
ఇంతవరకు ఎంతోమంది ఐఏఎస్ అధికారులను చూసి ఉండుంటారు. అతెందుకు టీనా దాబి, అమిత్ లోధా వంటి ఎందరో సెలబ్రిటీ హోదాని పొందిన అధికారులను చూశాం. కానీ ఈ ఐఏఎస్ అధికారి గురించి విని ఉండటం అత్యంత అరుదు. ఒక్క రూపాయే జీతం తీసుకున్న ఐఏఎస్ అతడు. కానీ కలెక్టర్లందరి కంటే అత్యంత ధనిక కలెక్టర్ ఆయన. ఎవరా కలెక్టర్ అంటే..
అతడే ఐఏఎస్ అమిత్ కటారియా. ఆయన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చారు. అతడి కుటుంబం కోట్లలో వార్షిక టర్నోవర్‌తో దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని రన్ చేస్తోంది . అంతేగాదు ఆ వ్యాపార సామ్రాజ్యం ఢిల్లీ ఎన్‌సీఆర్ అంతటా విస్తరించి ఉంది. అయితే కటారియా కుటుంబ వ్యాపారాన్ని పక్కకుపెట్టి మరీ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో సివిల్ సర్వీస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాడు. అలా కటారియా ఐఏఎస్ అయిన ధనవంతుడుగా నిలిచాడు..
ఎడ్యుకేషన్ బ్యాగ్రౌండ్..
అమిత్ కటారియా తన పాఠశాల విద్యను ఆర్‌కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పూర్తి చేశారు. తర్వాత ప్రతిష్టాత్మక ఐఐటీ ఢిల్లీలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ డిగ్రీని పొందారు. గ్రాడ్యుయేషన్ తర్వాత, కటారియా UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(CSE)కి ప్రిపేరవ్వడం ప్రారంభించారు. చివరికి 2003లో సివిల్స్ నియామక పరీక్షలో ఉత్తీర్ణుడై ఐఏఎస్ అయ్యారు.
ఆయన ఆల్ ఇండియా 18వ ర్యాంకు సాధించి తన కలను సాకారం చేసుకున్నారు. చత్తీస్‌గడ్ కేడర్‌లో కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. అయితే ఐఏఎస్ అమిత్ కటారియా సివిల్ సర్వీసెస్‌లో చేరినప్పుడు కేవలం రూ. 1 జీతమే తీసుకునేవారని సమాచారం. అందుకు కటారియా తాను దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఐఏఎస్ అయ్యానని అంటుండేవారని అంతరంగికులు చెబుతున్నారు.
అమిత్ కటారియా 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించి రావడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఇది ప్రోటోకాల్‌కు విరుద్ధం. ఆ సమయంలో కటారియా ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత బస్తర్ జిల్లా జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అప్పటి చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నుంచి షోకాజ్ నోటీసులు కూడా అందుకున్నారు.
వైవాహిక జీవితం..
ఐఏఎస్ అమిత్ కటారియా వృత్తిరీత్యా వాణిజ్య పైలట్ అయిన అస్మితా హండాను వివాహం చేసుకున్నారు. ఈ జంట తరుచుగా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. పైగా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఆ జర్నీల తాలుకా ఫోటోలను షేర చేసుకునేవారు. ఇక ఈ ఐఏఎస్ అమిత్ కటారియా ఆస్తులు నికర విలువ దాదాపు రూ. 8.90 కోట్లు పైనే అని అంచనా.
(చదవండి: సైన్స్ కోర్సు చదవలేకపోయా..! క్షణాల్లో వీడియో వైరల్.. ఏకంగా కేంద్ర విద్యామంత్రే..)
Comments
Please login to add a commentAdd a comment