ఈ రంగానికి చెందిన ఉద్యోగులకు శుభవార్త,పెరగనున్న జీతాలు.. ఎంతంటే! | Indian Telecom Companies Salary Hikes Amid Talent War | Sakshi
Sakshi News home page

ఈ రంగానికి చెందిన ఉద్యోగులకు శుభవార్త,పెరగనున్న జీతాలు.. ఎంతంటే!

Published Fri, Jul 8 2022 12:18 PM | Last Updated on Fri, Jul 8 2022 12:54 PM

Indian Telecom Companies Salary Hikes Amid Talent War - Sakshi

టెలికాం రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు శుభవార్త. త్వరలో టెలికాం సంస్థలు భారీ ఎత్తున శాలరీలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

టైమ్స్‌ కథనం ప్రకారం...టెలికాం దిగ్గజాలైన రిలయన్స్‌,ఎయిటెల్‌,వొడాఫోన్‌ ఐడియా సంస్థలు వారి ఉద్యోగుల జీతాల్ని ఈ ఏడాదిలో 10నుంచి 12శాతం వరకు పెంచుతున్నట్లు తెలుస్తోంది.గతేడాది పెంచిన శాలరీ 7.5శాతంగా ఉండగా..ఈ ఏడాది అత్యధికంగా పెంచే యోచనలో ఉన్నాయని, పైన పేర్కొన్న మూడు టెలికాం సంస్థలు ఉద్యోగులకు కనీసం  8 నుంచి 12శాతం శాలరీ హైక్‌ చేయోచ్చని టైమ్స్‌ తన కథనంలో హైలెట్‌ చేసింది.

జులైలో పెరగనున్నాయి
టెలికాం కంపెనీలు జీతాలు పెంచుతున్నట్లు తమకు సమాచారం అందించాయని ఐటీ,ఐటీఈఎస్‌,మీడియా, గవర్నమెంట్‌ శాఖల్లో స్టాఫింగ్‌ సర్వీస్‌ సంస్థ టీం లీజ్‌ సర్వీస్‌ వెల్లడించింది. అంతేకాదు ఇప్పటికే కొంత మంది ఉద్యోగుల జీతాలు పెంచామని,జులై నుంచి మిగిలిన వారి జీతాలు పెంచుతున్నామని టీం లీస్‌ సర్వీస్‌ బిజినెస్‌ హెడ్‌ దేవాల్‌ సింగ్‌ తెలిపారు. 

అప్‌డేట్‌ అవ్వాల్సిందే
టెలికాం రంగంలో దేశ వ్యాప్తంగా 4మిలియన్ల మంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే టెలికాం రంగంలో టక్నాలజీ అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతున్న ఉద్యోగులు జీతాలు ఊహించిన దానికంటే ఎక్కువగానే పెరగనున్నట్లు టీం లీస్‌ సర్వీస్‌ పేర్కొంది. 5జీ సర్వీసుల వినియోగంతో మార్కెట్‌లో ఉద్యోగులకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని, వారి ఎంపిక విషయంలో సైతం కంపెనీలు భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement