లవ్‌బర్డ్స్‌ కొత్త ప్రయాణం: సిగ్గులమొగ్గైన కొత్త పెళ్లికూతురు అమీ | Long Time Love Birds Amy Jackson And Ed Westwick Married Now, Interesting Facts And Photos Viral | Sakshi
Sakshi News home page

లవ్‌బర్డ్స్‌ కొత్త ప్రయాణం: సిగ్గులమొగ్గైన కొత్త పెళ్లికూతురు అమీ

Aug 26 2024 11:24 AM | Updated on Aug 26 2024 12:23 PM

long time lovebirds AmyJackson and Ed Westwick married now

నటి, మోడల్‌ అమీ జాక్సన్ ఎట్టకేలకు తన ప్రియుడిని పెళ్లాడింది. తాజాగా (ఆగస్ట్ 25, 2024న), నటుడు మ్యూజీషియన్ ఎడ్వర్డ్ వెస్ట్ విక్‌ను  వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా  ఈ లవ్‌బర్డ్స్‌ స్వయంగా  సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. సరికొత్త ప్రయాణం మొదలైంది అంటూ  తమ సంతోషాన్ని వెల్లడించారు.  ఇటలీలో జరిగిన ఈ వివాహ  వేడుకలో ఎడ్ వెస్ట్‌విక్ అమీని ఎత్తుకొని ముద్దుపెట్టుకోవడంతో అమీ జాక్సన్  సిగ్గుల మొగ్గయింది. ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో సందడి చేస్తున్నాయి.

అంతకుముందు బ్రిటిస్ వ్యాపారవేత్త ఆండ్రియాస్ పనాయోటౌతో కొన్నిరోజులు సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే వీరికి ఒక మగబిడ్డకూడా పుట్టాడు.కానీ ఆ తరువాత విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. పనాయోటౌతో తన బంధం ముగిసినట్లు  స్వయంగా అమీ జాక్సన్ 2021లో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement