పోలీసులు అదుపులో ఐసీయూలో ఉన్న మహిళపై అత్యాచారినికి పాల్పడిన మగ నర్స్(ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)
జైపూర్: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మనిషిపై జాలి, దయ చూపించాల్సింది పోయి.. దారుణానికి పాల్పడ్డాడు ఓ మృగాడు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళపై అత్యాచారానికి ఓడిగట్టాడు నర్స్. రాజస్తాన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న బాధితురాలికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో స్పృహ కోల్పోయిన మహిళపై సోమవారం రాత్రి మగ నర్స్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
మత్తు ఇంజక్షన్ ఇవ్వడం వల్ల జరిగే దారుణం గురించి ఆమెకు తెలుస్తున్నప్పటికి ప్రతిఘటించలేకపోయింది. ఆ మరుసటి రోజు తనని చూడటానికి వచ్చిన భర్తతో జరిగిన దారుణం గురించి పేపర్ మీద రాసి అతడికి వెల్లడించింది. బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు నర్స్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment