న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్, ఆపిల్ కొత్తగా లాంచ్ చేసిన ఐఫోన్లను ఆఫర్ చేస్తుంది. తన ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులో ఉంచనున్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది. 2018 సెప్టెంబర్ 28 నుంచి వీటిని అందించడం ప్రారంభిస్తామని పేర్కొంది. అందుబాటులో ఉండే ప్రొడక్ట్‌లు ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్‌ఆర్. సెప్టెంబర్ 21 నుంచి ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. అక్టోబర్ 19 నుంచి ఐఫోన్ ఎక్స్‌ఆర్ ను ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని ఎయిర్‌టెల్ ప్రకటించింది. ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ నోట్ 9, ఒప్పో ఎఫ్9 ప్రొ స్మార్ట్‌ఫోన్లు ఎయిర్‌టెల్ ఆన్‌లైన్ స్టోర్‌లో అందబాటులో ఉన్నాయి. 7900 రూపాయలు, 3915 రూపాయల డౌన్ పేమెంట్‌తో ఎయిర్‌టెల్ ఆన్‌లైన్ స్టోర్‌లో వీటిని విక్రయిస్తోంది.
ఎయిర్‌టెల్ తన మొబైల్ కస్టమర్లకు రూ.51 విలువైన స్పెషల్ అమెజాన్ పే గిఫ్ట్ కార్డును కూడా ఆఫర్ చేస్తోంది. మైఎయిర్‌టెల్ యాప్ ద్వారా ఈ డిజిటల్ గిఫ్ట్ కార్డును పొందాల్సి ఉంటుంది. రూ.100 లేదా ఆపై మొత్తాల ప్యాక్‌లతో రీఛార్జ్ చేయించుకునే ఎయిర్‌టెల్ ప్రీ-పెయిడ్ కస్టమర్లు మాత్రమే ఈ స్పెషల్ అమెజాన్ పే గిఫ్ట్ కార్డుకు అర్హులు. ఎయిర్‌టెల్ పోస్టుపెయిడ్ కస్టమర్లు ఈ ఆఫర్‌ను, ఇన్ఫినిటీ ప్లాన్‌పై పొందాల్సి ఉంటుంది. పరిమిత పీరియడ్‌లో మాత్రమే ఈ ఆఫర్ వాలిడ్‌లో ఉంటుంది. ఇప్పటికే 3 వారాల్లో 50 లక్షలకు పైగా కస్టమర్లు ఎయిర్‌టెల్ పే గిఫ్ట్ కార్డును పొందారు.
Comments
Please login to add a commentAdd a comment