
మూలధన లాభం స్వల్పకాలికమా లేదా దీర్ఘకాలికమా..అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. మామూలు శ్లాబులు .. మామూలు రేట్లే స్వల్పకాలికానికి. ఈ వారం దీర్ఘకాలికం విషయం గురించి ఆలోచిద్దాం.
♦ దీర్ఘకాలిక మూలధన లాభం మీద పన్ను రేటు 20 శాతం.
♦ ఇది వ్యక్తులకు, హిందు ఉమ్మడి కుటుంబాలకు మాత్రమే.
♦ ఈ ప్రత్యేక రేటు వర్తింప చేయడం వల్ల
♦ ఈ మూలధన లాభాన్ని ఇతర ఆదాయాలతో కలపరు.
♦ గతవారం మనం చూసిన ఉదాహరణలో ఆనందరావు గారి పెన్షన్ రూ. 10,00,000. ఇంటద్దె రూ. 3,00,000, వడ్డీ రూ. 2,00,000, మూలధన లాభం (దీర్ఘకాలికం) రూ. 20,00,000 అనుకోండి. 2024 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెన్షన్, ఇంటద్దె, వడ్డీలు మొత్తం రూ. 15,00,000లో సేవింగ్స్ రూ.2,00,000 తీసివేసి తదనుగుణమైన రేట్ల ప్రకారం పన్ను లెక్కిస్తారు.
♦ మూలధనలాభాలు దీర్ఘకాలికం కాబట్టి వాటిని ప్రత్యేకంగా భావించి కేవలం 20 శాతం చొప్పున లెక్కిస్తారు. దీనికి విద్యా సుంకం అదనం.
♦మూలధన లాభాలకు బేసిక్ లిమిట్‌ని వర్తింపచేస్తారు.
♦ఉదాహరణకు 60 ఏళ్ల సత్యనారాయణ గారికి ఇతర ఏ ఆదాయాలు లేవు అనుకుందాం. వారికి దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ. 2,50,000 అనుకోండి. పన్ను కట్టక్కర్లేదు.
♦ఇలాంటి బేసిక్ లిమిటు 60 ఏళ్లు దాటి 80వ సంవత్సరంలో ఉన్న వారికి రూ. 3,00,000 చొప్పున, 80 ఏళ్లు దాటినవారికి రూ. 5,00,000 వర్తింపచేస్తారు.
♦అయితే, ఇతర ఆదాయం ఉండి ఉంటే ఆ ఆదాయంలో నుంచి సెక్షన్ 80సీ మొదలైన వాటిని తగ్గిస్తారు. ఉదాహరణకు, ఇతర ఆదాయం రూ. 1,50,000 ఉంటే, నిజంగా సేవ్ చేసి ఉంటే మినహాయింపు దొరుకుతుంది.
♦కేవలం దీర్ఘకాలిక మూలధన లాభం ఉంటే అందులో నుంచి సెక్షన్ 80సీ మొదలైన మినహాయింపులు, తగ్గింపులు రావు. ఇవ్వరు.
♦ 80సీ నుంచి 80 యు వరకు అమల్లో ఉన్న ప్రయోజనాలు ఇవ్వరు.
♦పైన చెప్పిన రూల్సు రెసిడెంటు వ్యక్తులకు మాత్రమే వర్తిస్తాయి.
♦మూలధన లాభం మీద బేసిక్ రేటు 20 శాతం, విద్యా సుంకం, పరిమితి దాటితే సర్‌చార్జీ కూడా పడుతుంది.