వొడాఫోన్ డేటా ప్యాక్లపై బంపరాఫర్
వొడాఫోన్ డేటా ప్యాక్లపై బంపరాఫర్
Published Tue, Jan 17 2017 5:32 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM
రిలయన్స్ ఉచిత సేవల పొడిగింపు దెబ్బకు మరోసారి టెలికాం దిగ్గజాలన్నీ దిగొస్తున్నాయి. ఎయిర్టెల్, ఐడియా తర్వాత వొడాఫోన్ సైతం తన 4జీ ప్రీపెయిడ్ కస్టమర్లకు మంగళవారం బంపర్ ఆఫర్లు ప్రకటించింది. తన 4జీ సర్కిళ్లలో 4జీ డేటా ప్రయోజనాలను పెంచుతున్నట్టు తెలిపింది. రూ.150 డేటా ప్యాక్పై ఇకనుంచి 1జీబీ డేటాను నెలపాటు అందించనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా రూ.1,500 డేటా ప్యాక్పై నెలకు 35జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు చెప్పింది.
అయితే ఈ కొత్త డేటా ప్యాక్ల ధరలు సర్కిల్ సర్కిల్కు వేరువేరుగా ఉంటుందని వొడాఫోన్ తెలిపింది. వొడాఫోన్ 4జీ సర్కిళ్లలోనే ఇవి అందుబాటులో ఉండనున్నాయి. డిజిటల్ చానల్స్, రిటైల్ టచ్ పాయింట్స్ ద్వారా ఈ కొత్త 4జీ డేటా ప్యాక్స్ను కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది. పాత డేటా ప్యాక్లకు, కొత్త డేటా ప్యాక్లకు తేడాను కూడా వొడాఫోన్ వివరించింది. ఇప్పటివరకు 1జీబీ, 10జీబీ 4జీ డేటా ప్యాక్లను కొనుగోలుచేస్తున్న వినియోగదారులు అదే ధరకు 4జీబీ, 22జీబీ డేటా ప్యాక్స్ను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది.
కొత్త వొడాఫోన్ 4జీ డేటా ప్యాక్స్...
1జీబీ డేటా ప్యాక్ -రూ.150
4జీబీ డేటా ప్యాక్ - రూ.250
6జీబీ డేటా ప్యాక్ - రూ.350
9జీబీ డేటా ప్యాక్ - రూ.450
13జీబీ డేటా ప్యాక్ - రూ.650
22జీబీ డేటా ప్యాక్ -రూ.990
35జీబీ డేటా ప్యాక్ - రూ.1,500
Advertisement
Advertisement