దీర్ఘకాలంలో సంపదను సమకూర్చుకోవాలనుకుంటే అందుకు కీలకంగా తోడ్పడే వాటిల్లో అస్సెట్ అలోకేషన్ కూడా ఒకటి. అస్సెట్ అలోకేషన్ అన్నది ఒక ఇన్వెస్టర్ తన పెట్టుబడులను ఏ మేరకు భిన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేశారన్నది తెలియజేస్తుంది. ఇది రిస్క్‌ను పరిమితం చేయడంతోపాటు, రాబడుల్లో అనిశ్చితులను కూడా తగ్గిస్తుంది. సరైన విభాగానికి సరైన సమయంలో పెట్టుబడులను కేటాయించడం ప్రభావవంతమైన అస్సెట్ అలోకేషన్ అవుతుంది. ఎందుకంటే కాల క్రమంలో.. ఒక్కో సమయంలో ఒక్కో అస్సెట్ క్లాస్ (పెట్టుబడుల విభాగం) మంచి పనితీరు చూపించొచ్చు.
తాము బాగా అర్థం చేసుకోతగిన ఒక అస్సెట్ క్లాస్‌లోనే ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇన్వెస్టర్లు సౌకర్యంగా భావించొచ్చు. అయితే, ఒకే సాధనంలో పూర్తిగా ఇన్వెస్ట్ చేయడం వల్ల కాలానుగుణంగా, ఆయా విభాగంలో అనిశ్చితుల రిస్క్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే దీర్ఘకాలంలో సంపద సమకూర్చుకోవాలనుకునే వారికి వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో ఎంతో సాయపడుతుంది. పోర్ట్‌ఫోలియోలో భిన్న పెట్టుబడుల సాధనాలను అస్సెట్ అలోకేషన్‌గా పేర్కొంటారు. అనుకూలమైన అస్సెట్ అలోకేషన్‌ను నిర్ణయించుకుని, దానికి కట్టుబడి ఉండడంతోపాటు, రిస్క్‌ను సర్దుబాటు చేసుకుంటూ దీర్ఘకాల లక్ష్యాలకు క్రమానుగత పెట్టుబడుల విధానాన్ని అనుసరించడం సాయపడుతుంది.
భిన్న సాధనాల మధ్య..
అస్సెట్ అలోకేషన్ పరంగా ఈక్విటీల్లో తక్కువ విలువల వద్ద కొనుగోలు చేసి, అధిక విలువల వద్ద విక్రయించడం అన్నది అనుసరణీయమే. కానీ, ఆచరణలో అదంత సులభం కాదు. ఇన్వెస్టర్లు దీనికి విరుద్ధంగా చేస్తుంటారు. అదే డెట్ విభాగంలో ఇన్వెస్టర్లు వడ్డీ రేట్ల గమనం ఏ విధంగా ఉందన్న దానితో సంబంధం లేకుండా తమకు సౌకర్యమైన పెట్టుబడి సాధనాలను ఎంచుకుంటుంటారు. బంగారం అన్నది భావోద్వేగాలతో ముడిపడినది. ముఖ్యంగా ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తుంటారు. ఈ విధంగా చూసినప్పుడు పెట్టుబడుల కేటాయింపు ఒకే రంగా ఉండిపోతుంది. దీనివల్ల ఇన్వెస్టర్ ఒక పెట్టుబడి సాధనానికి సంబంధించి మారుతున్న ఆకర్షణను కోల్పోవచ్చు. దీనికి పరిష్కారంగా మ్యూచువల్ ఫండ్స్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్‌ను ఆరంభించాయి.
మారుతున్న పవనాలకు అనుగుణంగా ఈ ఫండ్స్ పెట్టుబడుల మార్పుతో ఇన్వెస్టర్లు చెప్పుకోతగిన విధంగా లాభపడేందుకు తోడ్పడతాయి. ఈ విభాగంలో ఒకానొక ప్రముఖ పథకం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అస్సెట్ అలోకేషన్ ఫండ్. డెట్, ఈక్విటీ విభాగాలకు వాటి ఆకర్షణీయతకు అనుగుణంగా పెట్టుబడులను ఈ ఫండ్ కేటాయిస్తుంది. అలాగే పెట్టుబడి పెట్టే ముందు ఈక్విటీ, డెట్ మార్కెట్ల వ్యాల్యూషన్లను ఫండ్ మేనేజర్ పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. మార్కెట్లు అనిశ్చితుల్లో ఉన్న సమయాల్లోనూ ఇన్వెస్టర్లు అస్సెట్ అలోకేషన్‌ను కొనసాగించడం అన్నది దీర్ఘకాలంలో... భిన్న సాధనాల్లో జరిగే ర్యాలీల్లో పాలు పంచుకునేందుకు సాయపడుతుంది.
జి.వనకృష్ణ
వీకీ ఫిన్‌సర్వ్ ఎల్‌ఎల్‌పీ
మీ పోర్ట్‌ఫోలియోకు అస్సెట్ అలోకేషన్..!
Published Mon, Dec 2 2019 5:32 AM | Last Updated on Mon, Dec 2 2019 5:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment