malaysian woman
-
ప్రియుడి కోసం వేలకోట్ల సంపదను వదిలేసిన బిజినెస్ టైకూన్ కూతురు
నిజమైన ప్రేమ ఎంతటి కష్టాన్నైనా ఎదురిస్తుంది. స్వచ్ఛమైన ప్రేమ ప్రేమించిన మనిషికోసం ఎంతటి త్యాగానికైనా సాహసానికైనా పూను కుంటుంది. ఇవి సినిమాడైలాగుల్లా, డ్రమటిగ్గా అనిపిస్తున్నాయా? కానీ ఈ మాటల్ని అక్షరాలా నిజం చేసింది ఓ మహిళ . ఆమె ఎవరో తెలుసుకుందాం రండి..! కుటుంబాన్ని, వేలకోట్ల సంపదను వదులుకుని మరీ తన ప్రియుడు కోసం తృణప్రాయంగా త్యజించింది. మలేషియాకు చెందిన కోటీశ్వర కుటుంబానికి చెందిన ఏంజెలిన్ ఫ్రాన్సిస్. ఆమె మలేషియా బిజినెస్ టైకూన్ కూ కే పెంగ్ కుమార్తె. ఈయన కోరస్ హోటల్స్ డైరెక్టర్. మలేషియాలో 44వ ధనవంతుడు. అంతేకాదు మాజీ మిస్ మలేషియా పౌలిన్ సాయ్ కుమార్తె. ధనిక కుటుంబానికి చెందిన ఏంజిలిన్ ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు, మిత్రుడు జెడిడియాతో ప్రేమలో పడింది. అతణ్ణే పెళ్లాడనుకుంది. భయపడుతూనే తల్లిదండ్రులను సంప్రదించింది. కానీ ఏంజెలిన్ తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించ లేదు. భిన్న ఆర్థిక నేపథ్యాలను ఏంజెలిన్ తండ్రి వీరి పెళ్లికి ససేమిరా అన్నాడు. బాయ్‌ఫ్రెండ్ కావాలో లేక వేల కోట్ల వారసత్వ ఆస్థి కావాలో తేల్చుకో మన్నాడు. చివరికి ఏంజెలిన్ జెడిడియా ఫ్రాన్సిస్‌ను వివాహం చేసుకోవడానికే నిర్ణయించుకుంది. ఈ పెళ్లి చేసుకోవడం ద్వారా వారసత్వంగా దాదాపు రూ. 25వేల కోట్లు (300 మిలియన్ల డాలర్లు)ను వదిలేసుకుంది. విలాసవంతమైన జీవితం కన్నా ప్రేమించినవాడితో జీవితం చాలునుకుంది. అలా 2008లో ఏంజెలిన్, జెడిడియా వివాహం చేసుకున్నారు. అయితే సాధారణమైన ప్రియుడి కోసం వేల కోట్ల సంపదను కుటుంబాలను వదులుకున్న ఉదంతం మరొకటి కూడా ఉంది. జపాన్ యువరాణి మాకో ప్రేమకోసం అపారమైన సంపదను, రాయల్ బిరుదును కూడా వదులుకుంది. 2021లో మాకో, కీ కొమురోవాను వివాహం చేసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ ఆన్లైన్లో గేమ్ ఆడుతూ భారత్‌కు చెందిన వ్యక్తితో ప్రేమలో పడి, ఇండియాకు వచ్చేసిన సంగతి తెలిసిందే. -
ఫేస్ బుక్‌లో ప్రేమ.. హత్యకు కుట్ర
అన్నానగర్: వీరపాండి సమీపంలో వివాహానికి అంగీకరించని ఫేస్బుక్ ప్రేమికుడిని హతమార్చడానికి మలేషియా మహిళ పంపిన కూలీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తేని జిల్లా వీరపాండి సమీపంలో ఉన్న కాట్టునాయక్కన్ పట్టికి చెందిన అశోక్ కుమార్ (28) బెంగళూర్‌లో ఉన్న ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతనికి ఫేస్బుక్ ద్వారా మలేషియాకు చెందిన అముదేశ్వరి పరిచయమైంది. కాలక్రమేణా ప్రేమగా మారింది. తరువాత అభిప్రాయ బేధాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఈ స్థితిలో మలేషియా నుంచి కవితా అరుణాచలం అనే మహిళ, అశోక్‌కుమార్ సెల్‌ఫోన్‌కి కాల్ చేసి మాట్లాడింది. ఆమె తనను అముదేశ్వరి అక్క అని, వివాహం చేసుకోకపోవడం వల్ల అముదేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించింది. అశోక్ కుమార్ దిగ్భ్రాంతి చెందాడు. ఇంకా ఆమె పనిచేసిన సంస్థలో ఆ మహిళ ఫిర్యాదు చేసింది. అనంతరం మలేషియా నుంచి తమిళనాడు వచ్చిన కవితా అరుణాచలం... అక్టోబర్ 30న అశోక్ కుమార్‌ను కలిసింది. అప్పుడు ఆమె తనను వివాహం చేసుకోవాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అశోక్‌కుమార్ దీనిపై తేని పోలీసులకి సమాచారం అందించాడు. పోలీసులు ఆ మహిళ వద్ద విచారణ చేశారు. ఇందులో 45 ఏళ్లు గల ఆ మహిళ, అముదేశ్వరి, కవితా అరుణాచలం అనే పేరుతో అశోక్‌కుమార్ వద్ద మాట్లాడినట్లు తెలిసింది. తరువాత ఆమెని పోలీసులు హెచ్చరించి పంపారు. ఆమె అసలు పేరు విఘ్నేశ్వరి అని తెలిసింది. ఈ స్థితిలో తనను వివాహం చేసుకోకుండా మోసం చేసిన అశోక్కుమార్ని చంపటానికి 9 మంది కూలీ ముఠాను పంపింది. వారు శుక్రవారం బోడి సమీపంలో ఉన్న ప్రైవేట్ లాడ్జీలో ఉండగా వారి ప్రవర్తన మీద అనుమానం చెందిన లాడ్జీ కార్మికులు బోడి టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేశారు. ఇందులో అశోక్కుమార్ని హత్య చెయ్యడానికి విఘ్నేశ్వరి పంపించిన కూలీ ముఠ అని తెలిసింది. తరువాత పోలీసులు కేసు నమోదు చేసి అన్బరసన్ (24), మునుస్వామి (21), అయ్యనార్ (39), మురుగన్ (21), జోసఫ్ (20), యోగేష్ (20), కార్తిక్ (21), దినేష్ (22), భాస్కరన్ (47)ని పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా వారి నుంచి కారు, కత్తి వంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు విఘ్నేశ్వరి కోసం గాలిస్తున్నారు. -
ఎయిర్ బ్యాగ్ పనిచేయక మహిళ మృతి
ఎయిర్ బ్యాగులు ఉన్నాయి కదా.. ప్రమాదాల్లో రక్షిస్తాయని కాస్తంత ఖరీదు ఎక్కువైనా హోండా సిటీ కారు కొందా మహిళ. కానీ, చిన్నపాటి ప్రమాదంలోనే ఆ కారు ఎయిర్ బ్యాగులు కాస్తా చినిగిపోవడంతో ఆమె మరణించింది. తమ కార్లలో ఎయిర్ బ్యాగులు సరిగా పనిచేయడం లేదంటూ, 1.45 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు హోండా కంపెనీ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ ప్రమాదం సంభవించడం గమనార్హం. ప్రమాదం జరిగిన విషయం తెలిసి.. తాను అక్కడకు వచ్చేసరికి స్టీరింగ్ వీల్‌కు ఉన్న ఎయిర్ బ్యాగ్ చినిగిపోయి ఉందని, బాధితురాలు తీవ్ర రక్తస్రావమై పడి ఉన్నారని సహాయ అధికారి రోస్డి హైనన్ చెప్పారు. కొద్దిసేపటికే ఆమె మరణించారు. తాము ఈ ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నామని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని టోక్యోలోని హోండా మోటార్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు టకాటా కంపెనీ తయారుచేసిన ఎయిర్ బ్యాగులు పనిచేయక 11 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. -
జైపూర్‌లో మలేసియా మహిళపై అత్యాచారం!!
రాజస్థాన్ అందాలను, జైపూర్ కోట రాజసాన్ని చూడాలని వచ్చిన ఓ మలేసియన్ పర్యాటకురాలిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో 30 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. భిల్వారాకు చెందిన నిందితుడిని తాము అరెస్టు చేసినట్లు డీసీపీ అమన్‌దీప్ సింగ్ తెలిపారు. మూడు రోజుల పర్యటన కోసం తాను జైపూర్ వచ్చానని, అక్కడ అతడిని కలిసిన తర్వాత ఇద్దరం కలిసి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం చేశామని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అక్కడి నుంచి అతడు దూరంగా ఉన్న ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి కారులోనే అత్యాచారం చేసినట్లు తెలిపింది. తర్వాత ఆమెను హోటల్ ముందు వదిలేశాడు. ఆమె ఎలాగోలా జవహర్ సర్కిల్ ప్రాంతంలోని ఓ పోలీసు కారు వద్దకు వెళ్లి ఫిర్యాదుచేసింది. మూడు గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.