
ప్రముఖ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో 'దీపావళి ధమాకా' పేరుతో కొత్త ఆఫర్స్ ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా కంపెనీ ఈ వినియోగదారుల కోసం ఈ ఆఫర్స్ తీసుకువచ్చింది. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..
రిలయన్స్ జియో ప్రకటించిన ఈ ఆఫర్స్ ద్వారా సుమారు రూ. 3,350 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. నవంబర్ 5లోపు రీఛార్జ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ బెనిఫీట్స్ లభిస్తాయి. రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్‌లో భాగంగా రూ.899 రీఛార్జ్ ప్లాన్ మీద, రూ. 3,599 రీఛార్జ్ ప్లాన్ మీద అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.
రూ.899 రీఛార్జ్ ప్లాన్ ద్వారా యూజర్స్ 90 రోజుల వరకు అన్‌లిమిటెడ్ 5జీ సేవలను పొందవచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్‌లు పొందవచ్చు. అదనంగా 20 జీబీ డేటా కూడా లభిస్తుంది. రూ. 3,599 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ (365 రోజులు) ద్వారా రోజుకు 2.5 జీబీ డేటాను పొందవచ్చు.

ప్రయోజనాలు
ఈజీ మై ట్రిప్ వోచర్: రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్స్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. రూ. 3,000 విలువైన ఈజీ మై ట్రిప్ వోచర్ పొందవచ్చు. దీనిని విమాన ప్రయాణాలను, హోటల్ బుకింగ్స్ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు.
అజియో కూపన్: రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్ళపైన రూ. 200 అజియో డిస్కౌంట్ లభిస్తుంది.
స్విగ్గీ వోచర్: ఫుడ్ డెలివరీ కోసం రూ. 150 విలువైన స్విగ్గీ వోచర్ లభిస్తుంది.
ఇదీ చదవండి: యూట్యూబ్ కొత్త ఫీచర్: మరింత ఆదాయానికి సులువైన మార్గం
కూపన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..
రిలయన్స్ జియా దీపావళి ధమాకా ఆఫర్స్ ద్వారా పొందిన కూపన్లను మై జియో యాప్ సాయంతో క్లెయిమ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.
➜మై జియో యాప్ ఓపెన్ చేసి ఆఫర్స్ విభాగంలోకి వెళ్ళాలి
➜అక్కడ కనిపించే మై విన్నింగ్స్ మీద క్లిక్ చేసి కూపన్ ఎంచుకోవాలి
➜కూపన్ కోడ్ కాపీ చేసి.. ఎక్కడ ఉపయోగించాలనుకుంటున్నారో ఆ వెబ్‌సైట్‌కు వెళ్లి కూపన్ కోడ్ అప్లై చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment