long term benefits
-
ఇల్లు అమ్మితే లాభం సంగతి..
మూలధన లాభం స్వల్పకాలికమా లేదా దీర్ఘకాలికమా..అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. మామూలు శ్లాబులు .. మామూలు రేట్లే స్వల్పకాలికానికి. ఈ వారం దీర్ఘకాలికం విషయం గురించి ఆలోచిద్దాం. ♦ దీర్ఘకాలిక మూలధన లాభం మీద పన్ను రేటు 20 శాతం. ♦ ఇది వ్యక్తులకు, హిందు ఉమ్మడి కుటుంబాలకు మాత్రమే. ♦ ఈ ప్రత్యేక రేటు వర్తింప చేయడం వల్ల ♦ ఈ మూలధన లాభాన్ని ఇతర ఆదాయాలతో కలపరు. ♦ గతవారం మనం చూసిన ఉదాహరణలో ఆనందరావు గారి పెన్షన్ రూ. 10,00,000. ఇంటద్దె రూ. 3,00,000, వడ్డీ రూ. 2,00,000, మూలధన లాభం (దీర్ఘకాలికం) రూ. 20,00,000 అనుకోండి. 2024 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెన్షన్, ఇంటద్దె, వడ్డీలు మొత్తం రూ. 15,00,000లో సేవింగ్స్ రూ.2,00,000 తీసివేసి తదనుగుణమైన రేట్ల ప్రకారం పన్ను లెక్కిస్తారు. ♦ మూలధనలాభాలు దీర్ఘకాలికం కాబట్టి వాటిని ప్రత్యేకంగా భావించి కేవలం 20 శాతం చొప్పున లెక్కిస్తారు. దీనికి విద్యా సుంకం అదనం. ♦మూలధన లాభాలకు బేసిక్ లిమిట్‌ని వర్తింపచేస్తారు. ♦ఉదాహరణకు 60 ఏళ్ల సత్యనారాయణ గారికి ఇతర ఏ ఆదాయాలు లేవు అనుకుందాం. వారికి దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ. 2,50,000 అనుకోండి. పన్ను కట్టక్కర్లేదు. ♦ఇలాంటి బేసిక్ లిమిటు 60 ఏళ్లు దాటి 80వ సంవత్సరంలో ఉన్న వారికి రూ. 3,00,000 చొప్పున, 80 ఏళ్లు దాటినవారికి రూ. 5,00,000 వర్తింపచేస్తారు. ♦అయితే, ఇతర ఆదాయం ఉండి ఉంటే ఆ ఆదాయంలో నుంచి సెక్షన్ 80సీ మొదలైన వాటిని తగ్గిస్తారు. ఉదాహరణకు, ఇతర ఆదాయం రూ. 1,50,000 ఉంటే, నిజంగా సేవ్ చేసి ఉంటే మినహాయింపు దొరుకుతుంది. ♦కేవలం దీర్ఘకాలిక మూలధన లాభం ఉంటే అందులో నుంచి సెక్షన్ 80సీ మొదలైన మినహాయింపులు, తగ్గింపులు రావు. ఇవ్వరు. ♦ 80సీ నుంచి 80 యు వరకు అమల్లో ఉన్న ప్రయోజనాలు ఇవ్వరు. ♦పైన చెప్పిన రూల్సు రెసిడెంటు వ్యక్తులకు మాత్రమే వర్తిస్తాయి. ♦మూలధన లాభం మీద బేసిక్ రేటు 20 శాతం, విద్యా సుంకం, పరిమితి దాటితే సర్‌చార్జీ కూడా పడుతుంది. -
ఫ్లెక్సీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్.. దీర్ఘకాలంలో తిరుగులేని పనితీరు!
పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ సత్వరమే నిర్ణయాలు తీసుకోగల సౌలభ్యత, సవాళ్లకు అనుగుణంగా వేగంగా మారిపోగల ప్రత్యేకత, కొత్తగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడం ఇవన్నీ ఫ్లెక్సీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఉండే అనుకూలతలు. అన్ని రకాల మార్కెట్ విభాగాల్లో (స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్) ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఫ్లెక్సీక్యాప్ పథకాలకు ఉంటుంది. మార్కెట్ పరిస్థితులు, వ్యాల్యూషన్ల ఆధారంగా ఫండ్ మేనేజర్లు తమ నిర్వహణలోని పథకాల పెట్టుబడుల్లో మార్పులు చేసుకోగలరు. దీనివల్ల దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇవ్వగల సామర్థ్యం ఫ్లెక్సీక్యాప్ పథకాలకు ఉంటుంది. ఈ విభాగంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. పెట్టుబడుల విధానం ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల వైవిధ్యానికి చోటు ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే చెప్పుకోతగ్గ మేర పెట్టుబడులను అంతర్జాతీయ కంపెనీలకు కూడా కేటాయిస్తుంటుంది. ఫ్లెక్సీక్యాప్ విభాగాన్ని సెబీ 2020 నవంబర్ 6 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. పెట్టుబడుల పరంగా సౌలభ్యం కోరుకునే పథకాలు ఈ విభాగం కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అప్పటి వరకు పరాగ్ పారిఖ్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్‌గా కొనసాగిన ఈ పథకం, ఆ తర్వాత పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌గా మారిపోయింది. మల్టీక్యాప్ విభాగం నుంచి ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి చేరింది. ఈ పథకం తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో కనీసం 65 శాతం మేర దేశీ స్టాక్స్‌కు కేటాయిస్తుంటుంది. విదేశీ స్టాక్స్‌కు గరిష్టంగా 35 శాతం వరకు కేటాయింపులు చేసే ఆప్షన్ కలిగి ఉంది. వ్యాల్యూ స్టాక్స్‌కు ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంది. పోటీ సంస్థలు ప్రవేశించలేని, ధరల నిర్ణయంలో బలాలు కలిగిన కంపెనీలను ఎంపిక చేసి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పెట్టుబడులపై అధిక రాబడులు, బలమైన బ్యాలన్స్ షీట్, యాజమాన్య దక్షతను చూస్తుంది. ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లలో ఉన్న కంపెనీలను కొనుగోలు చేసి దీర్ఘకాలం పాటు వేచి చూడగలదు. స్వల్పకాలంలో అధిక రాబడుల కోసం తరచుగా పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేయదు. రాబడులు ఈ పథకం అన్ని కాలాల్లోనూ మంచి రాబడులను ఇస్తూ వస్తోంది. గడిచిన ఏడాది కాలంలో 21 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. కానీ, ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడి 16 శాతంగానే ఉంది. మూడేళ్ల కాలంలో 24 శాతం, ఐదేళ్లలో 18.47 శాతం, ఏడేళ్లలో 18.60 శాతం, పదేళ్లలో 20 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడితో పోలిస్తే పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీక్యాప్‌లో 3–5 శాతం మేర అధిక రాబడులు ఉన్నాయి. ఇదీ చదవండి: పిల్లల ఉన్నత విద్య కోసం.. ఇంటర్నేషనల్ ఫండ్స్ గురించి తెలుసా? పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.40వేల కోట్లు ఉన్నాయి. ఇందులో 85 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. డెట్ సాధనాల్లో 13 శాతం పెట్టుబడులు ఉండగా, 1.62 శాతం మేర నగదు నిల్వలు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 39 స్టాక్స్ ఉన్నాయి. ఈక్విటీల్లోనూ 89 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. మిడ్‌క్యాప్‌లో 8 శాతం, స్మాల్‌క్యాప్‌లో 2 శాతం వరకు పెట్టుబడులు పెట్టింది. అత్యధికంగా 30 శాతం పెట్టుబడులను బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు కేటాయించింది. సేవల రంగ కంపెనీల్లో 16 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 12 శాతం, కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీల్లో 7 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. ముఖ్యంగా విదేశీ స్టాక్స్‌కు 17.59 శాతం కేటాయింపులు చేసింది. -
దీర్ఘకాలంలో పెట్టుబడులకు విలువ.. ఈ ఫండ్ గురించి తెలుసా?
టాటా ఈక్విటీ పీఈ ఫండ్ చాలా స్టాక్స్ ధరలు జీవిత కాల గరిష్టాలకు చేరుతున్నాయి. మరి ఈ సమయంలో ధైర్యం చేసి అధిక విలువల వద్ద షేర్లలో పెట్టుబడులు పెట్టడానికి ధైర్యం సరిపోకపోవచ్చు. సాధారణ ఇన్వెస్టర్లకు కష్టమైన ఈ పనిని మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు చేసి పెడతారు. విడతల వారీగా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం అన్నది రిటైల్ ఇన్వెస్టర్లకు అంత సులభ సాధ్యం కాదు. కానీ ఫండ్స్ మేనేజర్లకు ఇది వృత్తిలో భాగం. స్టాక్స్ విలువలు ఖరీదుగా ఉన్న ఈ తరుణంలో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ ధైర్యంగా ఎంచుకోతగిన ఒక విభాగం ఉంది. అదే వ్యాల్యూ ఫండ్స్. స్టాక్స్‌లో ఎంతో విలువ దాగుండి, ధరలో అది పూర్తిగా ప్రతిఫలించలేని తరుణంలో ఆయా స్టాక్స్‌లో ఈ పథకాలు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. టాటా ఈక్విటీ పీఈ ఫండ్ కూడా ఈ కోవలోనిదే. రాబడులు.. ఈ పథకం గడిచిన ఆరు నెలల్లోనూ, ఏడాది కాలంలో 18 శాతానికిపైనే రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో వార్షికంగా ఇచ్చిన రాబడి 22 శాతం చొప్పున ఉంది. ఐదేళ్ల కాలంలో పెట్టుబడులపై ఏటా 11 శాతం ప్రతిఫలాన్ని అందించింది. అన్ని కాలాల్లోకి ఒక్క ఐదేళ్ల కాల రాబడులే కాస్త వెనుక ఉన్నాయి. ఏడేళ్ల కాలంలో 13 శాతం, పదేళ్లలో 19 శాతానికి పైనే వార్షిక రిటర్నులు ఈ పథకంలో ఉన్నాయి. ఎస్అండ్పీ బీఎస్ఈ 100టీఆర్ఐ సూచీ ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా పరిశీలించొచ్చు. సూచీతో పోలిస్తే పదేళ్ల కాలంలో ఈ పథకమే ఏటా 4 శాతం చొప్పున పెట్టుబడులపై అధిక రాబడులు అందించింది. 2004లో ఈ పథకం మొదుల కాగా, అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఏటా 18 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు రాబడి తెచ్చి పెట్టింది. దీర్ఘకాలం కోసం, తక్కువ రిస్క్, మోస్తరు రాబడులు కావాలని కోరుకునే వారు టాటా ఈక్విటీ వంటి వ్యాల్యూ ఫండ్స్‌ను పరిశీలించొచ్చన్నది నిపుణుల సూచన. పోర్ట్‌ఫోలియో.. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.6,019 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 95.51 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లో పెట్టుబడులను పరిశీలించగా, 70 శాతం లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీలకు 25.61 శాతం కేటాయించగా, 4.35 శాతాన్ని చిన్న కంపెనీలకు కేటాయించింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఈ పథకం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం ఈక్విటీ పెట్టుబడుల్లో 32 శాతం మేర ఈ కంపెనీల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా 11 శాతానికి పైన పెట్టుబడులను మెటీరియల్స్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీలకు 10 శాతం వరకు, ఆటోమొబైల్ కంపెనీలకు 8.58 శాతం, ఇంధన రంగ కంపెనీలకు 6 శాతం వరకు కేటాయింపులు చేసింది. పెట్టుబడుల విభాగం.. వ్యాల్యూ ఫండ్స్ విభాగంలో టాటా ఈక్విటీ పీఈ ఫండ్ మంచి పనితీరును కలిగి ఉంది. ఈ పథకం తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 70 శాతాన్ని.. సెన్సెక్స్‌తో పోలిస్తే తక్కువ రోలింగ్ పీఈ ఉన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. అన్ని విభాగాల్లోనూ (స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్) చౌకగా లభించే విలువైన స్టాక్స్ కోసం ఈ పథకం ఎప్పటికప్పుడు అన్వేషిస్తుంటుంది. దీంతో పెట్టుబడుల విషయంలో ఈ పథకానికి స్వేచ్ఛ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అయితే, వ్యాల్యూ ఫండ్స్‌లోని స్టాక్స్ వేగంగా పరుగులు పెట్టేది తక్కువ. తగిన సమయం వరకు వేచి ఉంటేనే మంచి ఫలితాలు అందుకోవడానికి వీలుంటుంది. అందుకే కనీసం ఐదేళ్లు, అంతకుమించిన దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈ తరహా పథకాలను ఎంచుకోవడం అనుకూలంగా ఉంటుంది. చౌక వ్యాల్యూషన్ల వద్ద గుర్తించి పెట్టుబడులు పెట్టడమే కాదు.. ఆయా స్టాక్స్ విలువలు తిరిగి ఖరీదుగా మారాయని భావించిన తరుణంలో వాటిల్లో పెట్టుబడులను తగ్గించుకోవడం ఈ పథకంలో గమనించొచ్చు. -
మీ పోర్ట్‌ఫోలియోకు అస్సెట్ అలోకేషన్..!
దీర్ఘకాలంలో సంపదను సమకూర్చుకోవాలనుకుంటే అందుకు కీలకంగా తోడ్పడే వాటిల్లో అస్సెట్ అలోకేషన్ కూడా ఒకటి. అస్సెట్ అలోకేషన్ అన్నది ఒక ఇన్వెస్టర్ తన పెట్టుబడులను ఏ మేరకు భిన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేశారన్నది తెలియజేస్తుంది. ఇది రిస్క్‌ను పరిమితం చేయడంతోపాటు, రాబడుల్లో అనిశ్చితులను కూడా తగ్గిస్తుంది. సరైన విభాగానికి సరైన సమయంలో పెట్టుబడులను కేటాయించడం ప్రభావవంతమైన అస్సెట్ అలోకేషన్ అవుతుంది. ఎందుకంటే కాల క్రమంలో.. ఒక్కో సమయంలో ఒక్కో అస్సెట్ క్లాస్ (పెట్టుబడుల విభాగం) మంచి పనితీరు చూపించొచ్చు. తాము బాగా అర్థం చేసుకోతగిన ఒక అస్సెట్ క్లాస్‌లోనే ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లు సౌకర్యంగా భావించొచ్చు. అయితే, ఒకే సాధనంలో పూర్తిగా ఇన్వెస్ట్ చేయడం వల్ల కాలానుగుణంగా, ఆయా విభాగంలో అనిశ్చితుల రిస్క్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే దీర్ఘకాలంలో సంపద సమకూర్చుకోవాలనుకునే వారికి వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో ఎంతో సాయపడుతుంది. పోర్ట్‌ఫోలియోలో భిన్న పెట్టుబడుల సాధనాలను అస్సెట్ అలోకేషన్గా పేర్కొంటారు. అనుకూలమైన అస్సెట్ అలోకేషన్‌ను నిర్ణయించుకుని, దానికి కట్టుబడి ఉండడంతోపాటు, రిస్క్‌ను సర్దుబాటు చేసుకుంటూ దీర్ఘకాల లక్ష్యాలకు క్రమానుగత పెట్టుబడుల విధానాన్ని అనుసరించడం సాయపడుతుంది. భిన్న సాధనాల మధ్య.. అస్సెట్ అలోకేషన్ పరంగా ఈక్విటీల్లో తక్కువ విలువల వద్ద కొనుగోలు చేసి, అధిక విలువల వద్ద విక్రయించడం అన్నది అనుసరణీయమే. కానీ, ఆచరణలో అదంత సులభం కాదు. ఇన్వెస్టర్లు దీనికి విరుద్ధంగా చేస్తుంటారు. అదే డెట్ విభాగంలో ఇన్వెస్టర్లు వడ్డీ రేట్ల గమనం ఏ విధంగా ఉందన్న దానితో సంబంధం లేకుండా తమకు సౌకర్యమైన పెట్టుబడి సాధనాలను ఎంచుకుంటుంటారు. బంగారం అన్నది భావోద్వేగాలతో ముడిపడినది. ముఖ్యంగా ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తుంటారు. ఈ విధంగా చూసినప్పుడు పెట్టుబడుల కేటాయింపు ఒకే రంగా ఉండిపోతుంది. దీనివల్ల ఇన్వెస్టర్ ఒక పెట్టుబడి సాధనానికి సంబంధించి మారుతున్న ఆకర్షణను కోల్పోవచ్చు. దీనికి పరిష్కారంగా మ్యూచువల్ ఫండ్స్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్‌ను ఆరంభించాయి. మారుతున్న పవనాలకు అనుగుణంగా ఈ ఫండ్స్ పెట్టుబడుల మార్పుతో ఇన్వెస్టర్లు చెప్పుకోతగిన విధంగా లాభపడేందుకు తోడ్పడతాయి. ఈ విభాగంలో ఒకానొక ప్రముఖ పథకం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అస్సెట్ అలోకేషన్ ఫండ్. డెట్, ఈక్విటీ విభాగాలకు వాటి ఆకర్షణీయతకు అనుగుణంగా పెట్టుబడులను ఈ ఫండ్ కేటాయిస్తుంది. అలాగే పెట్టుబడి పెట్టే ముందు ఈక్విటీ, డెట్ మార్కెట్ల వ్యాల్యూషన్లను ఫండ్ మేనేజర్ పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. మార్కెట్లు అనిశ్చితుల్లో ఉన్న సమయాల్లోనూ ఇన్వెస్టర్లు అస్సెట్ అలోకేషన్‌ను కొనసాగించడం అన్నది దీర్ఘకాలంలో... భిన్న సాధనాల్లో జరిగే ర్యాలీల్లో పాలు పంచుకునేందుకు సాయపడుతుంది. జి.వనకృష్ణ వీకీ ఫిన్సర్వ్ ఎల్ఎల్పీ -
ఎయిర్టెల్ యూజర్లకు లాంగ్ టర్మ్ ప్లాన్
న్యూఢిల్లీ : టెలికాం కంపెనీలు డేటా వార్ నుంచి ఇప్పట్లో నిష్క్రమించేటట్టు కనిపించడం లేదు. రోజుకో ఆఫర్‌తో టెలికాం కంపెనీలు హోర్రెత్తిస్తున్నాయి. తాజాగా దేశీయ అతిపెద్ద టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఓ లాంగ్ టర్మ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. 995 రూపాయలతో 3జీ, 4జీ యూజర్ల కోసం ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద రూ.995కి ఆరు నెలల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను, రోమింగ్ కాల్స్‌ను, రోజుకు 100 ఎస్ఎంఎస్లను, నెలకు 1 జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. అంటే మొత్తంగా ఆరు నెలల్లో నెలకు 1జీబీ డేటా చొప్పున 6జీబీ డేటాను మాత్రమే యూజర్లు పొందనున్నారు. ఎయిర్టెల్ ఈ ప్లాన్‌ను రిలయన్స్ జియో రూ.999 ప్లాన్‌కు పోటీగా తీసుకొచ్చింది. వాయిస్ కాలింగ్‌పై ఎలాంటి రోజువారీ, వారం వారీ పరిమితులను ఎయిర్టెల్ విధించలేదు. అన్ని హ్యాండ్సెట్లకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్, తెలంగాణ, తమిళనాడు, ఇతర టెలికాం సర్కిళ్లలో ఎయిర్టెల్ కొత్తగా తీసుకొచ్చిన ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ఎక్కువగా కాలింగ్ అవసరం ఉండే వారిని టార్గెట్ చేసుకుని మార్కెట్లోకి వచ్చింది. అయితే డేటా ఎక్కువగా ఉపయోగించే వారికి ఈ ప్లాన్ అంత ఉపయోగకరంగా ఉండదని తెలుస్తోంది. అంటే కేవలం 1జీబీ డేటాను మాత్రమే నెలకు ఆఫర్ చేస్తోంది. ఒకవేళ రూ.193తో డేటా యాడ్-ఆన్ ప్లాన్‌ను యాడ్ చేసుకుంటే, 180 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటాను పొందవచ్చు. అప్పుడు ఈ ప్లాన్ కింద 180జీబీ డేటా లభిస్తోంది. ఒకవేళ రోజువారీ డేటా కోసం ప్లాన్ కావాలంటే.. ఎయిర్టెల్ రూ.999 ప్లాన్ సరియైనదని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ప్లాన్ కింద అపరిమిత కాలింగ్, మెసేజింగ్ సర్వీసులతో పాటు 60జీబీ డేటాను 90 రోజుల పాటు పొందవచ్చు. డేటా వాడకంపై కూడా ఎలాంటి పరిమితులు లేవు. ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న రూ.995, రూ.999 ప్లాన్లు రెండూ కూడా రిలయన్స్ జియో ఆఫర్ చేసే సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్లకు గట్టి పోటీగా ఉన్నాయి. లాంగ్ టర్మ్ ప్లాన్లతో ఎయిర్టెల్, జియోకు గండికొడుతోంది. -
'ఇబ్బందులు కొన్నాళ్లే.. భరించండి'
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు విషయంలో భారత ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. సమస్య కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని, కానీ దాని అనంతరం వచ్చే ప్రయోజనాలు మాత్రం దీర్ఘకాలం ఉంటాయని చెప్పారు. దేశాన్ని ఆర్థిక పురోభివృద్ధిలోకి వేగంగా తీసుకెళ్లేందుకే తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందే తప్ప తాత్కాలికంగానే పనికొచ్చే రాజకీయ లబ్ధి కోసం కాదని అన్నారు. ఒకే తరంలోనే భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయడమే తన కల అని చెప్పారు. గడిచిన మూడేళ్లలోనే భారత ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చినట్లు మోదీ చెప్పారు. 2012-13 సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోల్చినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికలు వినిపించాయని, కానీ, గడిచిన మూడేళ్లలో మాత్రం అన్ని దేశాలకంటే భారత్ ముందుందని చెప్పారు. ప్రపంచం మొత్తానికి భారత్ ఓ వేగు చుక్కలా కనిపిస్తుందని ఆయన అన్నారు.