prepaid customers
-
పెప్సీ కొంటే.. కస్టమర్లకు ఎయిర్టెల్ పండుగ ఆఫర్
సాక్షి,ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ కస్టమర్లకు పండుగ ఆఫర్‌నుప్రకటించింది. రీఛార్జ్ కూపన్స్ అందించేలా పెప్సీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పెప్సీ కంపెనీ డ్రింక్స్ కొనుగోలు చేసిన వినియోగ దారులకు రీచార్జ్ కూపన్లను అందిస్తోంది. ఎయిర్టెల్ ఇలాంటి భాగస్వామ్యాన్ని ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. పండుగ సీజన్‌కు ముందుప్రీపెయిడ్ వినియోగదారులకు రీఛార్జ్ కూపన్లను అందించడానికి ఎయిర్టెల్ పెప్సీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పెప్సీ, మౌంటైన్ డ్యూ, మిరిండా, 7UP, స్లైస్, ట్రోపికానా పెట్ బాటిళ్లతో సహా పెప్సీ ఇతర పానీయాలను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 10 నుండి రూ. 20 విలువైన ఎయిర్టెల్ రీఛార్జ్ కూపన్లు లభిస్తాయి. పెప్సీ ప్రత్యేక ఎడిషన్ బాటిళ్లలో లేబుల్ వెనుక వైపు ఎయిర్టెల్ థాంక్స్ యాప్ డిస్కౌంట్ కోడ్ ఉంటుంది. 12 అంకెల కోడ్ కూపన్‌ను ద్వారా రీచార్జ్ కూపర్లను రిడీమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో కనీసం రూ. 99 రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ప్రతీ మొబైల్ నంబర్‌కు, డిస్కౌంట్ కోడ్లు రెండుసార్లు మాత్రమే పని చేస్తాయి. ఎయిర్టెల్ పెప్సికో ఆఫర్ ఫిబ్రవరి 2023 వరకు వినియోగ దారులకు అందుబాటులో ఉంటుందని ఎయిర్టెల్ మార్కెటింగ్ , కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శాశ్వత్ శర్మ తెలిపారు. -
రాత్రంతా ఉచితం : వొడాఫోన్ ఐడియా
సాక్షి, ముంబై: టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) వినియోగదారుల సంఖ్యను పెంచే ప్రయత్నంలో యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రిపెయిడ్ కస్టమర్లకు రాత్రి సమయంలో అపరిమిత డేటా ఉచితంగా ఆఫర్ చేస్తోంది. రూ.249 ఆపైన అన్లిమిటెడ్ డెయిలీ డేటా రీచార్జ్‌లకు ఇది వర్తిస్తుంది. రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా వినియోగదార్లు ఉచిత డేటాను ఆస్వాదించవచ్చు. రోజువారీ మిగిలిన డేటాను వారాంతంలో వాడుకునే వెసులుబాటునూ కల్పిస్తోంది. (పెట్రో వాత : త్వరలో 150 రూపాయలకు?) -
వోడాఫోన్ ఐడియా క్యాష్ బ్యాక్ ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు ఆకట్టుకునే వ్యూహాలు అమలును ప్రారంభించింది. వోడాఫోన్ , ఐడియా మెగా మెర్జర్ ద్వారా ఆవిర్భవించిన వోడాఫోన్ ఐడియా తాజాగా వినియోగదారులకు ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. రీచార్జ్‌లపై క్యాష్‌బ్యాక్, ఫ్రీ వోచర్లు అందిస్తున్నట్టు ప్రకటించింది. దీనికోసం పేటిఎంతో జతకట్టింది. దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో పేటీఎం ద్వారా రీచార్జ్ చేసుకున్న వోడాఫోన్, ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు మంగళవారం తెలిపింది. ముఖ్యంగా రూ .149 కనీస రీఛార్జికి 25 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అలాగే దీనికి అదనంగా రూ.375 విలువ వోచర్లును అందిస్తుంది. వీటిని పేటీఎంమాల్ లో షాపింగ్ చేయడానికి ఉపయోగించవచ్చు. కాగా వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు యుపి వెస్ట్, పంజాబ్, చెన్నై, తమిళనాడులో కొత్త కాంబో ఆఫర్‌ను సోమవారం ప్రారంభించింది. 25 రూపాయల రీచార్జ్ పై ఉచిత డేటాతోపాటు తగ్గింపు రేటులో కాలింగ్ సదుపాయాన్ని కల్పించింది. -
కొత్త ఐఫోన్లు ఎయిర్టెల్ స్టోర్‌లో....
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్టెల్, ఆపిల్ కొత్తగా లాంచ్ చేసిన ఐఫోన్లను ఆఫర్ చేస్తుంది. తన ఆన్లైన్ స్టోర్‌లో ఈ స్మార్ట్ఫోన్లను అందుబాటులో ఉంచనున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించింది. 2018 సెప్టెంబర్ 28 నుంచి వీటిని అందించడం ప్రారంభిస్తామని పేర్కొంది. అందుబాటులో ఉండే ప్రొడక్ట్‌లు ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఆర్. సెప్టెంబర్ 21 నుంచి ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. అక్టోబర్ 19 నుంచి ఐఫోన్ ఎక్స్ఆర్ ను ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని ఎయిర్టెల్ ప్రకటించింది. ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ నోట్ 9, ఒప్పో ఎఫ్9 ప్రొ స్మార్ట్ఫోన్లు ఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్‌లో అందబాటులో ఉన్నాయి. 7900 రూపాయలు, 3915 రూపాయల డౌన్ పేమెంట్‌తో ఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్‌లో వీటిని విక్రయిస్తోంది. ఎయిర్టెల్ తన మొబైల్ కస్టమర్లకు రూ.51 విలువైన స్పెషల్ అమెజాన్ పే గిఫ్ట్ కార్డును కూడా ఆఫర్ చేస్తోంది. మైఎయిర్‌టెల్ యాప్ ద్వారా ఈ డిజిటల్ గిఫ్ట్ కార్డును పొందాల్సి ఉంటుంది. రూ.100 లేదా ఆపై మొత్తాల ప్యాక్‌లతో రీఛార్జ్ చేయించుకునే ఎయిర్టెల్ ప్రీ-పెయిడ్ కస్టమర్లు మాత్రమే ఈ స్పెషల్ అమెజాన్ పే గిఫ్ట్ కార్డుకు అర్హులు. ఎయిర్టెల్ పోస్టుపెయిడ్ కస్టమర్లు ఈ ఆఫర్‌ను, ఇన్ఫినిటీ ప్లాన్‌పై పొందాల్సి ఉంటుంది. పరిమిత పీరియడ్‌లో మాత్రమే ఈ ఆఫర్ వాలిడ్‌లో ఉంటుంది. ఇప్పటికే 3 వారాల్లో 50 లక్షలకు పైగా కస్టమర్లు ఎయిర్టెల్ పే గిఫ్ట్ కార్డును పొందారు. -
వోడాఫోన్ కొత్త ప్లాన్: సరికొత్త ట్విస్ట్
సాక్షి, ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీ వోడాఫోన్ ప్రత్యర్థుల కంపెనీలకు ధీటుగా సరికొత్త ప్లాన్‌ను అందు బాటులోకి తీసుకొచ్చింది. ప్రీపెయిడ్ కస్టమర్లకోసం 597 రూపాయల రీఛార్జ్ ప్యాక్‌ను లాంచ్ చేసింది. ఇందులో అన్లిమిటెడ్ వాయిస్‌కాల్స్, 10జీబీ డేటా, రోజుకు 100ఎస్ఎంఎస్లు అందిస్తోంది. జియో, ఎయిర్టెల్ కంపెనీలను దెబ్బకొట్టేలా వోడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్‌లో దుర్వినియోగం నివారించడానికంటూ కొన్ని పరిమితులు విధించడం విశేషం. ముఖ్యంగా వాయిస్ కాలింగ్‌లో పరిమితి పెట్టింది. రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలకు మాత్రమే కాల్స్ పరిమితం. అంతేకాదు మొత్త వాలిడిటీ పీరియడ్‌లో 100 యూనిక్ నెంబర్లకు మాత్రమే కాల్ చేసుకునే అవకాశం ఉంది. అంతేనా..ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా వుంది. ఈ ప్లాన్ వాలిడిటీస్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం 112 రోజులు, ఫీచర్ ఫోన్ వినియోగదారులకయితే 168 రోజులుగా నిర్ణయించింది. -
రిలయన్స్ కస్టమర్లకు బంపర్ ఆఫర్
టెలికాం మార్కెట్ స్పేస్‌లో ఆఫర్ల మీద ఆఫర్ల వర్షం కురిపిస్తున్న సంస్థ ఏదైనా ఉందా అంటే అది రిలయన్స్ జియోనే. రిలయన్స్ జియోను చూసి, ఇతర టెల్కోలు కూడా తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్నాయి. తాజాగా రిలయన్స్ జియో మరోసారి తన కస్టమర్లకు భలే ఆఫర్ తీసుకొచ్చింది. తన ప్రీపెయిడ్ కస్టమర్లకు కొత్తగా యాడ్-ఆన్ ప్యాక్‌ను లాంచ్ చేసింది. దీని కింద ప్రస్తుతమున్న ప్యాక్‌లపైనే అదనంగా రోజుకు 2 జీబీ డేటాను ఆఫర్ చేయడం మొదలు పెట్టింది. అయితే ఇది ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమేనట. ఈ అదనపు డేటా పొందడానికి అర్హత ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. మైజియో యాప్‌లో ద్వారా ఆటోమేటిక్‌గా యాడ్-ఆన్ ప్యాక్‌ను కస్టమర్లకు అందిస్తున్నట్టు తెలిసింది. ఈ యాడ్-ఆన్ ప్యాక్ 2018 జూలై 31 వరకే వాలిడ్‌లో ఉండనుందని తెలిసింది. జియో ప్యాక్ యాక్టివ్‌తో... ఒకవేళ జియో యూజర్ రూ.399 ప్రీపెయిడ్ ప్యాక్‌పై రోజుకు 1.5 జీబీ డేటాను పొందుతూ ఉంటే, ఇక నుంచి రోజుకు 2 జీబీ అదనపు డేటాతో, మొత్తం 3.5 జీబీ 4జీ డేటాను పొందనున్నారు. ఈ ప్యాక్ వాలిడిటీ జూలై 31 వరకు ఉంటుందని తెలిసినప్పటికీ, కొంతమంది యూజర్లకు ఆగస్టు 2 వరకు ఆఫర్ చేస్తుందని టెలికాం టాక్ రిపోర్టు చేసింది. కాగ, ఈ నెల ప్రారంభంలోనే రిలయన్స్ జియో, జియోఫోన్ మాన్సూన్ హంగామా ఆఫర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ కింద పాత ఫీచర్ ఫోన్లను ఇచ్చేసి, కొత్త జియోఫోన్‌ను కేవలం రూ.501కే కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. ఇది కూడా ఫుల్ రీఫండబుల్ సెక్యురిటీ డిపాజిట్. అయితే ఈ డీల్ పొందడానికి ఆరు నెలల పాటు రూ.99 ప్రీపెయిడ్ ప్యాక్‌తో రీఛార్జ్ చేయించుకోవాల్సినవసరం ఉంది. అయితే ఈ మొత్తం రూ.594ను కూడా ముందే పొందాల్సి ఉంటుంది. మొత్తంగా రూ.501 ప్లస్ రూ.594 అంటే రూ.1095ను చెల్లించి జియోఫోన్‌ను కస్టమర్లు కొనుగోలు చేయాలి. -
రూ.499కే అమెజాన్ ప్రైమ్
న్యూఢిల్లీ : అమెజాన్ ప్రైమ్ యువతకు బంపరాఫర్ ప్రకటించింది. ఏడాది 999 రూపాయలతో పొందాల్సిన అమెజాన్ ప్రైమ్‌ను, యువతకు కేవలం 499 రూపాయలకు ఆఫర్ చేస్తోంది. దీంతో అపరిమిత వీడియో స్ట్రీమింగ్, ఫాస్ట్ డెలివరీ, యాడ్-ఫ్రీ మ్యూజిక్ అన్నీ కూడా ఇక 50 శాతం తగ్గింపుతో లభ్యం కానున్నాయి. అయితే ఇది కేవలం 18 నుంచి 24 ఏళ్ల మధ్యలో వయసు ఉన్న వొడాఫోన్ ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే. దీని కోసం మైవొడాఫోన్ యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్లోడ్ లేదా అప్డేట్ చేసుకోవాలని అమెజాన్ తెలిపింది. ఆ అనంతరం ‘గ్రాబ్ ఇట్’ లేదా ‘గెట్ ఇట్ నౌ’ అనే దానిపై క్లిక్ చేయాలి. ఈ మెసేజ్ కేవలం అర్హత కలిగిన కస్టమర్లకు మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత ‘అగ్రి అండ్ పే ఐఎన్ఆర్ 499 నౌ’ పై క్లిక్ చేయాలి. మీరు ఎంచుకున్న పేమెంట్ విధానంలో రూ.499లో చెల్లించి, ‘యాక్టివ్ నౌ’ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత వచ్చే స్క్రీన్ ద్వారా అమెజాన్.ఇన్‌లోకి సైన్-ఇన్ అవ్వాలి. ఈ ప్రక్రియలన్నీ ముగిశాక, మీ ప్రైమ్ మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. దీంతో మీరు అమెజాన్ ప్రైమ్ కింద ఆఫర్ చేసే అన్ని ప్రయోజనాలను ఎంజాయ్ చేసుకోవచ్చు. కాగ, కొన్ని రోజుల క్రితమే వొడాఫోన్ పోస్టు పెయిడ్ కస్టమర్లకు అమెజాన్ ప్రీమియం వీడియో ఆఫర్‌ను ఏడాదిపాటు ఉచితంగా ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. వోడాఫోన్ ప్లే యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను అందిస్తోంది. తాజాగా కస్టమర్లను ముఖ్యంగా యువతను ఎక్కువగా ఆకట్టుకోవడానికి అమెజాన్, వొడాఫోన్ ప్రీపెయిడ్ కస్టమర్లకు కూడా అమెజాన్ ప్రైమ్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చింది. -
ఎయిర్టెల్ మరో ఆకర్షణీయ ఆఫర్
రిలయన్స్ జియో నుంచి వస్తున్న గట్టి పోటీకి, ఎయిర్టెల్ ఎప్పడికప్పుడూ తన ప్లాన్లను అప్డేట్ చేస్తూనే ఉంది. తాజాగా తన 399 రూపాయల ప్లాన్‌ను సమీక్షించింది. ఈ సమీక్షలో రోజువారీ అందించే డేటా పరిమితిని ఎంపిక చేసిన ప్రీపెయిడ్ కస్టమర్లకు పెంచింది. అంతకముందుకు ఈ డేటా ప్లాన్‌పై రోజుకు 1.4జీబీ డేటా మాత్రమే ఆఫర్ చేయగా.. తాజాగా రోజుకు 2.4జీబీ డేటా ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. దీంతో రిలయన్స్ జియోకు గట్టి పోటీగా నిలవవచ్చని ఎయిర్టెల్ భావిస్తోంది. అదే ధరలో రిలయన్స్ జియో తన ప్యాక్‌పై రోజుకు 1.5జీబీ డేటాను మాత్రమే ఆఫర్ చేస్తోంది. ఈ డేటా పెంపుతో 1 జీబీ డేటా, వినియోగదారులకు రూ.1.97కే లభ్యమవుతోంది. ఎయిర్టెల్ అందిస్తున్న ఈ 399 రూపాయల ప్యాక్ వాలిడిటీ 70 రోజులు. అయితే ఎంపిక చేసిన యూజర్లకు ప్యాక్ వాలిడిటీని కూడా 84 రోజులకు పెంచింది. అంతేకాక రోజుకు 2.4జీబీ డేటా ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. ఈ ప్యాక్‌పై డేటాతో పాటు అపరిమిత కాల్స్‌ను, రోజుకు 100 ఎస్ఎంఎస్లను కూడా ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది. కొంతమంది యూజర్లకు ఈ ప్యాక్ వాలిడిటీని, డేటా పరిమితిని పెంచినట్టు టెలికాం టాక్ రిపోర్టు కూడా పేర్కొంది. ఈ లెక్కన 1 జీబీ, ఒక్క రూపాయి 97 పైసలకే లభ్యమవుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే అత్యంత తక్కువ ధర. కేవలం పరిమిత సంఖ్యలో కస్టమర్లకు మాత్రమే కాక, ఓపెన్ ఆఫర్‌గా త్వరలోనే మార్కెట్లోని కస్టమర్లందరికీ ప్రవేశపెట్టనున్నట్టు ఎయిర్టెల్ చెప్పింది. -
ఎయిర్టెల్ ఉచితంగా 30జీబీ డేటా
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ మరో కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. 4జీ స్మార్ట్‌ఫోన్‌లోకి అప్‌గ్రేడ్ అయ్యే తన ప్రస్తుత 2జీ, 3జీ కస్టమర్లకు ఉచితంగా 30జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. ఇది ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్’ కార్యక్రమంలో మరో ఆఫర్‌గా కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్ తన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లందరికీ వర్తించనుంది. కంపెనీ ఛార్జ్ చేసే ప్యాక్‌ల పైన రోజూ ఉచితంగా 1జీబీ డేటాను 30 రోజుల పాటు ప్రీపెయిడ్ కస్టమర్లు పొందనున్నట్టు కంపెనీ తెలిపింది. అదే పోస్టు పెయిడ్ కస్టమర్లైతే రోల్ఓవర్ సౌకర్యం కింద తొలి బిల్ సైకిల్లో ఉచితంగా 30జీబీ డేటాను పొందనున్నారు. అయితే ఈ ఉచిత డేటా ప్రయోజనాలను క్లయిమ్ చేసుకోవడానికి, అర్హతను చెక్ చేసుకోవడానికి 51111 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని లేదా మై ఎయిర్టెల్ మొబైల్ యాప్‌లో చూసుకోవాలని పేర్కొంది. 24 గంటల్లో 30జీబీ ఉచిత డేటాను కస్టమర్లకు క్లయిమ్ చేస్తామని ఎయిర్టెల్ తెలిపింది. మరింత సమాచారం కోసం ఎయిర్టెల్ కస్టమర్లు airtel.in/4gupgrade వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని చెప్పింది. 4జీ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని, లక్షల కొద్దీ ఫీచర్ ఫోన్, 3జీ డివైజ్‌లు, 4జీ స్మార్ట్‌ఫోన్‌లోకి అప్‌గ్రేడ్ కావాలనుకోవడం అతిపెద్ద నిర్ణయమని భారతీ ఎయిర్టెల్ సీఎంఓ వేణి వెంకటేశ్ తెలిపారు. ఇదే కస్టమర్‌కు చెందిన అతిపెద్ద రివార్డింగ్ ప్రొగ్రామ్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో 4జీ స్పీడ్‌లో ఆన్లైన్ ప్రపంచాన్ని అనుభవించే అవకాశం తమ కస్టమర్లకు దొరుకుతుందన్నారు. ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్’ కార్యక్రమం కింద ఇప్పటికే ఎయిర్టెల్, పలు మొబైల్ హ్యాండ్సెట్ తయారీదారులతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని, అత్యంత తక్కువ ధరల్లో 4జీ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెడుతోంది. -
బీఎస్ఎన్ఎల్ రోజుకి 3జీబీ డేటా
న్యూఢిల్లీ : పాపులర్ ఐపీఎల్ టోర్నమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు టెలికాం కంపెనీల రేసులో బీఎస్ఎన్ఎల్ కూడా చేరిపోయింది. స్పెషల్ ఐపీఎల్ ప్లాన్‌గా 248 రూపాయలతో ఓ సరికొత్త ప్యాక్‌ను ఆవిష్కరించింది. 51 రోజుల వాలిడిటీతో ఈ ప్యాక్‌పై 153 జీబీ డేటా ఆఫర్ చేయనున్నట్టు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. తమ ప్రీపెయిడ్ మొబైల్ కస్టమర్లకు ఎస్టీవీ రూ.248పై 51 రోజుల వాలిడిటీతో అపరిమిత డేటా, రోజుకు 3జీబీ డేటాను అందించనున్నామని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. తక్కువ రేటుకు లైవ్ ఐపీఎల్ మ్యాచ్‌లను స్ట్రీమ్ చేసుకునేందుకు తమ సబ్స్క్రైబర్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది. మూడు రోజుల క్రితమే రిలయన్స్ జియో కూడా ఐపీఎల్ సందర్భంగా రూ.251 ప్యాక్‌ను ఆవిష్కరించింది. భారతీ ఎయిర్టెల్ కూడా హాట్‌స్టార్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చని తెలిపింది. బీఎస్ఎన్ఎల్ కేవలం 3జీ నెట్‌వర్క్‌నే కలిగి ఉండగా.. జియో 4జీ సర్వీసులను అందించనుంది. ప్యాన్ ఇండియా బేసిస్‌లో 2018 ఏప్రిల్ 7 నుంచి 2018 ఏప్రిల్ 30 వరకు ఆ ఆఫర్ పరిమిత సమయంలో అందుబాటులో ఉండనుంది. -
ఎయిర్టెల్ యూజర్లకు లాంగ్ టర్మ్ ప్లాన్
న్యూఢిల్లీ : టెలికాం కంపెనీలు డేటా వార్ నుంచి ఇప్పట్లో నిష్క్రమించేటట్టు కనిపించడం లేదు. రోజుకో ఆఫర్‌తో టెలికాం కంపెనీలు హోర్రెత్తిస్తున్నాయి. తాజాగా దేశీయ అతిపెద్ద టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఓ లాంగ్ టర్మ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. 995 రూపాయలతో 3జీ, 4జీ యూజర్ల కోసం ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద రూ.995కి ఆరు నెలల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను, రోమింగ్ కాల్స్‌ను, రోజుకు 100 ఎస్ఎంఎస్లను, నెలకు 1 జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. అంటే మొత్తంగా ఆరు నెలల్లో నెలకు 1జీబీ డేటా చొప్పున 6జీబీ డేటాను మాత్రమే యూజర్లు పొందనున్నారు. ఎయిర్టెల్ ఈ ప్లాన్‌ను రిలయన్స్ జియో రూ.999 ప్లాన్‌కు పోటీగా తీసుకొచ్చింది. వాయిస్ కాలింగ్‌పై ఎలాంటి రోజువారీ, వారం వారీ పరిమితులను ఎయిర్టెల్ విధించలేదు. అన్ని హ్యాండ్సెట్లకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్, తెలంగాణ, తమిళనాడు, ఇతర టెలికాం సర్కిళ్లలో ఎయిర్టెల్ కొత్తగా తీసుకొచ్చిన ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ఎక్కువగా కాలింగ్ అవసరం ఉండే వారిని టార్గెట్ చేసుకుని మార్కెట్లోకి వచ్చింది. అయితే డేటా ఎక్కువగా ఉపయోగించే వారికి ఈ ప్లాన్ అంత ఉపయోగకరంగా ఉండదని తెలుస్తోంది. అంటే కేవలం 1జీబీ డేటాను మాత్రమే నెలకు ఆఫర్ చేస్తోంది. ఒకవేళ రూ.193తో డేటా యాడ్-ఆన్ ప్లాన్‌ను యాడ్ చేసుకుంటే, 180 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటాను పొందవచ్చు. అప్పుడు ఈ ప్లాన్ కింద 180జీబీ డేటా లభిస్తోంది. ఒకవేళ రోజువారీ డేటా కోసం ప్లాన్ కావాలంటే.. ఎయిర్టెల్ రూ.999 ప్లాన్ సరియైనదని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ప్లాన్ కింద అపరిమిత కాలింగ్, మెసేజింగ్ సర్వీసులతో పాటు 60జీబీ డేటాను 90 రోజుల పాటు పొందవచ్చు. డేటా వాడకంపై కూడా ఎలాంటి పరిమితులు లేవు. ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న రూ.995, రూ.999 ప్లాన్లు రెండూ కూడా రిలయన్స్ జియో ఆఫర్ చేసే సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్లకు గట్టి పోటీగా ఉన్నాయి. లాంగ్ టర్మ్ ప్లాన్లతో ఎయిర్టెల్, జియోకు గండికొడుతోంది. -
బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్స్
సాక్షి, హైదరాబాద్ : వినియోగదారుల సౌకర్యార్థం బీఎస్ఎన్ఎల్ పలు ఆఫర్లు ప్రకటించింది. ఇందులో ఎస్టీవీ-99, ఎస్టీవీ-319, ప్లాన్-999, ప్లాన్-949, డేటా ఎస్టీవీ-7 ప్లాన్లు ఉన్నాయి. ఎస్టీవీ-319, 99 ప్లాన్లు ఇవాళ్టి (మంగళవారం) నుంచి అందుబాటుకి వస్తాయి. ప్లాన్ 999, 949లు ఈ నెల 15 నుంచి, డేటా ఎస్టీవీ-7 ప్లాన్ ఈ నెల 17 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. వీటితో పాటు ఎస్టీవీ-26, ట్రిపుల్ ఏస్-333, బీఎస్ఎన్ఎల్ చౌక-444, ఇంటర్నేషనల్ వైఫై ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ నెల 10 నుంచి యూఏఈ, యూఎస్ఏలకు ఇంటర్నేషనల్ రోమింగ్ సౌకర్యాన్ని సైతం కల్పించినట్లు పేర్కొంది. ఈ నెల 19 (సోమవారం) నుంచి 28 వరకు సంస్థ స్టోర్లలో మెగా సిమ్ మేళాలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఉచితంగా 3జీ సిమ్‌లను అందజేయడంతో పాటు ప్రతి రూ.110 రీచార్జ్‌తో ఫుల్ టాక్‌టైమ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. -
డైరెక్ట్ పోటీ : ఐడియా కొత్త ప్యాక్
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్లకు పోటీగా ఐడియా తన ప్రీపెయిడ్ కస్టమర్లకు సరికొత్త ప్యాక్‌ను లాంచ్ చేసింది. ఈ ప్యాక్ కింద రోజుకు 1జీబీ 3జీ డేటాతో పాటు అపరిమిత ఉచిత కాల్స్(హోమ్, నేషనల్ రోమింగ్), రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను 84 రోజుల పాటు ఆఫర్ చేయనుంది. దీని కోసం ఐడియా కస్టమర్లు రూ.509తో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిలయన్స్ జియో రూ.459 ప్యాక్‌కు, ఎయిర్‌టెల్‌కు రూ.509 ప్యాక్‌కు ఇది డైరెక్ట్ పోటీ. రిలయన్స్ జియో తన రూ.459 ప్యాక్ కింద రోజుకు 1జీబీ 4జీ డేటాను, ఉచిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. జియోకు కూడా రూ.509 ప్యాక్ ఉంది. కానీ ఈ ప్యాక్ కింద రోజుకు 2జీబీ డేటాను 49 రోజుల పాటే అందిస్తోంది. అదేవిధంగా ఎయిర్టెల్, వొడాఫోన్లు కూడా రూ.509 ప్యాక్‌లను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ఒకే రకమైన టారిఫ్‌తో ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్లు పోటీపడనున్నాయి. ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.300, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై వచ్చే ఏడాదిలో 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదేవిధంగా ఐడియా తన రూ.198 ప్రీపెయిడ్ ప్యాక్‌ను ఇటీవల అప్‌గ్రేడ్ చేసింది. రూ.198 ప్రీపెయిడ్ ప్యాక్ కింద రోజుకు 1జీబీ డేటా కాకుండా 1.5జీబీ 3జీ డేటాను ఆఫర్ చేస్తోంది. -
ఒక్కరోజులోనే ఎయిర్టెల్ మరో కొత్త ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : రిలయెన్స్ జియోకి పోటీగా టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ రోజుకో కొత్త ప్లాన్‌ను ప్రకటిస్తూనే ఉంది. నిన్ననే జియోకు పోటీగా కొత్తగా రూ.999 ప్లాన్‌ను ప్రకటించిన ఎయిర్టెల్, నేడు మరో కొత్త ఆఫర్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. జియో కొత్త ఐఫోన్లపై ప్రకటించిన ఎక్స్‌క్లూజివ్ ప్లాన్ మాదిరి, తన ప్రీపెయిడ్ కస్టమర్లకు ఎయిర్టెల్ కొత్తగా రూ.799 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని కింద రోజుకు 3జీబీ డేటాతో పాటు అపరిమితి లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. ఈ ప్లాన్ 28 రోజుల పాటు వాలిడ్‌లో ఉంటుంది. అంటే 28 రోజులకు గాను, రోజుకు 3జీబీ డేటా చొప్పున 84జీబీ డేటాను వినియోగదారులు పొందవచ్చు. ఇది కేవలం ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే. ఈ ప్లాన్ జియో రూ.799 ప్యాక్‌కు గట్టి పోటీగా ఉంది. ఇక ఇతర ప్లాన్లపై ఎయిర్టెల్ అన్లిమిటెడ్ కాల్స్‌ను రోజుకు 250 నిమిషాలకు, వారానికి వెయ్యి నిమిషాలకు పరిమితం చేసింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా కొత్త ఎయిర్టెల్ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే రూ.75 క్యాష్‌బ్యాక్‌ను కూడా ఎయిర్టెల్ అందించనుంది. ప్రస్తుతం ఎయిర్టెల్ కొత్త ప్లాన్లు రూ.549 నుంచి రూ.999 మధ్యలో ఉన్నాయి. వీటికి రోజుకు 2జీబీ డేటా, 4జీబీ డేటాను ఎయిర్టెల్ అందిస్తోంది. ఈ రెండు ప్లాన్లకు అపరిమిత లోకల్, ఎస్డీడీ కాల్స్‌ను ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది. రోజుకు 3జీబీని ఆఫర్ చేసిన తొలి టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్. బీఎస్ఎన్ఎల్ కంపెనీ తన ట్రిపుల్ ఏస్ ప్లాన్ కింద రోజుకు 3జీబీ డేటాను అందించింది. -
జియో ఎఫెక్ట్ : ఐడియా సూపర్ ఆఫర్
రిలయన్స్ జియో దెబ్బకు కుదేలైన కంపెనీలన్నీ పోటీపడి మరీ ఆఫర్లు ప్రకటిస్తూ ఎదురుదాడిని తీవ్రతరం చేశాయి. ఇటీవలే వొడాఫోన్ స్పెషల్ రంజాన్ ప్యాక్ లు ప్రకటించగా.. మూడో టెలికాం దిగ్గజంగా పేరున్న ఐడియా సెల్యులార్ సైతం ప్రీపెయిడ్ కస్టమర్లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 396 రూపాయల రీఛార్జ్ ప్యాక్ పై ఎంపిక చేసిన ప్రీపెయిడ్ కస్టమర్లు 70జీబీ డేటాను వరకు అందించనున్నట్టు తెలిపింది. దీంతో పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్ 70 రోజుల వరకు వాలిడిటీలో ఉంటుంది. దీనికింద రోజుకు 1జీబీ డేటాను అందిస్తోంది. అంతేకాక 3జీ స్పీడు ఈ డేటాను అందించనుంది. ఈ డేటా ప్యాక్ రిలయన్స్ జియో రూ.309 కు పోటీగా ఉందని తెలుస్తోంది. ఈ కొత్త రీఛార్జ్ ప్యాక్ పై పొందే అపరిమిత కాలింగ్ సౌకర్యాలు కేవలం ఐడియా టూ ఐడియా కస్టమర్లకు మాత్రమే. ఇతర నెట్ వర్క్ లకు 3000 నిమిషాల ఎస్టీడీ, లోకల్ కాల్స్ ను అందిస్తోంది. అంటే రోజుకు 300 నిమిషాలను మాత్రమే వాడుకోవడానికి వీలుంది. ఒకవేళ ఈ పరిమితిని మించితే నిమిషానికి 30 పైసలు వసూలు చేయనున్నట్టు ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు. టెలికాం మార్కెట్లో పెరుగుతున్న పోటీతో కొత్త ఆపరేటర్ జియోకు కౌంటర్ గా ఆపరేటర్లు డేటా టారిఫ్ లను ప్రకటిస్తున్నాయని విశ్లేషకులు చెప్పారు. ఇటీవలే రిలయన్స్ జియో రికార్డు సృష్టిస్తూ డేటా స్పీడులో ఆల్ స్పీడు హైలో నిలిచింది. అయితే ఐడియా ఈ ప్యాక్ పై ఎలాంటి ప్రమోషన్ చేయడం లేదు. ఒకవేళ ఈ ఆఫర్ తమ నెంబర్ కు అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడం కోసం యూజర్లు కస్టమర్ కేర్ కు కాల్ చేయాల్సిందేనట. -
వోడాఫోన్ ‘సూపర్ ఆఫర్స్’
ముంబై: ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ ప్రీపెయిడ్ కస్టమర్లకోసం సూపర్ డే, సూపర్ వీక్, సూపర్ అంబరిల్లా అనే మూడు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వొడాఫోన్ కమర్షియల్ డైరెక్టర్ సందీప్ కటారియా ఒక ప్రకటన లో తెలిపారు. సూపర్ డే ప్లాన్ లోరోజుకి రూ.19 ల రీచార్జ్‌పై ఉచిత కాలింగ్ సదుపాయంతో 100 ఎంబీ 4జీ డేటా ఉచితంగా అందిస్తోంది. సూపర్ వీక్ తో పేరుతో లాంచ్ చేసిన రెండో ప్లాన్‌లో రూ.49లకు ఏడురోజుల వ్యాలిడిటీతో 250ఎంబీ 4జీ డ్యాటా, వొడాఫోన్ నెట్‌వర్క్‌లో ఉచిత కాలింగ్ సదుపాయం ఆఫర్ చేస్తోంది. రూ. 89ల సూపర్ అంబరిల్లా ప్లాన్‌లో వొడాఫోన్ నెట్‌వర్క్‌లో ఉచితం కాలింగ్, 100 ని.ల ఇతర నెట్‌వర్క్‌లకు కాలింగ్ ఆఫర్‌తోపాటు, 250 ఎంబీ 4జీ డేటా ఉచితం. -
వొడాఫోన్ డేటా ప్యాక్‌లపై బంపరాఫర్
రిలయన్స్ ఉచిత సేవల పొడిగింపు దెబ్బకు మరోసారి టెలికాం దిగ్గజాలన్నీ దిగొస్తున్నాయి. ఎయిర్టెల్, ఐడియా తర్వాత వొడాఫోన్ సైతం తన 4జీ ప్రీపెయిడ్ కస్టమర్లకు మంగళవారం బంపర్ ఆఫర్లు ప్రకటించింది. తన 4జీ సర్కిళ్లలో 4జీ డేటా ప్రయోజనాలను పెంచుతున్నట్టు తెలిపింది. రూ.150 డేటా ప్యాక్‌పై ఇకనుంచి 1జీబీ డేటాను నెలపాటు అందించనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా రూ.1,500 డేటా ప్యాక్‌పై నెలకు 35జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు చెప్పింది. అయితే ఈ కొత్త డేటా ప్యాక్‌ల ధరలు సర్కిల్ సర్కిల్‌కు వేరువేరుగా ఉంటుందని వొడాఫోన్ తెలిపింది. వొడాఫోన్ 4జీ సర్కిళ్లలోనే ఇవి అందుబాటులో ఉండనున్నాయి. డిజిటల్ చానల్స్, రిటైల్ టచ్ పాయింట్స్ ద్వారా ఈ కొత్త 4జీ డేటా ప్యాక్స్‌ను కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది. పాత డేటా ప్యాక్‌లకు, కొత్త డేటా ప్యాక్‌లకు తేడాను కూడా వొడాఫోన్ వివరించింది. ఇప్పటివరకు 1జీబీ, 10జీబీ 4జీ డేటా ప్యాక్‌లను కొనుగోలుచేస్తున్న వినియోగదారులు అదే ధరకు 4జీబీ, 22జీబీ డేటా ప్యాక్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. కొత్త వొడాఫోన్ 4జీ డేటా ప్యాక్స్... 1జీబీ డేటా ప్యాక్ -రూ.150 4జీబీ డేటా ప్యాక్ - రూ.250 6జీబీ డేటా ప్యాక్ - రూ.350 9జీబీ డేటా ప్యాక్ - రూ.450 13జీబీ డేటా ప్యాక్ - రూ.650 22జీబీ డేటా ప్యాక్ -రూ.990 35జీబీ డేటా ప్యాక్ - రూ.1,500 -
ప్రీపెయిడ్ కస్టమర్లకు కాన్ఫరెన్స్ కాల్ సదుపాయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ వొడాఫోన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కాన్ఫరెన్స్ కాల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఒక కాల్‌పై ఏకకాలంలో అయిదుగురితో మాట్లాడుకునేందుకు కాన్ఫరెన్స్ సౌకర్యం వీలు కల్పిస్తుంది. ఇప్పటికే ఉన్న, ఎంపిక చేసుకున్న ప్యాకేజీలకు అనుగుణంగా కాల్ చార్జీలు ఉంటాయని సర్కిల్ బిజినెస్ హెడ్ మన్దీప్ సింగ్ భాటియా తెలిపారు. సర్కిల్లో వొడాఫోన్‌కు 67 లక్షల మంది ప్రీపెయిడ్ వినియోగదార్లు ఉన్నారు.