ప్రియుడి కోసం వేలకోట్ల సంపదను వదిలేసిన బిజినెస్‌ టైకూన్‌ కూతురు | Malaysian Woman Leaves Rs 2484 Crore to Marry Her Lover | Sakshi
Sakshi News home page

ప్రియుడి కోసం వేలకోట్ల సంపదను వదిలేసిన బిజినెస్‌ టైకూన్‌ కూతురు

Published Wed, Mar 27 2024 1:21 PM | Last Updated on Wed, Mar 27 2024 3:19 PM

Malaysian Woman Leaves Rs 2484 Crore to Marry Her Lover - Sakshi

నిజమైన ప్రేమ ఎంతటి కష్టాన్నైనా ఎదురిస్తుంది. స్వచ్ఛమైన ప్రేమ ప్రేమించిన మనిషికోసం ఎంతటి త్యాగానికైనా సాహసానికైనా పూను కుంటుంది. ఇవి సినిమాడైలాగుల్లా, డ్రమటిగ్‌గా అనిపిస్తున్నాయా? కానీ ఈ మాటల్ని అక్షరాలా నిజం చేసింది ఓ మహిళ . ఆమె ఎవరో తెలుసుకుందాం రండి..! 

కుటుంబాన్ని, వేలకోట్ల సంపదను వదులుకుని మరీ తన ప్రియుడు కోసం తృణప్రాయంగా త్యజించింది. మలేషియాకు చెందిన కోటీశ్వర కుటుంబానికి చెందిన ఏంజెలిన్ ఫ్రాన్సిస్. ఆమె మలేషియా బిజినెస్‌ టైకూన్‌ కూ కే పెంగ్ కుమార్తె. ఈయన కోరస్ హోటల్స్ డైరెక్టర్. మలేషియాలో 44వ ధనవంతుడు. అంతేకాదు మాజీ మిస్ మలేషియా పౌలిన్ సాయ్ కుమార్తె.  

ధనిక కుటుంబానికి చెందిన  ఏంజిలిన్‌ ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు, మిత్రుడు జెడిడియాతో ప్రేమలో పడింది.  అతణ్ణే పెళ్లాడనుకుంది. భయపడుతూనే తల్లిదండ్రులను సంప్రదించింది. కానీ ఏంజెలిన్ తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించ లేదు.  భిన్న ఆర్థిక నేపథ్యాలను ఏంజెలిన్ తండ్రి వీరి పెళ్లికి ససేమిరా అన్నాడు.  బాయ్‌ఫ్రెండ్  కావాలో లేక  వేల  కోట్ల  వారసత్వ ఆస్థి కావాలో తేల్చుకో మన్నాడు.

చివరికి ఏంజెలిన్‌  జెడిడియా ఫ్రాన్సిస్‌ను వివాహం చేసుకోవడానికే  నిర్ణయించుకుంది.  ఈ పెళ్లి చేసుకోవడం ద్వారా వారసత్వంగా దాదాపు రూ. 25వేల కోట్లు (300 మిలియన్ల డాలర్లు)ను వదిలేసుకుంది. విలాసవంతమైన జీవితం కన్నా ప్రేమించినవాడితో జీవితం చాలునుకుంది. అలా 2008లో ఏంజెలిన్, జెడిడియా వివాహం చేసుకున్నారు. అయితే సాధారణమైన ప్రియుడి కోసం వేల  కోట్ల సంపదను  కుటుంబాలను వదులుకున్న ఉదంతం మరొకటి కూడా ఉంది. జపాన్ యువరాణి మాకో ప్రేమకోసం అపారమైన సంపదను, రాయల్‌ బిరుదును కూడా వదులుకుంది.  2021లో మాకో, కీ కొమురోవాను  వివాహం  చేసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ ఆన్‌లైన్‌లో గేమ్ ఆడుతూ భారత్‌కు చెందిన వ్యక్తితో ప్రేమలో పడి, ఇండియాకు వచ్చేసిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement