ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా భారీ షాక్ తగిలింది. ఫిబ్రవరి నెలలో వొడాఫోన్ ఐడియా 20 లక్షల మంది వినియోగదారులను చేజార్చుకున్నట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాలను రిలీజ్ చేసింది.
అదే నెలలో జియోలోకి 10 లక్షల మంది చేరగా, ఎయిర్‌టెల్‌లోకి 9,82,554 మంది చేరినట్లు తెలిపింది. ఇక సబ్‌స్క్రైబర్ల పరంగా జియో 37.41శాతం వాటా కలిగి ఉండగా ఎయిర్ 32.39శాతం వాటాతో రెండవ స్థానంలో ఉంది. 10లక్షల మంది కస్టమర్లను కోల్పోయినప్పటికీ వొడాఫోన్ ఐడియాకు మార్కెట్‌లో 20శాతం ఉంది.
కాగా, టెలికాం విభాగంలో వొడాఫోన్ ఐడియా వెనకంజలో ఉండటమే కారణమని సమాచారం. ముఖ్యంగా ఆ సంస్థను అప్పులు బిక్కిరి చేస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఆ కంపెనీకి రూ.2.2లక్షల కోట్ల వరకు అప్పులు ఉండగా, ఏజీఆర్ బకాయిల కింద దాదాపు రూ.16వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం ఈక్విటీ కింద మార్చుకుంది.
టెలికాం నెట్ వర్క్‌లైన జియో, ఎయిర్‌టెల్ 5జీ సేవల్ని అందిస్తుండగా.. వొడాఫోన్ ఐడియాలు మాత్రం లేటెస్ట్ నెట్‌వర్క్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెరసీ యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లను వినియోగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment