సాధారణంగా వారసత్వ ఆస్తులు దక్కాలంటే... పెళ్లి చేసుకోవాలనో, మరేదో నిబంధన పెడుతుంటారు తల్లిదండ్రులు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఆ తండ్రి మాత్రం ఓ కొత్త నియమం పెట్టాడు. రూ.93 కోట్ల ఆస్తి తన కూతురు క్లేర్ బ్రౌన్‌కు చెందాలంటే ఆమె శాశ్వతమైన ఉద్యోగాన్ని సంపాదించాలని, అందులోంచి ఎంతో కొంత సమాజానికి కంట్రిబ్యూట్ చేయాలని వీలునామాలో పొందుపరిచాడు. ట్రస్టు నుంచి ఫండ్స్ రావడం ఒక్కసారిగా ఆగిపోవడంతో కోర్టును ఆశ్రయించింది. శాశ్వత ఉద్యోగం దొరికితే తప్ప ఆ ఆస్తులను పొందలేవని క్లేర్‌కు చెప్పేసింది కోర్టు. దాంతో ఇరకాటంలో పడింది.
ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరక్కపోవడంతో తండ్రి ఆస్తులు కూడా దక్కడం లేదు. దీంతో చిన్నచిన్న అవసరాల కోసం కూడా తన జీవితభాగస్వామిపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతోంది క్లేర్. ఉద్యోగమే దొరికితే ఆస్తులతో తనకేం పని అని ప్రశ్నిస్తోంది. ఏడీహెచ్‌డీతో బాధపడుతున్నందున తండ్రి పెట్టిన రెండు నిబంధనలనూ తాను అందుకోలేనని చెబుతోంది. ఆస్తులుండి... అనుభవించలేని ఆమె దీనస్థితికి ఆమె కుటుంబ సభ్యులు సైతం బాధపడుతున్నారు.
చదవండి: అదృష్టమంటే అది.. కలలో వచ్చిన నెంబర్‌తో రెండు కోట్లు గెలుచుకున్నాడు..
Comments
Please login to add a commentAdd a comment