నటిని పెళ్లాడిన టైగర్‌ నాగేశ్వరరావు విలన్.. వీడియో వైరల్! | Malayalam Actor Sudev Nair Ties The Knot With Model Amardeep Kaur In Guruvayur - Sakshi

ప్రియురాలిని పెళ్లాడిన విలన్.. వీడియో వైరల్!

Feb 19 2024 6:54 PM | Updated on Feb 19 2024 8:28 PM

Malayalm Actor Sudev Nair Knot with His Lover Video Goes Viral - Sakshi

ప్రస్తుతం ఎక్కడా చూసినా పెళ్లిళ్ల సందడే కనిపిస్తోంది. సమ్మర్‌ సీజన్‌ మొదలు కానున్న నేపథ్యంలో వచ్చే మూడు నెలలు పెళ్లిళ్లు జరగనున్నాయి. సినీ ఇండస్ట్రీలోనూ పెళ్లి కళ మొదలైంది. తాజాగా మరో నటుడు ఓ ఇంటివాడయ్యారు. ప్రముఖ మలయాళ నటుడు సుదేవ్ నాయర్ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు, నటి అమర్‌దీప్‌ కౌర్‌ను పెళ్లాడారు. 

గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు.. తాజాగా కేరళ సంప్రదాయం ప్రకారం ఈ జంట ఏడడుగులు వేశారు. వీరి పెళ్లికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి అనంతరం స్థానిక గురువాయూర్ ఆలయంలో ఈ జంట పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు నూతన దంపతులకు అభినందనలు చెబుతున్నారు. 

కాగా..సుదేవ్ నాయర్ 2014లో గులాబ్‌ గ్యాంగ్‌ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాతా దక్షిణాదిలో దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో రవితేజ టైగర్ నాగేశ్వరరావు, నితన్ ఎక్స్‌ట్రార్డీనరీ మ్యాన్‌ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. 

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement