పీకల్లోతు ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. ఈ ఏడాదిలోనే! | Darling Heroine Shraddha Das Ready Knot In this Year | Sakshi
Sakshi News home page

పెళ్లికి రెడీ అంటోన్న ప్రభాస్ హీరోయిన్..!

Published Sun, Jan 7 2024 9:04 AM | Last Updated on Sun, Jan 7 2024 10:45 AM

Darling Heroine Shraddha Das Ready Knot In this Year - Sakshi

హీరోయిన్ శ్రద్ధాదాస్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన ఆర్య-2 చిత్రంలో మెరిసింది. ఆ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధాదాస్.. రెబల్ స్టార్ నటించిన డార్లింగ్ మూవీలో నటించి అభిమానులను అలరించింది. తెలుగులో స్టార్ ‍హీరోల సరసన మెప్పించిన ముంబై ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పెద్ద సినిమాల్లో కనిపించడం లేదు. అయితే తాజాగా తాను సింగర్‌ అవతారమెత్తింది. త్వరలోనే లండన్‌లో జరగనున్న మ్యూజిక్ కన్సార్ట్‌లో సింగర్‌గా సినీ ప్రియులను అలరించనుంది.

(ఇది చదవండి: ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

సినిమాలకు కాస్తా దూరమైనప్పటికీ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. ఇటీవల కేరళలో చిల్ అవుతూ ఫోటోలు, వీడియోలను పంచుకుంది. వయసు మూడు పదులు దాటినా.. తన అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు డార్లింగ్ హీరోయిన్. ఫుల్‌గా చిల్ అవుతూ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.  

అయితే తాజాగా ఈ డార్లింగ్ భామ పెళ్లికి రెడీ అయినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఓ బిజినెస్‌మెన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌లో  హాట్ టాపిక్‌గా మారింది. అంతే కాదు కొత్త ఏడాదిలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు రూమర్స్ పెద్దఎత్తున వైరలవుతున్నాయి. అంతే కాదు.. ఈ ఏడాది సమ్మర్‌లోనే వివాహం కూడా జరగనుందని సమాచారం. అయితే ఈ విషయంపై శ్రద్దాదాస్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement