మొబైల్ ఆపరేటర్ సర్వీసుల్లో లోపాలకు సంబంధించి ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌పై అత్యధిక ఫిర్యాదులు అందినట్టు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తెలిపింది. మంత్రి దేవుసింహ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాదికి సంబంధించి నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్లపై దేశవ్యాప్తంగా ట్రాయ్‌కి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా ఎయిర్‌టెల్‌పై 16,111 ఫిర్యాదులు వచ్చాయి. దీని తర్వాత స్థానంలో వోడాఫోన్ ఐడియాపై 14,487, రిలయన్స్ జియోపై 7,341 ఫిర్యాదులు ఉన్నాయి.
ఇక ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌పై 2,913 కంప్లైంట్స్, ఎంఎన్‌టీఎల్‌పై 732 మంది ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై మంత్రి నుంచి స్పష్టమైన సమాధానం లభించలేదు. సాధారణంగా ట్రాయ్ స్వీకరించే ఫిర్యాదులను పరిష్కరించాల్సిందిగా ఆయా నెట్‌వర్క్‌లకు ఫార్వార్డ్ చేస్తుందని మంత్రి తెలిపారు. అయితే ఫిర్యాదుకు సరైన స్పందన రాని ఎడల వినియోగదారులు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అప్పీలేట్ అధికారికి ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment