కొత్త ఐఫోన్లు ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఇటీవల తన కొత్త ఫోన్లు ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్‌లను ఎంతో ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐఫోన్లు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తాయా? అంటూ ఆపిల్ అభిమానులు వేచి చూస్తున్నారు. నిన్నటి నుంచి ఈ ఐఫోన్ల ప్రీ-ఆర్డర్‌లు భారత్‌లో ప్రారంభమయ్యాయి. కొత్త ఐఫోన్లను తమ నెట్‌వర్క్‌లో కూడా అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ జియో ప్రకటించింది. లేటెస్ట్ ఐఫోన్లను కస్టమర్లు www.jio.com, రిలయన్స్ డిజిటల్, మైజియో స్టోర్లు, మైజియో యాప్‌లలో ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. శుక్రవారం అంటే సెప్టెంబర్ 28 నుంచి ఈ రెండు డివైజ్‌లు స్టోర్లలో అందుబాటులోకి వస్తున్నాయి. రెండు ఫోన్లలో కూడా జియో తన ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ కస్టమర్ల కోసం అడ్వాన్స్‌డ్ ఈసిమ్ ఫీచర్‌ను అందిస్తుంది.
ప్రీపెయిడ్ యూజర్లకు దేశంలో ఈసిమ్ యాక్టివేషన్‌ను అందిస్తున్న ఏకైక ప్రొవైడర్ జియో మాత్రమే. జియో డిజిటల్ లైఫ్‌ను అనుభూతి చెందడానికి ఈ ఐఫోన్ యూజర్లకు డ్యూయల్ సిమ్ ఫీచర్‌ను అందిస్తుంది. దీనిలో ఒకటి నానో-సిమ్ కాగా, మరొకటి డిజిటల్ ఈసిమ్. ఇప్పటి వరకు వచ్చిన ఐఫోన్లలో ఇవే అధునాతనమైనవి. స్మార్ట్‌ఫోన్‌ను కొత్త శిఖరానికి తీసుకెళ్లడానికి ఇవి ఎంతో సహకరించనున్నాయి. ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్ 5.8 అంగుళాలు, 6.5 అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. వేగవంతమైన, మెరుగైన డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను ఇవి కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో తొలిసారిగా 7-నానోమీటర్ చిప్‌ను ఏర్పాటు చేశారు. వేగవంతమైన ఫేస్ ఐడీ, వైడర్ స్టిరియో సౌండ్, లాంగర్ బ్యాటరీ లైఫ్, వాటర్ రెసిస్టెన్స్, బ్యూటిఫుల్ గోల్డ్ ఫిన్నిష్, డౌన్‌లోడ్ స్పీడును పెంచే గిగాబిట్-క్లాస్ ఎల్‌టీఈను ఈ ఫోన్లు ప్రవేశపెట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment