప్రక్రియ కష్టాలను మరింత పెంచుతుంది. దీంతో గుర్తింపు సమస్యలు ఎదురుకావచ్చు’’అని ఆమె పేర్కొన్నారు. మహిళ ఇంటి పేరును మార్చుకుంటుంటే, అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లలోనూ ఆ మేరకు మార్పులు చేసుకోవాలని దీపికా భారతి సూచించారు. కేవలం కొన్నింటిలోనే మార్పు చేసుకుని వదిలేస్తే, విదేశాలకు వెళ్లే సందర్భాల్లో, పెట్టుబడుల సమయంలో, లేదంటే నామినీగా ఉండి పెట్టుబడులను క్లెయిమ్ చేసుకోవాల్సిన సందర్భాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆస్తులు తదితర చట్టబద్ధమైన డాక్యుమెంట్లు, బీమా పాలసీల్లో పేరులో మార్పు చేయకపోతే, గుర్తింపును నిరూపించుకునేందుకు లేదా ఆయా ఆస్తులను సొంతం చేసుకునేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుందని కరంజ్వాలా అండ్ కో పార్ట్నర్ మేఘనా మిశ్రా పేర్కొన్నారు. ఆస్తి పత్రాల్లో అధికారిక డాక్యుమెంట్లలో ఇంటి పేరును మార్చుకున్న ప్రతి ఒక్కరూ.. తమ పేరిట ఉన్న భౌతిక, ఆర్థిక ఆస్తులు అన్నింటిలోనూ ఆ మేరకు సవరణ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒక్కసారి ఆధార్, పాన్‌లో కొత్త ఇంటి పేరు ఆధారంగా సవరణ చేసుకుంటే, ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల్లో మార్చుకోవడం సులభతరం అవుతుందని భారతి తెలిపారు. ఉద్యోగం చేసే చోట అధికారిక రికార్డుల్లోనూ ఇంటి పేరులో మార్పు చేసుకోవడం ద్వారా ఇబ్బందులను అధిగమించొచ్చు. మార్చుకోవడం వల్ల ప్రయోజనం ఉందా? నేటి రోజుల్లో దాదాపు అధిక శాతం మహిళలు పెళ్లయిన తర్వాత తమ ఇంటి పేరును మార్చుకుంటున్నారు. భర్త ఇంటి పేరుకు మారిపోవడం వల్ల గుర్తింపు సులభంగా ఉంటుందని మిశ్రా తెలిపారు. సామాజికంగా ఒకే కుటుంబం అన్న భావన, కుటుంబంలో ఐక్యతకు ఇది అనుకూలిస్తుందన్నారు. పాన్, ఆధార్, ఇతర డాక్యుమెంట్లు కీలక పత్రాల్లో ఇంటి పేరు మార్చుకునేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ (వివాహ ధ్రువీకరణ) సమరి్పంచాల్సి వస్తుంది. పాస్ పోర్ట్ ఆఫీస్, ఆధార్ నమోదు కేంద్రాలకు వెళ్లి నిర్ధేశిత దరఖాస్తుకు అనుబంధంగా వివాహ ధ్రువీకరణ పత్రం, ఇతర డాక్యుమెంట్లను ఇవ్వాలి. మ్యారేజ్ సర్టిఫికెట్‌తోపాటు గుర్తి్తంపు, చిరునామా ధ్రువీకరణ, పేరు మార్పునకు సంబంధించి అఫడవిట్ అవసరమవుతాయని మిశ్రా తెలిపారు. ‘‘నిర్ధేశిత మార్పునకు సంబంధించి చటబద్ధమైన ప్రక్రియలకు కట్టుబడి ఉండడం కీలకం. ఇక్కడ చెప్పినవన్నీ ప్రాథమికంగా సమర్పించాల్సినవి. విడిగా ఆయా డాక్యుమెంట్లలో మార్పులకు గాను సమరి్పంచాల్సినవి వేరేవి కూడా ఉండొచ్చు’’అని మిశ్రా పేర్కొన్నారు. పదో తరగతి మెమో చాలా వాటికి పదో తరగతి విద్యార్హత సర్టిఫికెట్ కీలకంగా పనిచేస్తుంది. ఇందులో పేరు మార్చుకోవడం కష్టమేనంటున్నారు మేఘన మిశ్రా. ‘‘సీబీఎస్ఈ వంటి బోర్డులు సాధారణంగా సర్టిఫికెట్లలో పేర్ల మార్పునకు అనుమతించడం లేదు. పాన్, పాస్‌పోర్ట్‌కు టెన్త్ సర్టిఫికెట్ కీలకంగా పనిచేస్తుంది. పాన్/ఆధార్‌కు, సీబీఎస్ఈ పదో తరగతి సర్టిఫికెట్లో పేరుకు వ్యత్యాసం ఉంటే బ్యాంక్ ఖాతా లేదా పాస్‌పోర్ట్ తీసుకునే విషయంలో ధ్రువీకరణ కోసం అదనపు డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. వివాహానంతరం వృత్తిపరమైన విద్యార్హతల డాక్యుమెంట్లు, కోర్సుల్లో ప్రవేశాలకు నమోదు చేసే పేరు, అంతకుముందు డాక్యుమెంట్లలో మాదిరే ఉండాలి’’అని మిశ్రా వివరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయవాది ఏక్తా రాయ్ అభిప్రాయం భిన్నంగా ఉంది. స్కూల్ సర్టిఫికెట్లు అన్నవి ఒక నిరీ్ణత కాలం వరకు పుట్టిన తేదీకి ధ్రువీకరణలుగా కొనసాగుతాయి. ఇతర కీలక డాక్యుమెంట్లు అయిన పాన్, ఆధార్ తదితర ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఇంటి పేరును అప్డేట్ చేసుకున్న తర్వాత, స్కూల్ సర్టిఫికెట్లకు అంత ప్రాధాన్యం ఉండదు. అయినప్పటికీ వివాహానంతరం మహిళ పాన్ లేదా ఆధార్‌లో పేరు మార్చుకునేట్టు అయితే లేదా ఉన్నత కోర్సులకు దరఖాస్తు చేసుకుంటున్నట్టు అయితే తన వివాహాన్ని రిజిస్టర్ చేసుకుని, వివాహ రిజిస్ట్రేటేషన్ సర్టిఫికెట్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. జిల్లా మేజి్స్ట్రేట్ నుంచి పాఠశాల సర్టిఫికెట్లలో ఇంటి పేరు మార్పును ధ్రువీకరిస్తున్నట్టు అటెస్టేషన్ తీసుకున్నా అది కూడా పరిగణనలోకి వస్తుంది’’అని ఏక్తా రాయ్ తెలిపారు. ఆస్తుల క్లెయిమ్ కుటుంబ పెద్దలు కొందరు వీలునామా రాస్తుంటారు. కుమార్తెలకు సంబంధించి వివరాలు నమోదు చేస్తున్నప్పుడు తమ ఇంటి పేరునే పేర్కొంటారు. వీలునామా రాసిన వ్యక్తి మరణానంతరమే అది అమల్లోకి వస్తుంది. అలా అమల్లోకి వచ్చే నాటికి మహిళలు వివాహాలు చేసుకుని, భర్త ఇంటి పేరుకు మారి ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో వీలునామాలోని వివరాల మేరకు తమ హక్కులను క్లెయిమ్ చేసుకునే సందర్భంలో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రాపర్టి, యాజమాన్యం లేదా వారసత్వ వివాదాల్లో ఇంటి పేరు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లలోని ఇంటి పేరు ఒకే మాదిరిగా ఉండకపోతే సవాళ్లు ఎదురవుతాయని ఏక్తారాయ్ అంటున్నారు. వీలునామాలోని పేరుకు, ప్స్ట్రేతుతం మహిళ పేరుకు మధ్య వ్యత్యాసం ఉంటే, అదనపు రుజువులు, డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి ఉంటుందని సోనాల్ అలఘ్ తెలిపారు. మహిళ ఇంటి పేరు మార్పు వెనుకనున్న అంశాలను కోర్టులు, అధికారులు పరిగణనలోకి తీసుకోవచ్చని చెప్పారు. ఏవైనా వ్యత్యాసాలు ఉంటే అందుకు సంబంధించి సహేతుక ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని, దాంతో ఆస్తుల బదిలీ సాఫీగా పూర్తవుతుందని సూచించారు. వీసాకు దరఖాస్తు ‘‘వీసాలో పేరు అప్డేట్ చేసుకోవడం లేదంటే భాగస్వామి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంతర్జాతీయంగా ఉన్న భిన్నమైన కుటుంబ నిర్మాణాల నేపథ్యంలో ఇంటి పేరులో వ్యత్యాసాన్ని ఆయా దేశాల్లో గుర్తించేందుకు ఎన్నో రకాల రుజువులు సమరి్పంచాల్సి రావచ్చు. వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు.. మారిన పేరుకు అనుగుణంగా అప్డేట్ చేసుకోవాలని భావించే వారికి ఈ సవాలు ఎదురవుతుంది’’అని అలఘ్ అంటున్నారు. పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకుని వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే, అప్పుడు వివాహ స్థితిని తెలిపే డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఇది వీసా జారీని ఆలస్యం చేయవచ్చు. అందుకే పెళ్లి తర్వాత పాస్‌పోర్ట్‌లో భర్త ఇంటి పేరు ప్రతిఫలించేలా మార్పు చేసుకోవాలని మిశ్రా సూచించారు. దీనివల్ల ధ్రువీకరణ సమస్యలు తక్కువగా ఉంటాయన్నారు. పేరు మార్చుకోకపోతే..? వివాహం తర్వాత కూడా తన ఇంటి పేరునే కొనసాగించే మహిళలూ కొందరు ఉన్నారు. అలాంటప్పుడు సదరు మహిళ భర్త పేరును పేర్కొనే సమయంలో ఇద్దరి ఇంటి పేరు వేర్వేరుగా ఉంటుంది. కనుక తనకు, తన భర్తకు మధ్య బంధానికి నిదర్శనంగా మ్యారేజ్ సర్టిఫికెట్ ఒక్కటి దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. ‘‘వివాహం తర్వాత మహిళ ఇంటి పేరు మార్చుకోకపోతే అప్పుడు వారి బంధాన్ని నిరూపించుకునేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. ఆదాయపన్ను రిటర్నుల దాఖలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్, ఆస్తుల లావాదేవీల సమయంలో ఇది అవసరపడుతుంది. మ్యారేజ్ సర్టిఫికెట్ లేకపోతే భర్త పేరుతో అప్డేట్ చేసిన ఆధార్, పాస్‌పోర్ట్, బ్యాంక్ జాయింట్ అకౌంట్ పాస్‌బుక్ లేదా స్టేట్మెంట్, ఒకే ఇంట్లో నివసిస్తున్నట్టు రుజువులు, అఫిడవిట్ సాయపడతాయి’’అని మిశ్రా తెలిపారు. పిల్లల బర్త్ సర్టిఫికెట్ వివాహానంతరం మహిళల ఇంటి పేరులో మార్పు లేనప్పుడు.. ఆ దంపతులకు జని్మంచే పిల్లల బర్త్ సర్టిఫికెట్లో తల్లి, తండ్రి ఇంటి పేరు వేర్వేరుగా ఉంటుంది. ఇదేమైనా సమస్యలు కలిగిస్తుందా.? అన్న సందేహం రావచ్చు. పిల్లల పేరిట పీపీఎఫ్, సుకన్య సముృద్ధి యోజన తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చే యాలనుకుంటే ఈ బర్త్ సర్టిఫికెట్ అవసరం పడు తుంది. అంతేకానీ, అందులో తల్లి, తండ్రి ఇంటి పేర్లు వేర్వేరుగా ఉంటే ఎలాంటి సమస్య రాదని మిశ్రా పేర్కొన్నారు. మొత్తం పేరే మారితే? కొన్ని వర్గాల ప్రజల్లో పెళ్లి తర్వాత మహిళ ఇంటి పేరే కాకుండా, మొదటి పేరులోనూ మార్పు చోటు చేసుకుంటుంది. ఇది సమస్యలకు దారితీస్తుందని మిశ్రా చెప్పారు. అధికారిక రికార్డులతో పోలిస్తే పేర్ల మధ్య పోలిక లేకపోవడం వల్ల సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పేరు మార్చుకునే విషయంలో చట్టబద్ధమైన నిబంధనలను పాటించడం వల్ల సవాళ్లను అధిగమించొచ్చని సూచించారు. -
22 ఏళ్ల తర్వాత వారసులకు ఊరట.. నగలు ఇచ్చేయాలని హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: చట్టపరమైన వారసుల నుంచి వేర్వేరు వారసత్వ ధ్రువీకరణ పత్రాలను అందించాలని ఆదాయపు పన్ను శాఖ పట్టుబట్టడం సమంజసం కాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. 22 ఏళ్ల క్రితం ఓ వ్యాపారి ఇంటి నుంచి జప్తు చేసిన ఆభరణాలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. తమ తల్లిదండ్రుల నుంచి జప్తు చేసిన అభరణాలను విడుదల చేసేలా ఐటీ శాఖను ఆదేశించాలని కోరుతూ.. హైదరాబాద్ అమీర్‌పేట్‌కు చెందిన నీలేశ్ కుమార్ జైన్, ముఖేశ్ కుమార్ జైన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2000లో తన తల్లిదండ్రుల ఇంటిపై ఐటీ శాఖ దాడులు జరిపిందన్నారు. పలు డాక్యుమెంట్లతో పాటు 2,462 గ్రాముల ఆభరణాలను జప్తు చేసినట్లు చెప్పారు. తమ తల్లిదండ్రులు చెల్లించాల్సిన ఆదాయపు పన్ను, ఐటీ విభాగం చేసిన క్లెయిమ్‌ల విషయంలో న్యాయపరమైన తగాదా నడుస్తోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు మృతిచెందారని, తాము కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ కౌన్సిల్ శరద్ సంఘి వాదనలు వినిపించారు. ఇండియన్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని పిటిషనర్లు ఇప్పటికే వారసత్వ ధ్రువీకరణ పత్రం సమర్పించి నగదు పొందారన్నారు. దీన్ని ఐటీ అధికారులకు ఇచ్చినా.. ప్రత్యేక వారసత్వ ధ్రువీకరణ పత్రం కావాలని అడుగుతున్నారని నివేదించారు. ఐటీ శాఖ తరఫున సీనియర్ కౌన్సిల్ జేవీ ప్రసాద్ హాజరయ్యారు. ఆభరణాలు పిటిషనర్లకు ఇస్తే.. భవిష్యత్‌లో వాళ్ల సోదరీమణులు దావా వేసే అవకాశం ఉందన్నారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. వారు కేసు వేసినా, వాళ్ల సోదరుల మీదే వేస్తారు తప్ప ఐటీ శాఖ మీద కాదని పేర్కొంది. వారసులుగా నగలు తీసుకుంటున్నట్లు ఐటీ శాఖకు బాండ్ సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది ధర్మాసనం. చదవండి: మరో కొత్త మండలం... ఇనుగుర్తి -
వారసత్వ ఆస్తుల కోసం తండ్రి కొత్త షరతు.. కూతురి ఆవేదన
సాధారణంగా వారసత్వ ఆస్తులు దక్కాలంటే... పెళ్లి చేసుకోవాలనో, మరేదో నిబంధన పెడుతుంటారు తల్లిదండ్రులు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఆ తండ్రి మాత్రం ఓ కొత్త నియమం పెట్టాడు. రూ.93 కోట్ల ఆస్తి తన కూతురు క్లేర్ బ్రౌన్కు చెందాలంటే ఆమె శాశ్వతమైన ఉద్యోగాన్ని సంపాదించాలని, అందులోంచి ఎంతో కొంత సమాజానికి కంట్రిబ్యూట్ చేయాలని వీలునామాలో పొందుపరిచాడు. ట్రస్టు నుంచి ఫండ్స్ రావడం ఒక్కసారిగా ఆగిపోవడంతో కోర్టును ఆశ్రయించింది. శాశ్వత ఉద్యోగం దొరికితే తప్ప ఆ ఆస్తులను పొందలేవని క్లేర్‌కు చెప్పేసింది కోర్టు. దాంతో ఇరకాటంలో పడింది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరక్కపోవడంతో తండ్రి ఆస్తులు కూడా దక్కడం లేదు. దీంతో చిన్నచిన్న అవసరాల కోసం కూడా తన జీవితభాగస్వామిపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతోంది క్లేర్. ఉద్యోగమే దొరికితే ఆస్తులతో తనకేం పని అని ప్రశ్నిస్తోంది. ఏడీహెచ్‌డీతో బాధపడుతున్నందున తండ్రి పెట్టిన రెండు నిబంధనలనూ తాను అందుకోలేనని చెబుతోంది. ఆస్తులుండి... అనుభవించలేని ఆమె దీనస్థితికి ఆమె కుటుంబ సభ్యులు సైతం బాధపడుతున్నారు. చదవండి: అదృష్టమంటే అది.. కలలో వచ్చిన నెంబర్‌తో రెండు కోట్లు గెలుచుకున్నాడు.. -
ఆస్తి హక్కు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: ఆస్తి హక్కుకు సంబంధించిన వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వీలునామా రాయకుండా ఒక వ్యక్తి మరణిస్తే.. అతని స్వార్జితం, వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల్లో.. అతని కుమార్తెలకు వారసత్వ హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో మరణించిన వ్యక్తి సోదరుని పిల్లలకు కాకుండా సొంత కుమార్తెకే తొలి హక్కు ఉంటుందని కీలక తీర్పు ఇచ్చింది గురువారం. హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. హిందూ మహిళ, భర్త చనిపోయిన వాళ్ల ఆస్తి హక్కుకు సంబంధించి గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి వీలురాయకుండా చనిపోతే అతని ఆస్తిలో కూతుళ్లకు హక్కు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. ఒకవేళ హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమెకు తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిపై.. తండ్రి వారసులు అందరికీ సమాన హక్కు ఉంటుంది. అదే మహిళకు భర్త, అత్త, మామల ద్వారా వచ్చిన ఆస్తులపై వీలునామా లేకపోతే.. భర్త వారసులకు హక్కులు లభిస్తాయి అని ధర్మాసనం పేర్కొంది. ప్రతీకాత్మక చిత్రం మద్రాసు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ఆ పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే.. సొంత కుమార్తెకు ఆస్తులపై హక్కు ఉంటుందా? లేదంటే అతని సోదరుని పిల్లలకు హక్కు ఉంటుందా? అన్న సందిగ్ధాన్ని కోర్టు పరిష్కరిస్తూ పై తీర్పును వెలువరించింది. తమిళనాడుకు చెందిన ఈ కేసుకు సంబంధించి మార్చి 1, 1994లో ట్రయల్ కోర్టు తీర్పు ఇవ్వగా.. ఈ తీర్పును హైకోర్టు సైతం సమర్థించింది. ఇక ఆర్డర్ డేట్ 21, 2009న జారీ చేసింది హైకోర్టు. ఇప్పుడు ఆ తీర్పును పక్కనపెడుతూ సుప్రీంకోర్టు తీర్పు కీలక వెలువరించింది. జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కృష్ణ మురారి ఆధ్వర్యంలోని బెంచ్.. ఈ తీర్పు కోసం 51 పేజీల తీర్పు కాపీని సిద్ధం చేయడం విశేషం. చదవండి: ఎన్నికల్లో సమోసా-చాయ్ నుంచి బీఎండబ్ల్యూ వరకు.. -
బిల్‌గేట్స్‌కు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న మెలిందా
వాషింగ్టన్: మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భార్య మెలిందా నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వెనుక గల కారణాలను వారు వివరించలేదు.. కానీ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. విడాకుల తర్వాత తాము సంపాదించిన ఆస్తిలో ఎక్కువ భాగం తమ ఫౌండేషన్‌కే చెందుతుందని పిల్లలకు కేవలం 10 మిలియన్ డాలర్ల చొప్పున ఇస్తామని గేట్స్ బహిరంగంగానే ప్రకటించారు. అయితే తాజాగా ఈ నిర్ణయాన్ని మెలిందా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. తన బిడ్డలకు వారసత్వంగా ఎక్కువ ఆస్తిని ఇప్పించాలని మెలిందా భావిస్తున్నారట. ఈ క్రమంలో ఆమె తమ ఇద్దరి సమిష్టి సంపద 130 బిలియన్ డాలర్ల ఆస్తిని విభజించడానికి సిద్ధమవుతున్నారట. ఇందుకు గాను మెలిందా ఒక న్యాయ బృందాన్ని నియమించుకుందని.. దీనిలో టాప్ ట్రస్ట్, ఎస్టెట్ లాయర్ ఉన్నారని డెయిలీ మెయిల్ కోట్ చేసింది. మెలిందా తాజా నిర్ణయంతో వారి కూతుళ్లు జెన్నిఫర్ కేథరీన్ (25), ఫేబీ అడేల్ (18), కొడుకు రోనీ జాన్ (21) వారసత్వంగా ఎక్కువ ఆస్తి లభించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. చదవండి: గేట్స్ దంపతులు విడిపోవడానికి కారణం ‘అతడేనట’.. -
కొడుకుతో సమానంగా కూతుళ్లకూ వాటా..
చెన్నై: ఆడపిల్ల పెళ్లి చేశాక ఎన్నటికీ ఈడ పిల్ల కానే కాదు అనేది మన సనాతన సంప్రదాయం. అందుకే, వారసత్వంగా వచ్చే ఆస్తులేవైనా మగపిల్లలకే తప్ప ఆడపిల్లలకు ఇవ్వాలనుకోరు. కానీ, తమిళనాడులోని శతాధిక వృద్ధురాలు కృష్ణవేణి అమ్మాళ్ మాత్రం కొడుకుతో పాటు సమానంగా తన ముగ్గురు కూతుళ్లకూ వారసత్వ ఇంటి ఆస్తి దక్కాల్సిందే అని పట్టుబట్టి పోలీసు స్టేషన్ గడప తొక్కింది. అనుకున్నది సాధించింది. విల్లుపురంలోని సిరువాంధాడు గ్రామానికి చెందిన కృష్ణవేణి అమ్మాళ్ పండు ముదుసలి. వయసు 108 ఏళ్లు. ఆమెకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. కృష్ణవేణి అమ్మాళ్ కూతుళ్లతో పాటు ఉండగా కొడుకు గణేశన్ అదే ఊళ్లో విడిగా తన కుటుంబంతో నివసిస్తున్నాడు. వారసత్వంగా వస్తున్న ఇంటిని కొడుకుతో పాటు కూతుళ్లకూ సమాన వాటా ఇవ్వాలని నిర్ణయించుకున్న ఆ అవ్వ సదరు అధికారులను కలిసింది. కొడుకు తనకు తెలియకుండా ఆస్తి పత్రాన్ని మార్చుకొని, మోసం చేశాడని తెలిసింది. (చదవండి: ఇంత అవమానమా.. ఆలస్యంగా వెలుగులోకి..) నేరుగా కొడుకును అడిగింది. ‘చెప్పకుండా ఆస్తి నీ పేరున మార్చుకున్నావు. ఇప్పటికైనా అక్కచెల్లెళ్లకూ ఆ ఆస్తిలో సమానవాటా ఇవ్వమ’ని అడిగితే కాదు పొమ్మన్నాడు. కృష్ణవేణి అమ్మాళ్ ఊరుకోలేదు. జిల్లా పోలీసు అధికారులను కలిసి, కొడుకు చేసిన మోసాన్ని వివరించింది. సహాయం చేయమని కోరింది. జిల్లా ఎస్పీ ఎస్.రాధాకృష్ణన్ సిరువాంధాడు గ్రామానికి వెళ్లి కృష్ణవేణి అమ్మాళ్ ఫిర్యాదుపై ఆరా తీశారు. గణేశన్‌ని పిలిచి విషయం పై నిలదీశారు. ఎస్పీ మాట్లాడిన తర్వాత గణేశన్ తన అక్కచెల్లెళ్లకూ ఇంట్లో వాటా ఇవ్వడానికి అంగీకరించాడు. ఆ వెంటనే, ఆస్తిని గణేశన్‌తోపాటు ముగ్గురు అక్కచెల్లెళ్లకూ సమాన వాటా చెందేలా పత్రం రాసి, రిజిస్టర్ చేయించారు. డీఎస్పీ రాధాకృష్ణన్, ఇతర పోలీసు సిబ్బంది సమక్షంలో కొత్త భూ పత్రాన్ని కృష్ణవేణి అమ్మాళ్కు అందజేశారు. కొడుకుతో పాటు కూతుళ్లకూ వారసత్వ ఇంటిలో వాటా దక్కాల్సిందే అని పోరాడిన కృష్ణవేణి అమ్మాళ్ ఈ తరానికి సిసలైన ప్రతినిధిగా నిలిచారు. -
‘20వేల కోట్ల ఆస్తి.. ముగ్గురికి హక్కు ఉంది’
చండీగఢ్: దివంగత ఫరీద్కోట్ మహారాజాకు చెందిన దాదాపు రూ.20,000 కోట్ల విలువైన ఆస్తిని.. ఆయన కుమార్తెలకు వారసత్వంగా మంజూరు చేస్తు హర్యానా హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీనిలో మణిమజ్రా కోట, సిమ్లా మషోబ్రాలోని ఆస్తులు, బ్యాంక్ డిపాజిట్లు, ఆభరణాలు, పాతకాలపు కార్లు, ఢిల్లీ ఇండియా గేట్ సమీపంలోని కోపర్నికస్ మార్గ్ వద్ద ఉన్న ఫరీద్కోట్ హౌస్ ఉన్నాయి. కుమార్తెలు రాజ్‌కుమారి అమృత్ కౌర్, దీపిందర్ కౌర్ ఇద్దరికీ ఈ ఆస్తిలో 75 శాతం వాటా లభిస్తుందని కోర్టు తెలిపింది. మిగిలిన 25 శాతం వాటా వారి తల్లి మహారాణి మహీందర్ కౌర్‌కు చెందుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్ రాజ్‌మోహన్ సింగ్ తన 547 పేజీల తీర్పులో ఇద్దరు కుమార్తెల హక్కులను సమర్థించారు. మహారావల్ కేవాజీ ట్రస్ట్, దీపిందర్ కౌర్ చేసిన విజ్ఞప్తులను తోసిపుచ్చారు.అంతేకాక ఫరీద్కోట్ పాలకుడు రాజా హరీందర్ సింగ్ బ్రార్ మరణించినప్పుడు మహారాణి మహేంద్ర కౌర్ సజీవంగా ఉన్నారని.. ఆమెకు కూడా ఆస్తిలో వాటా ఉంటుందని కోర్టు తెలిపింది. అయితే ప్రస్తుతం మహారాణి మహీందర్ కౌర్, ఆమె కుమార్తె దీపిందర్ కౌర్ ఇద్దరూ మరణించారు. దాంతో ఈ ఇద్దరి వాటాలు వారి చట్టపరమైన వారసులకు వెళ్తాయని కోర్టు తెలిపింది. ఇప్పటివరకు ఆస్తులను నిర్వహిస్తున్న మహారావల్ ఖేవాజీ ట్రస్ట్ చట్టవిరుద్ధమని ప్రకటించిన దిగువ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. దిగువ కోర్టు 2013 జూలై 25న తన తీర్పులో.. దివంగత తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న అమృత్ కౌర్‌కు వారసత్వాన్ని ఇచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని దీపిందర్ కౌర్ పై కోర్టులో సవాలు చేశారు. దీన్ని కోర్టు 2018లోనే కొట్టివేసింది. ఫరీద్కోట్ వివాదం... 1918 లో మూడేళ్ళ వయసులో పాలకుడిగా పట్టాభిషేకం పొందిన హరీందర్ ఫరీద్కోట్ ఎస్టేట్ చివరి పాలకుడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు... అమృత్ కౌర్, దీపిందర్ కౌర్ , మహిపీందర్ కౌర్ కాగా ఒక కుమారుడు హర్మహిందర్ సింగ్ ఉన్నారు. కొడుకు 1981 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఏడుగురు సిక్కు రాచరికపు మహారాజులలో ఒకరైన హరీందర్ 1989లో మరణించాడు. చనిపోయేనాటికి ఆయనకు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్,ఢిల్లీ, హర్యానా మరియు చంఢీగడ్‌లో ఎన్నో విలువైన ఆస్తులు ఉన్నాయి. అక్టోబర్ 1989 లో మహారాజా మరణించిన తర్వాత ఈ ఆస్తి వివాదం ప్రారంభమైంది. హరీందర్ కౌర్ మరణించిన తర్వాత ఓ విల్లు వెలుగులోకి వచ్చింది. ఈ విల్లును 1982లో రాసినట్లు దానిలో ఉంది. మహారాజా తన ఆస్తులను మహర్వాల్ ఖేవాజీ ట్రస్ట్‌కు ఇచ్చినట్లు విల్లు పేర్కొంది. అంతేకాక కుమార్తె దీపిందర్ కౌర్ అధ్వర్యంలో ఈ ట్రస్ట్ నడుస్తుంది. మూడవ కుమార్తె ఈ ట్రస్టుకు ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. రెండవ కుమార్తె అయిన అమృత్ కౌర్ 1952లో తండ్రికి ఇష్టం లేని వ్యక్తిని వివాహం చేసుకోవడంతో ఆమెకు ఈ ఆస్తిలో వాటాలేదని మహారాజా ప్రకటించారు. అయితే మహారాజు చనిపోయిన తర్వాత అమృత్ కౌర్ ఎస్టేట్ యాక్ట్, 1948 ఆధారంగా మొత్తం ఎస్టేట్ మీద దావా వేశారు. విల్లు నకిలీదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగానే మహారాజా మూడవ కుమార్తె మహిపీందర్ కౌర్ 2001లో కన్యగానే మరణించారు. మరో రెండు పిటిషన్లు.. అమృత్ కౌర్ మాదిరిగానే మహారాజా హరీందర్ సింగ్ సోదరుడు మంజిత్ ఇందర్ సింగ్ కుమారుడు భరతీందర్ సింగ్ జేష్ఠత్వ నియమాన్ని పేర్కొంటూ ఆస్తిపై తనకు హక్కు కల్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. తండ్రి రాసిన విల్లు ఆధారంగా తనకు ఆస్తిలో వాటా దక్కాలని దీపిందర్ కౌర్ దావా వేశారు. అయితే ఈ వివాదం నడుస్తుండగానే దీపిందర్ కౌర్ మరణించారు. ఈ వివాదానికికి సంబంధించి 2018లోనే హర్యానా హై కోర్టు ట్రస్టు పాత్ర శూన్యమని ప్రకటించి కుమార్తెలకు ఆస్తిని ఇవ్వమని పేర్కొంది. నేడు జస్టిస్ రాజ్‌మోహన్ సింగ్ 30ఏళ్ల ఈ వివాదానికి తుది తీర్పు ఇచ్చారు. హిందూ వారసత్వ చట్టం ప్రకారం రాజా హరీందర్ సింగ్ ఆస్తిలో ఆయన ఇద్దరు కుమార్తెలు అమృత్ కౌర్, దీపిందర్ కౌర్‌లతో పాటు మహారాణికి వాటా ఉంటుందని కోర్టు తెలిపింది. ఆస్తిని స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో ట్రస్ట్ ధర్మకర్తలు కుట్ర పన్నారని.. నకిలీ విల్లును సృష్టించారని కోర్టు వెల్లడించింది. -
వారసత్వ ఆస్తుల ప్రణాళికాంశాలపై నాట్స్ వెబినార్
టెంపా, ఫ్లోరిడా: అమెరికాలో తెలుగువారి కోసం అనేక ఉపయుక్తమైన కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) .. వీలునామా, వారసత్వ ఆస్తుల ప్రణాళికాంశాలపై వెబినార్ ద్వారా అవగాహన సదస్సు నిర్వహించింది. అమెరికాలోని ప్రముఖ న్యాయ నిపుణులు, రచయిత అలన్ ఎస్ గస్‌మన్ ఈ వెబినార్‌లో ఎంతో విలువైన సూచనలు, సలహాలు అందించారు. టెంపాలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు అమెరికాలో వివిధ రాష్ట్రాల నుంచి తెలుగువారు వెబినార్ ద్వారా ఆన్‌లైన్‌లోకి వచ్చారు. దాదాపు 700 మందికిపైగా తెలుగువారు ఈ వెబినార్ ద్వారా ఎన్నో కీలకమైన, న్యాయపరమైన విషయాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా అమెరికాలో అనుకోని దుర్ఘటనలు, ఊహించని పరిస్థితులు ఎదురయితే ఎలాంటి న్యాయపరమైన హక్కులు ఉన్నాయి..? ఒకేసారి తల్లిదండ్రులు ఇద్దరూ మరణిస్తే వారి పిల్లలకు సంరక్షకులను ఎలా నిర్ణయిస్తారు..? మరణించిన తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకు వారసత్వంగా సంక్రమించాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..? న్యాయస్థానాలు ఏమి చెబుతున్నాయి...? మీరు అచేతన వ్యవస్థలో స్పందించలేని స్థితిలో ఉంటే మీ ఆరోగ్య సంరక్షణ విషయంలో మరొకరు మీకు సాయం చేసేందుకు ముందుకు వస్తే.. అటువంటి సమయాల్లో ఏమైనా న్యాయపరంగా వచ్చే చిక్కులేమిటి..? ఇలాంటి ఎన్నో అంశాలపై అలన్ చాలా పూర్తి స్పష్టత ఇచ్చారు. విల్, ట్రస్ట్, ఎస్టేట్ ప్లానింగ్ ఎలా ఉండాలి అనే దానిపై మనం ముందుగానే ఎంత జాగ్రత్తగా ఉండాలి..? ఏ డాక్యుమెంట్లను మనం సిద్ధం చేసుకోవాలనేది కూడా అలన్ చక్కగా వివరించారు. జీవిత బీమా, అనుకోని సంఘటనలు జరిగితే కుటుంబసభ్యుల సంరక్షణ విషయంలో ముందస్తు ప్రణాళిక ఎలా ఉండాలనేది కూడా చాలా స్పష్టం అలన్ చెప్పుకొచ్చారు. టెంపా చాప్టర్ కో ఆర్డినేటర్ రాజేశ్ కండ్రు, కార్యదర్శి సుధీర్ మిక్కిలినేని, అడ్వైజరీఛైర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని తదితరులు ప్రత్యక్షంగా ఈ సదస్సులో పాల్గొన్నారు. విజయ్ టీం ఈ వెబినార్‌కు కావాల్సిన సాంకేతిక సహకారాన్ని అందించింది. నాట్స్ నాయకులు బాపు నూతి, వంశీ వెనిగళ్ల లు కూడా ఈ వెబినార్ కోసం తమ సహకారాన్ని అందించారు. తొలిసారిగా నాట్స్ నిర్వహించిన ఈ వెబినార్‌కు అద్భుత స్పందన లభించింది. అటు ఫేస్బుక్ లో కూడా దీనిని లైవ్ చేయడంతో అమెరికాలోని నాట్స్ 19 ఛాప్టర్ల సభ్యులతో పాటు వందలాది మంది దీనిని వీక్షించి ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు. నాట్స్ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినందుకు నాట్స్ కు అభినందనలు తెలిపారు. -
జనస్వామ్యంలో వారసత్వమా?
రాజకీయ అర్హతలు లేకుండా పాలనలో యువ వారసులను ప్రజల నెత్తిన రుద్దాలనుకోవడం రాచరిక వ్యవస్థకు సంకేతమే కానీ ప్రజాస్వామ్యం కాదు. అర్హత, అనుభవం లేని వారసులను ప్రజలు తిరస్కరిస్తారు. నేటి ప్రజాస్వామ్యంలో రాజ కీయ వారసులుగా యువ నాయకులు ఎంతోమంది ఆవిర్భవిం చడం చూస్తున్నాం. అలా పాలనా పగ్గాలు చేతపట్టిన వారిలో విజే తలూ ఉన్నారు, పరాజితులూ ఉన్నారు. వారసులు పరిపాలనా పగ్గాలు చేపట్టకూడదన్నది ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేదు. కానీ, అందుకు కావలసిన అనుభవం, తగిన కసరత్తు అవసరం. వారసులకు సమానంగా ఆస్తుల పంపకం వంటిది కాదు రాజకీయ వారసత్వం. ఎవరికైనా సరే.. రాజకీయ అర్హత అంటే మంచి వ్యక్తిత్వం, ప్రజా సంబంధాలు, నాయకత్వ లక్షణాలు ముఖ్యం. రాజకీయాల్లో, పరిపాలనలో యువ నాయకుడుగా రాణించాలంటే.. ప్రధానంగా ప్రాంతీయ, జాతీయ భాషా పరిజ్ఞానంపై పూర్తి పట్టు సాధించాలి. మంచి ఉపన్యాసకుడుగా ప్రజల్ని ఆకర్షించాలి. ప్రజా సంబంధాల్లో చురుగ్గా వ్యవహరించే మంచి నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందాలి. రాజకీయాల్లో నాయకుడు ఏదైనా ఒక విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం ఎంత ముఖ్యమో... అందులో అక్షర దోషం లేకుండా మాట్లాడటం అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. అలాగే తెర వెనుక రాజకీయాలు చేయడం ఎంత అవసరమో... ప్రజల్ని ఆకట్టుకునేలా మాట్లాడటం కూడా రాజకీయాల్లో అంతే అవసరంగా భావించాలి. పార్టీ కార్యకర్తలను భావనాత్మకంగా ప్రభావితం చేయగల్గే వ్యక్తిత్వం, ధైర్య సాహసాలు, సామాజిక స్పృహ వంటి గుణాలు అవసరం. అంతేకాదు, పాలనలో సీనియర్లను అనుసరిస్తూ రాజకీయ అనుభవజ్ఞులు, మేధావుల వద్ద శిష్యరికం అవసరం. పుట్టుకతో ఏ ఒక్కరూ ప్రత్యక్షంగా నాయకుడవటం చరిత్రలో ఎక్కడా లేదు. ప్రజల హృదయాల్ని గెల్చిన ఏ నాయకుడి జీవిత చరిత్రను పరిశీలించినా ఇవి స్పష్టంగా గోచరిస్తాయి. స్వాతంత్య్రోద్యమ కాలంలో మహాత్మాగాంధీ కూడా తను అనుకున్నంత వేగంగా ఒకేసారి నాయకుడు కాలేక పోయాడు. బ్రిటీష్ చెరనుండి దేశాన్ని విడిపించాలన్న తపనతో అందరితోపాటు తను కూడా ఆనాడు ఎక్కడ తెల్లదొరలపై వ్యతిరేక ఉద్యమాలు, సభలు జరిగినా హాజరయ్యేవాడు. ఆ సభలు, ఉద్యమాలలో ఆయనకు ఎక్కడా తగిన గుర్తింపు రాలేదు. అయినా, నిరుత్సాహపడకుండా నిత్యం తన లక్ష్యాలవైపు గురిపెడుతూనే ఉండేవాడు. లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో.. తనకు తప్పకుండా ఒక రాజకీయ గురువు అవసరంగా భావించి, క్రీ.శ. 1912 ప్రాంతంలో ఆనాటి స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలేని తన గురువుగా ఎంపిక చేసుకున్నాడు. గురుబోధనలో భాగంగా ఆనాడు దేశ జనాభాలో దాదాపు 95 శాతం ఉన్న గ్రామీణ భారతీయుల సంస్కృతి– సంప్రదాయాలకు అనుగుణంగా తన వేష–భాషలతోపాటు జీవనశైలిలో మార్పు ను తెచ్చుకొని, దేశం నలుమూలలా పర్యటించి, ప్రజల సమస్యలపై వారికి అండగా ఉంటూ.. ఆ విధంగా జాతి ఐక్యతకు బాటవేసి స్వాతంత్య్రోద్యమ నేత అయ్యాడు. ఉమ్మడి రాష్ట్రంలో మేధావి, అక్షర జ్ఞాని, మృదు స్వభావి, బహు భాషా కోవిదులు దివంగత భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావును దక్షిణాది నుంచి ఒక తెలుగువాడుగా, నెహ్రూ–గాంధీల వారసత్వంలో ఉన్న జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి దేశానికి 10వ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మైనార్టీ ప్రభుత్వం అయినప్పటికీ తన రాజకీయ అనుభవాన్ని మేళవించి పరిపాలనకు కావలసిన పూర్తి మెజార్టీని సంపాదించుకొని ఐదేళ్లు దేశాన్ని ఏకధాటిగా పరిపాలించారు. స్వాతంత్య్రం సాధిం చిన తొలినాళ్లలో బూర్గుల రామకృష్ణారావు, స్వామి రామానంద తీర్థ వంటి రాజకీయ గురువులను ఆశ్రయించడంవల్లనే ఆయన అందర్నీ మెప్పించగల నాయకుడయ్యాడు.ఆంధ్రప్రదేశ్‌లోని మూడు పార్టీలు వైఎస్సార్సీపీ, జనసేన, తెలుగుదేశంలలో.. టీడీపీ వారసుడిగా చంద్రబాబు కొనసాగుతున్నారు. ఇక వైఎస్ జగన్మోహన్రెడ్డి, పవన్ కల్యాణ్‌లు తమ పార్టీల వ్యవస్థాపక అధ్యక్షులే కానీ వారసులు కారు. వారే ఆ పార్టీలను స్థాపించుకున్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు లోకేశ్‌ను తన వారసుడుగా ప్రకటించాడు. లోకేశ్‌ను ఇదివరకే టీడీపీలోకి చేర్చుకొని, ఆయన్ను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించటం తెలిసిందే. ఆయనలో నాయకత్వ లక్షణాల లేమిని పసిగట్టిన చంద్రబాబు, ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గడం కష్టమని, పెద్దల సభే సురక్షితంగా భావించి తన వారసుడిగా లోకేశ్‌ను పెద్దల సభకు పంపి, మంత్రిగా పట్టాభిషిక్తుడిని చేసాడు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కుటుంబంలో వారసులు ఉన్నా... ఆయన మరణం తర్వాత కుటుంబ వారసత్వ తగాదాలు వంటి కారణాల వలన టీడీపీ వారసత్వాన్ని అనూహ్యంగా, అడ్డగోలుగా ఎన్టీఆర్ చిన్న అల్లుడు చంద్రబాబు చేజిక్కించుకుని.. నందమూరి వంశ స్థులను తెరమరుగు చేశారు. చిన్న వయసులోనే కాంగ్రెస్ రాజకీయాలు వంట బట్టిన చంద్రబాబుకు తన రాజకీయ భవిష్యత్తుని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ జీవించి ఉన్నప్పుడు లక్ష్మీపార్వతి వారసత్వం కోసం పోరాడటం తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ పెద్ద కూతురు, మాజీ కేంద్ర మంత్రి డి. పురందేశ్వరిని, అలాగే హరి కృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రజలు ఆ పార్టీ వారసులుగా గుర్తించే అవకాశం నేటికీ ఉంది. అందుకే ముందుచూపున్న చంద్రబాబు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని కోడలుగా చేసుకొని టీడీపీని తన కుటుంబంలో సుస్థిరం చేసుకున్నారు. ఏ తండ్రి అయినా తనయుడి నాయకత్వ లక్షణాలు ముందుగా పసిగట్టలేరా? ఆ విధంగా భవిష్యత్తును ముందుగా తెలుసుకోగల్గే రాజకీయ మేధావిగా చంద్ర బాబు 2019లో తాను అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు అన్న అనుమానంతో ‘అన్నప్రాసన రోజునే ఆవకాయ వడ్డించినట్టు’ ఈ రెండేళ్లలోనే రాజకీయ అక్షరాభ్యాసం కోసం తనయుడ్ని చిన్న వయస్సులోనే పెద్దల సభతోపాటు, అధికారంలో రెండు శాఖలకు యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేశారు. ఈత రాకపోయినా నీటితో నిండి ఉన్న ఈతకొలనులోకి ఒకేసారి నెట్టితే.. ఈత దానంతట అదే వస్తుందన్నది చంద్రబాబు తత్వం. కానీ ఆ వారసుడిని భరాయించవలసింది ప్రజలే కదా? రాజకీయ అర్హతలు లేకుండా పాలనలో యువవారసులను ప్రజల నెత్తిన రుద్దాలనుకోవడం రాచరిక వ్యవస్థకు సంకేతమే కానీ ప్రజాస్వామ్యం కాదు. అంతిమంగా... ప్రజాస్వామ్యంలో కుటుంబ వారసులకు పార్టీ పగ్గాలు అప్పగించే నేపథ్యంలో వారి నాయకత్వ అర్హతను సరిగా పరిశీలించకపోతే అలాంటి నాయకులను, పార్టీలను ప్రజలు తిరస్కరిస్తారు. యాతం వీరాస్వామి వ్యాసకర్త రచయిత, విశ్లేషకుడు ‘ 95816 76918 -
వారసులదే రాజ్యం!
కీలక పదవులు చేపట్టింది నేతలు, వారి కుటుంబసభ్యులే తాజా లోక్‌సభ ఎన్నికల్లోనూ పలువురి పోటీ సాక్షి, ముంబై: రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 30కి పైగా కుటుంబాలు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో పాటు దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే, మాజీ సీఎం అశోక్ చవాన్, బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే, దివంగత నేత ప్రమోద్ మహాజన్ తదితర నేతల వారసులు రాజకీయ రంగంలోకి అడుగిడారు. వీరిలో కొందరైతే తండ్రి, కుమారులు కూడా ముఖ్యమంత్రితో పాటు కీలక మంత్రి పదవులను చేపట్టినవారు ఉన్నారు. ఇప్పుడు జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ పలువురు నేతలు, వారి వారసులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ‘పవర్’ ఫుల్... రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాల్లో పవార్ కుటుంబం కీలకపాత్ర పోషిస్తోంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ దేశంలోని ప్రముఖ నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఈయనకు తల్లి నుంచి రాజకీయ వారసత్వం లభించింది. ఆయన ప్రస్తుతం యూపీఏ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా ఉండగా, ఆయన సోదరుని కుమారుడు అజిత్ పవార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం బారామతి లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా ఉన్న ఆయన కూతురు సుప్రియా సూలే మళ్లీ ఈసారి ఎన్నికల బరిలో దిగారు. తండ్రి కుమారులిద్దరు ముఖ్యమంత్రులుగా... రాష్ట్ర రాజకీయాలలో తండ్రి కుమారులిద్దరు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఘనత చవాన్ కుటుంబీకులకు దక్కింది. దివంగత శంకర్రావ్ చవాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కేంద్రంలో రక్షణమంత్రిగా కూడా విధులు నిర్వహించారు. ఆయన వారసుడైన అశోక్ చవాన్ కూడా సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ముంబై 26/11 ఉగ్రవాదుల దాడుల ఘటన అనంతరం రాష్ట్రంలో మంత్రి పదవులతో పాటు పలు కీలక బాధ్యతలు నిర్వహించిన అశోక్ చవాన్‌కు ముఖ్యమంత్రి పదవి వరించింది. అయితే ఆదర్శ్ కుంభకోణంలో ఆయన పేరు రావడంతో పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం నాందేడ్ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్రంలో హవా ఠాక్రే లదే... శివసేన పార్టీ ఠాక్రే కుటుంబీకులకే వారసత్వంగా లభించింది. ఠాక్రే కుటుంబీకులు ఇంత వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాలను తెరవెనుక నుంచే నడిపిస్తున్నారు. దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే శివసేన పార్టీ స్థాపించారు. ఆయన తర్వాత ఉద్ధవ్ ఠాక్రేను వారసుడుగా ప్రకటించడంతో బాల్‌ఠాక్రే సోదరుని కుమారుడైన రాజ్ ఠాక్రే శివసేన నుంచి బయటకు వెళ్లి మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీని ఏర్పాటు చేశారు. మరోవైపు బాల్‌ఠాక్రే మనుమడు, ఉద్ధవ్‌ఠాక్రే కుమారుడైన ఆదిత్య ఠాక్రే కూడా రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. ఈసారి ఎన్నికల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. దేశ్‌ముఖ్ కుటుంబీకులు... దివంగత మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ వారసులు కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఎనిమిదన్నరేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన విలాస్‌రావ్, ముంబై 26/11 ఉగ్రవాదుల దాడుల ఘటనతో పదవికి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆయనకు కేంద్రమంత్రి పదవిని అప్పగించింది. ఆయ న మరణించిన తర్వాత కుమారుడు అమిత్ దేశ్‌ముఖ్, సోదరుని కుమారుడు దిలీప్ దేశ్‌ముఖ్ రాజకీయాల్లో రాణిస్తున్నారు. ముండే కుటుంబీకులు.. బీజేపీ సీనియర్ నాయకుడైన గోపీనాథ్ ముండే కూడా రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సోదరుని కుమారుడు ధనంజయ్ ముండేతోపాటు ఆయన కుమార్తె పంకజా ముండేలు ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే గోపీనాథ్ ముండేతో వచ్చిన విభేదాల వల్ల ధనంజయ్ ముండే ఎన్సీపీలో చేరారు. మరోవైపు దివంగత ప్రమోద్ మహా జన్ కుమార్తె పూనమ్ మహాజన్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వాయవ్య ముంబై నుంచి మహాకూటమి అభ్యర్థినిగా పోటీ చేస్తున్నారు. దివంగత మాజీ సీఎం వసంత్‌దాదా పాటిల్ కుటుంబీకులలో ఆయన భార్య శాలినీతాయి పాటిల్, కుమారుడు ప్రతీక్, మనుమడు మదన్ పాటిల్‌కు మంత్రి పదవులు లభించాయి. ప్రస్తుత అటవీశాఖ మంత్రి పతంగ్‌రావ్ కదం కుమారుడు విశ్వజీత్ కదంను పుణే లోక్‌సభ నుంచి బరిలో ఉన్నారు. రాష్ట్ర మంత్రి నారాయణ రాణే, ఆయన కుమారుడు నీలేష్ రాణే రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఎన్సీపీ సీనియర్ నాయకుడు గణేష్ నాయక్‌తోపాటు ఆయన కుమారులు సంజీవ్ నాయక్, సందీప్ నాయక్‌లతోపాటు ఆయన సోదరుని కుమారుడు సాగర్ నాయక్‌లు రాజకీయాల్లో రాణిస్తున్నారు. సందీప్ నాయక్ ఎమ్మెల్యేగా, సంజీవ్ నాయక్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈసారి కూడా సంజీవ్ లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు జోరుగానే సాగుతున్నట్టు కనబడుతోంది. -
వారసత్వం