డైరెక్ట్‌ పోటీ : ఐడియా కొత్త ప్యాక్‌ | Idea's New 509 Pack Competes With Airtel's 509 and Jio's 459 Packs  | Sakshi
Sakshi News home page

డైరెక్ట్‌ పోటీ : ఐడియా కొత్త ప్యాక్‌

Published Fri, Dec 8 2017 6:03 PM | Last Updated on Fri, Dec 8 2017 6:04 PM

Idea's New 509 Pack Competes With Airtel's 509 and Jio's 459 Packs  - Sakshi

రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్లకు పోటీగా ఐడియా తన ప్రీపెయిడ్‌ కస్టమర్లకు సరికొత్త ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. ఈ ప్యాక్‌ కింద రోజుకు 1జీబీ 3జీ డేటాతో పాటు అపరిమిత ఉచిత కాల్స్‌(హోమ్‌, నేషనల్‌ రోమింగ్‌), రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను 84 రోజుల పాటు ఆఫర్ చేయనుంది. దీని కోసం ఐడియా కస్టమర్లు రూ.509తో రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. రిలయన్స్‌ జియో రూ.459 ప్యాక్‌కు, ఎయిర్‌టెల్‌కు రూ.509 ప్యాక్‌కు ఇది డైరెక్ట్‌ పోటీ. రిలయన్స్‌ జియో తన రూ.459 ప్యాక్‌ కింద రోజుకు 1జీబీ 4జీ డేటాను, ఉచిత కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది.

జియోకు కూడా రూ.509 ప్యాక్‌ ఉంది. కానీ ఈ ప్యాక్‌ కింద రోజుకు 2జీబీ డేటాను 49 రోజుల పాటే అందిస్తోంది. అదేవిధంగా ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లు కూడా రూ.509 ప్యాక్‌లను ఆఫర్‌ చేస్తున్నాయి. దీంతో ఒకే రకమైన టారిఫ్‌తో ఎయిర్‌టెల్‌, ఐడియా సెల్యులార్‌, వొడాఫోన్‌లు పోటీపడనున్నాయి. ఐడియా ప్రీపెయిడ్‌ కస్టమర్లు రూ.300, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై వచ్చే ఏడాదిలో 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.  అదేవిధంగా ఐడియా తన రూ.198 ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను ఇటీవల అప్‌గ్రేడ్‌ చేసింది. రూ.198 ప్రీపెయిడ్‌ ప్యాక్‌ కింద రోజుకు 1జీబీ డేటా కాకుండా 1.5జీబీ 3జీ డేటాను ఆఫర్‌ చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement