ఎయిర్ బ్యాగ్ పనిచేయక మహిళ మృతి | Malaysian woman dies after airbag ruptures in accident | Sakshi
Sakshi News home page

ఎయిర్ బ్యాగ్ పనిచేయక మహిళ మృతి

Published Mon, Jun 27 2016 2:01 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

ఎయిర్ బ్యాగ్ పనిచేయక మహిళ మృతి - Sakshi

ఎయిర్ బ్యాగ్ పనిచేయక మహిళ మృతి

ఎయిర్ బ్యాగులు ఉన్నాయి కదా.. ప్రమాదాల్లో రక్షిస్తాయని కాస్తంత ఖరీదు ఎక్కువైనా హోండా సిటీ కారు కొందా మహిళ. కానీ, చిన్నపాటి ప్రమాదంలోనే ఆ కారు ఎయిర్ బ్యాగులు కాస్తా చినిగిపోవడంతో ఆమె మరణించింది. తమ కార్లలో ఎయిర్ బ్యాగులు సరిగా పనిచేయడం లేదంటూ, 1.45 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు హోండా కంపెనీ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ ప్రమాదం సంభవించడం గమనార్హం.

ప్రమాదం జరిగిన విషయం తెలిసి.. తాను అక్కడకు వచ్చేసరికి స్టీరింగ్ వీల్కు ఉన్న ఎయిర్ బ్యాగ్ చినిగిపోయి ఉందని, బాధితురాలు తీవ్ర రక్తస్రావమై పడి ఉన్నారని సహాయ అధికారి రోస్డి హైనన్ చెప్పారు. కొద్దిసేపటికే ఆమె మరణించారు. తాము ఈ ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నామని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని టోక్యోలోని హోండా మోటార్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు టకాటా కంపెనీ తయారుచేసిన ఎయిర్ బ్యాగులు పనిచేయక 11 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement