వచ్చే నెల 16న భారత్‌లోకి యాపిల్ కొత్త ఐఫోన్స్ | India on 16th of next month the new Apple Iphones | Sakshi
Sakshi News home page

వచ్చే నెల 16న భారత్‌లోకి యాపిల్ కొత్త ఐఫోన్స్

Published Tue, Sep 29 2015 1:18 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

వచ్చే నెల 16న భారత్‌లోకి యాపిల్  కొత్త ఐఫోన్స్ - Sakshi

వచ్చే నెల 16న భారత్‌లోకి యాపిల్ కొత్త ఐఫోన్స్

వాషింగ్టన్: యాపిల్ కొత్త ఐఫోన్స్ అతి త్వరలో భారత్‌లోకి రానున్నాయి. కొత్త 6ఎస్, 6ఎస్ ప్లస్ ఐఫోన్స్‌ను అక్టోబర్ 16న భారత మార్కెట్‌లో ఆవిష్కరిస్తామని యాపిల్ కంపెనీ ప్రకటించింది. ఐఫోన్స్ అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదలైన నెల రోజుల లోపే భారత మార్కెట్‌లోకి రానుండటం ఇదే తొలిసారి. ఐఫోన్ భారత మార్కెట్లోకి ఇంత వేగంగా రావడానికి వచ్చే పండుగ సీజన్ కారణంగా కనిపిస్తోంది. కాగా అంతర్జాతీయంగా విడుదలైన వారంలో ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ అమ్మకాలు 1.30 కోట్లుగా నమోదై సరికొత్త రికార్డును సృష్టించాయని కంపెనీ పేర్కొంది. ఇక గతేడాది విడుదలైన ఐఫోన్ 6, 6 ప్లస్ అమ్మకాలు కోటిగా ఉన్నాయని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement