New iphones
-
12 గంటల వ్యవధిలోనే 2 సార్లు దొంగతనం
-
12 గంటల వ్యవధిలోనే 2 సార్లు బీభత్సం
శాన్ఫ్రాన్సిస్కో : ఒక స్టోర్‌లో ఒకసారి దొంగతనం జరిగింది అంటే.. అది గ్రహపాటునో లేదా అలర్ట్‌గా లేకపోవడం వల్లనో జరిగింది అనుకుంటాం. కానీ అదే స్టోర్‌లో మళ్లీ చోరీ జరిగితే, అది మాత్రం కచ్చితంగా సిబ్బంది నిర్లక్ష్యం, అలసత్వమే అవుతుంది. అమెరికాలో టెక్ దిగ్గజం ఆపిల్ స్టోర్‌లో అదే జరిగింది. ఆపిల్ తన కొత్త ఐఫోన్ 10ఎస్ లాంచ్ ఈవెంట్లో నిమగ్నమై ఉన్న సందర్భంగా.. కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో ఆపిల్ స్టోర్‌లో 12 గంటల వ్యవధిలో రెండు సార్లు చోరీ జరిగింది. ఈ చోరీలో వేల డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ వస్తువులు దొంగతనానికి గురయ్యాయి. పాలో ఆల్టో పోలీసులు సమాచారం ప్రకారం.. తొలుత శనివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆపిల్ స్టోర్‌లో దొంగతనం జరిగింది. ఆ సమయంలో ఎనిమిది మంది అనుమానిత వ్యక్తులు డెమోకి ఉంచిన 57 వేల డాలర్ల విలువైన ఐఫోన్లను ఎత్తుకెళ్లారు. దానిలో కొత్త ఐఫోన్లు ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్, ఇతర ప్రొడక్ట్‌లు ఉన్నాయి. ప్రొడక్ట్‌లను దొంగలించిన అనంతరం, వారు పలు వాహనాల్లో పారిపోయారని 9టూ5మ్యాక్ రిపోర్టు చేసింది. వెంటనే ఆదివారం ఉదయమే, మళ్లీ ఆపిల్ స్టోర్ గ్లాస్ డోర్లను బద్దలు కొట్టి మరిన్ని ఉత్పత్తులను దోచుకుపోయారు. మొత్తంగా 12 గంటల వ్యవధిలో పోయిన డివైజ్‌ల విలువ 1,07,00 డాలర్లుగా ఉంటుందని తెలిసింది. అయితే ఇప్పటి వరకు ఈ చోరీకి పాల్పడిన వారిని పోలీసులు గుర్తించడం కానీ అరెస్ట్ చేయడం కానీ జరగలేదు. కేవలం పాలో ఆల్టో ఆపిల్ స్టోర్‌ను మాత్రమే కాకుండా.. కాలిఫోర్నియాలోని మరో స్టోర్ శాంట రోజా ప్లాజా షాపింగ్ సెంటర్‌ను కూడా దుండగులు టార్గెట్ చేశారు. కానీ అక్కడ దొంగలను పోలీసులకు చిక్కారు. గత కొన్నేళ్లుగా ఆపిల్ స్టోర్లను టార్గెట్‌గా చేసుకుని దుండగులు పలు చోరీలకు పాల్పడుతున్నారు. కొత్త ఐఫోన్ల లాంచింగ్ తర్వాత పాలో ఆల్టో ఆపిల్ స్టోర్‌లో ఇప్పటికి రెండు సార్లు దొంగతనం జరిగింది. అది కూడా వెంట వెంటనే. ఆగస్టు, సెప్టెంబర్ మధ్య కాలంలో కూడా ఆరు ఆపిల్ స్టోర్లలో కనీసం తొమ్మిది సార్లు దుండగులు రెచ్చిపోయారు. ఆదివారం శాంట రోజా ప్లాజాలో జరిగిన దొంగతనం కూడా నెల వ్యవధిలోనే రెండోది అని ఫాక్స్ న్యూస్ రిపోర్టు చేసింది. -
నెలకు రూ.4,499 కట్టి, ఐఫోన్ 10ఎస్ పొందండి
టెక్ దిగ్గజం ఆపిల్‌కు భారత్‌లో ఉన్న అధికారిక డిస్ట్రిబ్యూటర్స్‌లో ఇండియాస్టోర్.కామ్ ఒకటి. ఈ అధికారిక వెబ్సైట్లో ఆపిల్ ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ స్మార్ట్ఫోన్లు లో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో కొనుగోలుకు అందుబాటులోకి వస్తున్నాయి. ఎయిర్టెల్, జియో, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా వీటిని విక్రయానికి ఉంచుతుంది ఆపిల్. ఆసక్తి గల కస్టమర్లు ముందస్తుగా ఈ ఫోన్లను బుక్చేసుకోవాలని ఆపిల్ తెలిపింది. ఈ సందర్భంగా ఇండియాస్టోర్.కామ్ ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. నెలకు రూ.4,999 చొప్పున 24 నెలల పాటు చెల్లించి, ఐఫోన్ 10ఎస్(64జీబీ) వేరియంట్‌ను సొంతం చేసుకోవచ్చని తెలిపింది. దీనిపై విధించే వడ్డీరేటు అనంతరం ఐఫోన్ 10ఎస్( జీబీ) ధర రూ.99,900 నుంచి రూ.1,07,976కు పెరుగుతుందని పేర్కొంది. అదేవిధంగా ఐఫోన్ 10ఎస్(256జీబీ) వేరియంట్‌ను కూడా 24 నెలల పాటు నెలకు రూ.5,175 చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. దీనిపై విధించే వడ్డీరేటుతో కూడా ఐఫోన్ 10ఎస్(256జీబీ) వేరియంట్ ధర కూడా రూ.1,14,900 నుంచి రూ.1,24,200కు పెరుగుతుందని తెలిపింది. ఐఫోన్ 10ఎస్(512జీబీ) వేరియంట్ కూడా నెలకు రూ.6,076 చెల్లించడంతో కొనుగోలుదారులకు సొంతమవుతుంది. మిగతా మొత్తాన్ని 24 నెలల్లో చెల్లించాలి. అదేవిధంగా ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ 64జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లను కూడా నెలకు 4,999 రూపాయలు, 5,678 రూపాయలు, 6,587 రూపాయలు చొప్పున 24 నెలల పాటు చెల్లించి తమ సొంతం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 28 నుంచి ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్‌లు భారత్‌లో కొనుగోలుకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రెండు హ్యాండ్సెట్లను విడుదల చేయడానికి ఇండియాస్టోర్ సైట్ కౌంట్‌డౌన్ కూడా ప్రారంభించింది. 24 నెలల టెన్యూర్‌తో లో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను ఇండియాస్టోర్.కామ్ అందుబాటులోకి తెచ్చింది. వీటిపై యాక్సిస్‌బ్యాంక్ క్రెడిట్ కార్డు, సిటీ క్రెడిట్ కార్డులు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేయనుంది. నాన్-ఈఎంఐ లావాదేవీలకు ఐదింతల రివార్డు పాయింట్లు లభిస్తాయి. లావాదేవీ జరిపిన 150 బిజినెస్ గంటల్లో క్యాష్‌బ్యాక్ కొనుగోలుదారులకు అందుతుంది. -
జియోలో కొత్త ఐఫోన్లు
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఇటీవల తన కొత్త ఫోన్లు ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్‌లను ఎంతో ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐఫోన్లు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తాయా? అంటూ ఆపిల్ అభిమానులు వేచి చూస్తున్నారు. నిన్నటి నుంచి ఈ ఐఫోన్ల ప్రీ-ఆర్డర్లు భారత్‌లో ప్రారంభమయ్యాయి. కొత్త ఐఫోన్లను తమ నెట్‌వర్క్‌లో కూడా అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ జియో ప్రకటించింది. లేటెస్ట్ ఐఫోన్లను కస్టమర్లు www.jio.com, రిలయన్స్ డిజిటల్, మైజియో స్టోర్లు, మైజియో యాప్‌లలో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. శుక్రవారం అంటే సెప్టెంబర్ 28 నుంచి ఈ రెండు డివైజ్‌లు స్టోర్లలో అందుబాటులోకి వస్తున్నాయి. రెండు ఫోన్లలో కూడా జియో తన ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ కస్టమర్ల కోసం అడ్వాన్స్డ్ ఈసిమ్ ఫీచర్‌ను అందిస్తుంది. ప్రీపెయిడ్ యూజర్లకు దేశంలో ఈసిమ్ యాక్టివేషన్‌ను అందిస్తున్న ఏకైక ప్రొవైడర్ జియో మాత్రమే. జియో డిజిటల్ లైఫ్‌ను అనుభూతి చెందడానికి ఈ ఐఫోన్ యూజర్లకు డ్యూయల్ సిమ్ ఫీచర్‌ను అందిస్తుంది. దీనిలో ఒకటి నానో-సిమ్ కాగా, మరొకటి డిజిటల్ ఈసిమ్. ఇప్పటి వరకు వచ్చిన ఐఫోన్లలో ఇవే అధునాతనమైనవి. స్మార్ట్‌ఫోన్‌ను కొత్త శిఖరానికి తీసుకెళ్లడానికి ఇవి ఎంతో సహకరించనున్నాయి. ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ 5.8 అంగుళాలు, 6.5 అంగుళాల సూపర్ రెటినా డిస్ప్లేలను కలిగి ఉన్నాయి. వేగవంతమైన, మెరుగైన డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను ఇవి కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో తొలిసారిగా 7-నానోమీటర్ చిప్‌ను ఏర్పాటు చేశారు. వేగవంతమైన ఫేస్ ఐడీ, వైడర్ స్టిరియో సౌండ్, లాంగర్ బ్యాటరీ లైఫ్, వాటర్ రెసిస్టెన్స్, బ్యూటిఫుల్ గోల్డ్ ఫిన్నిష్, డౌన్లోడ్ స్పీడును పెంచే గిగాబిట్-క్లాస్ ఎల్‌టీఈను ఈ ఫోన్లు ప్రవేశపెట్టాయి. -
కొత్త ఐఫోన్లు ఎయిర్టెల్ స్టోర్‌లో....
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్టెల్, ఆపిల్ కొత్తగా లాంచ్ చేసిన ఐఫోన్లను ఆఫర్ చేస్తుంది. తన ఆన్లైన్ స్టోర్‌లో ఈ స్మార్ట్ఫోన్లను అందుబాటులో ఉంచనున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించింది. 2018 సెప్టెంబర్ 28 నుంచి వీటిని అందించడం ప్రారంభిస్తామని పేర్కొంది. అందుబాటులో ఉండే ప్రొడక్ట్‌లు ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఆర్. సెప్టెంబర్ 21 నుంచి ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. అక్టోబర్ 19 నుంచి ఐఫోన్ ఎక్స్ఆర్ ను ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని ఎయిర్టెల్ ప్రకటించింది. ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ నోట్ 9, ఒప్పో ఎఫ్9 ప్రొ స్మార్ట్ఫోన్లు ఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్‌లో అందబాటులో ఉన్నాయి. 7900 రూపాయలు, 3915 రూపాయల డౌన్ పేమెంట్‌తో ఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్‌లో వీటిని విక్రయిస్తోంది. ఎయిర్టెల్ తన మొబైల్ కస్టమర్లకు రూ.51 విలువైన స్పెషల్ అమెజాన్ పే గిఫ్ట్ కార్డును కూడా ఆఫర్ చేస్తోంది. మైఎయిర్‌టెల్ యాప్ ద్వారా ఈ డిజిటల్ గిఫ్ట్ కార్డును పొందాల్సి ఉంటుంది. రూ.100 లేదా ఆపై మొత్తాల ప్యాక్‌లతో రీఛార్జ్ చేయించుకునే ఎయిర్టెల్ ప్రీ-పెయిడ్ కస్టమర్లు మాత్రమే ఈ స్పెషల్ అమెజాన్ పే గిఫ్ట్ కార్డుకు అర్హులు. ఎయిర్టెల్ పోస్టుపెయిడ్ కస్టమర్లు ఈ ఆఫర్‌ను, ఇన్ఫినిటీ ప్లాన్‌పై పొందాల్సి ఉంటుంది. పరిమిత పీరియడ్‌లో మాత్రమే ఈ ఆఫర్ వాలిడ్‌లో ఉంటుంది. ఇప్పటికే 3 వారాల్లో 50 లక్షలకు పైగా కస్టమర్లు ఎయిర్టెల్ పే గిఫ్ట్ కార్డును పొందారు. -
త్వరలోనే ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ ఎస్ఈ నిలిపివేత?
టెక్ దిగ్గజం ఆపిల్ మరికొన్ని నెలల్లో తన మెగా హార్డ్‌వేర్ ఈవెంట్‌ను నిర్వహించబోతుంది. ఆ ఈవెంట్లో గత ఎంతో కాలంగా ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న కొత్త ఐఫోన్లను కంపెనీ లాంచ్ చేయబోతుందని తెలుస్తోంది. ఈ కొత్త ఐఫోన్లకు 2018లో భారీ ఎత్తున్న డిమాండ్ వచ్చే అవకాశాలున్నాయని కూడా టెక్ వర్గాలు అంచనావేస్తున్నాయి. అయితే వీటికి డిమాండ్ భారీ ఎత్తున్న ఉండబోతున్న తరుణంలో, ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఐఫోన్ ఎక్స్‌ను, ఐఫోన్ ఎస్ఈ లను నిలిపివేస్తుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. కంపెనీ ప్రస్తుతం తన ఫోకస్ అంతా కొత్తగా విడుదల చేయబోతున్న ఆ మూడు ఐఫోన్లపైనే ఉంచనున్నట్టు పేర్కొంటున్నారు. బ్లూఫిన్ రీసెర్చ్ విడుదల చేసిన ఓ ఇన్వెస్టర్ నోట్లో.. గత కొన్నేళ్లుగా ఎలాంటి అప్‌గ్రేడ్ లేకపోవడంతో, తాజాగా తీసుకొచ్చే ఐఫోన్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుందని తెలిసింది. ఆపిల్ ఆ మెగా ఈవెంట్లో 5.8 అంగుళాల ఐఫోన్ ఎక్స్ సక్ససర్, 6.5 అంగుళాల ఐఫోన్ ఎక్స్ ప్లస్ మోడల్, అఫార్డబుల్ 6.1 అంగుళాల ఎల్సీడీ ఐఫోన్‌ను లాంచ్ చేస్తుంది. అఫార్డబుల్ ఎల్సీడీ ఐఫోన్‌కు భారీ ఎత్తున్న డిమాండ్ వస్తుందని చాలా కాలం నుంచే విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 2018 మూడు, నాలుగు క్వార్టర్లలో 9.1 కోట్ల యూనిట్ల 2018 ఐఫోన్‌ను తయారు చేస్తుందని బ్లూఫిన్ విశ్లేషకులు చెప్పారు. మరో 9.2 కోట్ల యూనిట్లను 2019 తొలి రెండు క్వార్టర్లలో రూపొందిస్తుందని పేర్కొన్నారు. షిప్మెంట్లను కూడా భారీగానే చేపట్టనుందని తెలిపారు. ఐఫోన్ ఎక్స్ ధర(999 డాలర్లు) మాదిరే ఐఫోన్ ఎక్స్ ప్లస్ ధరను నిర్ణయిస్తుందని, అదేమాదిరి మూడు ఐఫోన్లలో కెల్లా 6.1 అంగుళాల ఎల్సీడీ ఐఫోన్ ధరనే అత్యంత తక్కువగా ఉంచనుందని తెలుస్తోంది. దీని ధర 600 డాలర్ల నుంచి 700 డాలర్ల మధ్యలో ఉండొచ్చని సమాచారం. ఇది ఐఫోన్ ఎస్ఈని రీప్లేస్ చేస్తుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్లను లాంచ్ చేయబోతున్న తరుణంలో, ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ ఎస్ఈలను నిలిపివేయబోతున్నట్టు విశ్లేషకులంటున్నారు. ఒకవేళ ఐఫోన్ ఎక్స్‌ను కనుక ఆపిల్ నిలిపివేస్తే, లాంచ్ అయిన ఏడాదిలో నిలిచిపోయిన ఫోన్ ఇదే అవుతుంది. -
వచ్చే నెల 16న భారత్‌లోకి యాపిల్ కొత్త ఐఫోన్స్
వాషింగ్టన్: యాపిల్ కొత్త ఐఫోన్స్ అతి త్వరలో భారత్‌లోకి రానున్నాయి. కొత్త 6ఎస్, 6ఎస్ ప్లస్ ఐఫోన్స్‌ను అక్టోబర్ 16న భారత మార్కెట్లో ఆవిష్కరిస్తామని యాపిల్ కంపెనీ ప్రకటించింది. ఐఫోన్స్ అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన నెల రోజుల లోపే భారత మార్కెట్లోకి రానుండటం ఇదే తొలిసారి. ఐఫోన్ భారత మార్కెట్లోకి ఇంత వేగంగా రావడానికి వచ్చే పండుగ సీజన్ కారణంగా కనిపిస్తోంది. కాగా అంతర్జాతీయంగా విడుదలైన వారంలో ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ అమ్మకాలు 1.30 కోట్లుగా నమోదై సరికొత్త రికార్డును సృష్టించాయని కంపెనీ పేర్కొంది. ఇక గతేడాది విడుదలైన ఐఫోన్ 6, 6 ప్లస్ అమ్మకాలు కోటిగా ఉన్నాయని తెలిపింది.