![Caterer Molested 10 Year Old Girl At Her Cousin Engagement Ceremony In Rajasthan - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/4/rape.jpg.webp?itok=MJ3S6sYy)
జైపూర్ : రాజస్తాన్‌లో ఘోరం జరిగింది. బంధువులు నిశ్చితార్థ వేడుకకు వెళ్లిన 10 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. అక్కడ క్యాటరింగ్ చేసే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌కు చెందిన ఓ జంట గత ఆదివారం తమ 10 ఏళ్ల చిన్నారితో కలిసి బంధువుల నిశ్చితార్థ వేడుకకు వెళ్లారు. అక్కడ భోజననాలు వడ్డించేందుకు వచ్చిన రాజు(36) చిన్నారిని బాత్రూంలోకి తిసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని బాత్రూంలోనే ఉంచి డోర్ లాక్ చేసి వచ్చాడు.
కాసేపటి తర్వాత బాలిక కనబడకపోవడంతో తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. అనుమానం వచ్చి బాత్రూంలోకి వెళ్లి చూడగా.. అక్కడ చిన్నారి అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై అక్కడి వారిని ప్రశ్నించగా.. రాజు ప్రవర్తన తేడాగా కనిపించింది. గట్టిగా నిలదీయడంతో నిజం ఒప్పుకున్నాడు. బంధువుల ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు
Comments
Please login to add a commentAdd a comment