హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ రిలయన్స్ జియో ఏప్రిల్‌లో కొత్తగా 16.8 లక్షల మంది మొబైల్ చందాదార్లను దక్కించుకుంది. దీంతో సంస్థ మొత్తం మొబైల్ యూజర్ల సంఖ్య 40.5 కోట్లకు ఎగసింది. ఎయిర్‌టెల్ ఖాతాలో నూతనంగా 8.1 లక్షల మంది చేరికతో మొత్తం మొబైల్ చందాదార్ల సంఖ్య 36.11 కోట్లను తాకింది.
టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గణాంకాల ప్రకారం.. వొడాఫోన్ ఐడియా 15.7 లక్షల మంది చందాదార్లను పోగొట్టుకుంది. ఈ సంస్థ మొత్తం సబ్‌స్కైబ్రర్లు 25.9 కోట్లకు వచ్చి చేరారు. ఇక అన్ని కంపెనీలవి కలిపి మొత్తం వైర్‌లెస్ చందాదార్ల సంఖ్య స్వల్పంగా పెరిగి 114.3 కోట్లుగా ఉంది. కస్టమర్లు పట్టణాల్లో 0.07 శాతం తగ్గి, గ్రామాల్లో 0.20 శాతం పెరిగారు. బ్రాడ్‌బ్యాండ్ చందాదార్లు మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో కొద్దిగా అధికమై 78.87 కోట్లకు చేరారు.
Comments
Please login to add a commentAdd a comment