జైపూర్లో మలేసియా మహిళపై అత్యాచారం!! | Malaysian woman raped in Jaipur, man held | Sakshi
Sakshi News home page

జైపూర్లో మలేసియా మహిళపై అత్యాచారం!!

Published Sat, Jun 7 2014 12:52 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

Malaysian woman raped in Jaipur, man held

రాజస్థాన్ అందాలను, జైపూర్ కోట రాజసాన్ని చూడాలని వచ్చిన ఓ మలేసియన్ పర్యాటకురాలిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో 30 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. భిల్వారాకు చెందిన నిందితుడిని తాము అరెస్టు చేసినట్లు డీసీపీ అమన్దీప్ సింగ్ తెలిపారు. మూడు రోజుల పర్యటన కోసం తాను జైపూర్ వచ్చానని, అక్కడ అతడిని కలిసిన తర్వాత ఇద్దరం కలిసి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం చేశామని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

అక్కడి నుంచి అతడు దూరంగా ఉన్న ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, మత్తుమందు కలిపిన కూల్డ్రింక్ ఇచ్చి కారులోనే అత్యాచారం చేసినట్లు తెలిపింది. తర్వాత ఆమెను హోటల్ ముందు వదిలేశాడు. ఆమె ఎలాగోలా జవహర్ సర్కిల్ ప్రాంతంలోని ఓ పోలీసు కారు వద్దకు వెళ్లి ఫిర్యాదుచేసింది. మూడు గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement