కోల్‌కత్తా: ఏజీఆర్ బకాయిల చెల్లింపుల విషయంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలకు మినహాయింపులు ఇవ్వొద్దని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు రిలయన్స్ జియో రెండో లేఖ రాసింది. వడ్డీ చెల్లింపులు, పెనాల్టీలను తగ్గించాలన్న వొడాఫోన్ ఐడియా అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయాన్ని ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో గుర్తు చేసింది. కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం కంపెనీలకు మినహాయింపులు ఇచ్చే అవకాశమే లేదని జియో స్పష్టం చేసింది.
చెల్లింపుల విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తే సుప్రీం తీర్పును ఉల్లంఘించినట్లేనని జియో తెలిపింది. మరోవైపు ఐడియా వొడాఫోన్లు ఆర్థికంగా బలంగా ఉన్నాయని ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా ఆ కంపెనీలకు ఉందని జియో తెలిపింది. కాగా ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా పెనాల్టీలు, వడ్డీ చెల్లింపులు, లైసెన్స్ రుసుములు పరంగా 81,000కోట్లు చెల్లించాలని టెలికాం వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment