ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు లాంగ్ టర్మ్ ప్లాన్
న్యూఢిల్లీ : టెలికాం కంపెనీలు డేటా వార్ నుంచి ఇప్పట్లో నిష్క్రమించేటట్టు కనిపించడం లేదు. రోజుకో ఆఫర్‌తో టెలికాం కంపెనీలు హోర్రెత్తిస్తున్నాయి. తాజాగా దేశీయ అతిపెద్ద టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఓ లాంగ్ టర్మ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. 995 రూపాయలతో 3జీ, 4జీ యూజర్ల కోసం ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద రూ.995కి ఆరు నెలల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను, రోమింగ్ కాల్స్‌ను, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను, నెలకు 1 జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. అంటే మొత్తంగా ఆరు నెలల్లో నెలకు 1జీబీ డేటా చొప్పున 6జీబీ డేటాను మాత్రమే యూజర్లు పొందనున్నారు. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ను రిలయన్స్ జియో రూ.999 ప్లాన్‌కు పోటీగా తీసుకొచ్చింది. వాయిస్ కాలింగ్‌పై ఎలాంటి రోజువారీ, వారం వారీ పరిమితులను ఎయిర్‌టెల్ విధించలేదు. అన్ని హ్యాండ్‌సెట్లకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్, తెలంగాణ, తమిళనాడు, ఇతర టెలికాం సర్కిళ్లలో ఎయిర్‌టెల్ కొత్తగా తీసుకొచ్చిన ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ఎక్కువగా కాలింగ్ అవసరం ఉండే వారిని టార్గెట్ చేసుకుని మార్కెట్‌లోకి వచ్చింది. అయితే డేటా ఎక్కువగా ఉపయోగించే వారికి ఈ ప్లాన్ అంత ఉపయోగకరంగా ఉండదని తెలుస్తోంది. అంటే కేవలం 1జీబీ డేటాను మాత్రమే నెలకు ఆఫర్ చేస్తోంది. ఒకవేళ రూ.193తో డేటా యాడ్-ఆన్ ప్లాన్‌ను యాడ్ చేసుకుంటే, 180 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటాను పొందవచ్చు. అప్పుడు ఈ ప్లాన్ కింద 180జీబీ డేటా లభిస్తోంది. ఒకవేళ రోజువారీ డేటా కోసం ప్లాన్ కావాలంటే.. ఎయిర్‌టెల్ రూ.999 ప్లాన్ సరియైనదని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ప్లాన్ కింద అపరిమిత కాలింగ్, మెసేజింగ్ సర్వీసులతో పాటు 60జీబీ డేటాను 90 రోజుల పాటు పొందవచ్చు. డేటా వాడకంపై కూడా ఎలాంటి పరిమితులు లేవు. ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తున్న రూ.995, రూ.999 ప్లాన్లు రెండూ కూడా రిలయన్స్ జియో ఆఫర్ చేసే సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్లకు గట్టి పోటీగా ఉన్నాయి. లాంగ్ టర్మ్ ప్లాన్లతో ఎయిర్‌టెల్, జియోకు గండికొడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment