
ముంబై: దేశీ అనుబంధ సంస్థ బార్‌క్లేస్ బ్యాంక్ పీఎల్‌సీ ఇండియాకు బ్రిటిష్ మాతృ సంస్థ బార్‌క్లేస్ బ్యాంక్ రూ. 2,300 కోట్ల మూలధనం సమకూర్చనుంది. తద్వారా బ్యాంక్ బ్యాలన్స్‌షీట్ పటిష్టంకావడంతోపాటు ఇన్వెస్ట్‌మెంట్, ప్రయివేట్ బ్యాంకింగ్‌లో బిజినెస్ విస్తరించేందుకు సహాయపడనుంది.
దీంతో మరింతమంది క్లయింట్లకు బ్యాంక్ చేరువకానుంది. ప్రధానంగా కార్పొరేట్, ఫైనాన్షియల్ పెట్టుబడులున్న క్లయింట్లు, అత్యంత సంపన్న వర్గాలలో మరింత విస్తరించనున్నట్లు బార్‌క్లేస్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. వెరసి ప్రపంచంలోనే వేగవంత వృద్ధిలో ఉన్న ఆర్ధిక వ్యవస్థపట్ల దీర్ఘకాలిక కట్టుబాటును ప్రదర్శిస్తున్నట్లు తెలియజేసింది.
బార్‌క్లేస్ ఇండియా ఆర్థిక పరిస్థితి
ఇండియా రేటింగ్స్ ప్రకారం.. బార్‌క్లేస్ ఇండియా క్యాపిటల్ అడెక్వసీ రేషియో (సీఏఆర్) 2024 మార్చి చివరి నాటికి 15.93 శాతంగా ఉంది. బాసెల్-3 మార్గదర్శకాల ప్రకారం బ్యాంకు కనీసం టైర్-1 మూలధన నిష్పత్తిని 11 శాతంగా నిర్వహించాలి.
2024 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి భారత్‌లో కంపెనీ ఆస్తులు రూ.53,910 కోట్లుగా ఉన్నాయి. బార్‌క్లేస్ ఇండియా రుణాల్లో ఎక్కువ భాగం టర్మ్ లోన్స్ (2024 ఆర్థిక సంవత్సరంలో 49.2 శాతం), బిల్ డిస్కౌంటింగ్ (35.0 శాతం), వర్కింగ్ క్యాపిటల్ రుణాలు (15.8 శాతం) ఉన్నాయని ఇండియా రేటింగ్స్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment