
"సర్దార్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ" అని పిలిచే భారత మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ( Manmohan Singh ) కన్నుమూశారు. ఫైనాన్స్ పట్ల అసమానమైన అవగాహన ఉన్న ఆయన దేశ ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ( Prime Minister ) పనిచేశారు. ఆర్థిక సంస్కర్తగా ( Economic Reforms ) ఘనత వహించిన మన్మోహన్ సింగ్ ఎక్కడ ఇన్వెస్ట్ (invest ) చేసేవారు.. ఆయన పొదుపు ప్రణాళికల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సంప్రదాయ పెట్టుబడులకు ప్రాధాన్యత
1991లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయినప్పుడు సెన్సెక్స్ 999 పాయింట్ల వద్ద ఉండేది. ఆయన సంచలనాత్మక బడ్జెట్ సంస్కరణల తరువాత ఆ సంవత్సరం చివరి నాటికి సెన్సెక్స్ ( Sensex ) దాదాపు రెండింతలు పెరిగింది. భారతదేశ ఆర్థిక రూపును దిద్దడంలో ముఖ్యమైన పాత్ర ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయలేదు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ( FD ), పోస్టాఫీసు పొదుపు పథకాలు వంటి సాంప్రదాయ పెట్టుబడి సాధనాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
ఎఫ్‌డీలు, పోస్టాఫీసు పొదుపులు
ప్రధానమంత్రిగా ఆయన 2013 అఫిడవిట్ ప్రకారం.. మన్మోహన్ సింగ్ మొత్తం ఆస్తుల విలువ రూ. 11 కోట్లు. మన్మోహన్ సింగ్, ఆయన సతీమణి గురు శరణ్ కౌర్ ఇద్దరూ కలిసి రూ. 1 లక్ష నుండి రూ. 95 లక్షల విలువైన ఎనిమిది ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టారు. 2013 నాటికి వారి ఎప్‌డీలు, బ్యాంకు సేవింగ్స్ మొత్తం రూ. 4 కోట్లు కాగా వారి పోస్టాఫీసు ( Post office ) పొదుపు రూ. 4 లక్షలు.
ఆస్తులు ఇవే..
2019 నాటికి మన్మోహన్ సింగ్ ఆస్తుల విలువ రూ. 15 కోట్లు. ఢిల్లీ, చండీగడ్‌లోని ఆయన ఆస్తుల విలువ రూ. 7 కోట్లు. ఇక గురుశరణ్ కౌర్ వద్ద రూ. 3 లక్షల విలువైన 150 గ్రాముల బంగారం ఉండగా వారి బ్యాంకు ఎఫ్‌డీలు, సేవింగ్స్ రూ. 7 కోట్లు ఉన్నాయి. అదనంగా, వారు జాతీయ పొదుపు పథకం ( NSS )లో రూ.12 లక్షలు పొదుపు చేశారు.
ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం
మన్మోహన్ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం. ఉదాహరణకు 2013 ఫిబ్రవరి 2 నుండి క్రమశిక్షణతో కూడిన ఆయన ఆర్థిక ప్రణాళికను పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. ఆ రోజున ఆయన మూడు ఎఫ్‌డీలలో రూ.2 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మూడేళ్లలో ఇవి రూ. 2.62 కోట్లు అయ్యాయి. ఈ మొత్తాన్ని తిరిగి పెట్టుబడి పెట్టారు. ఆరేళ్లలో ఆయన సంపద రూ.4 కోట్లకు చేరింది. ఈ క్రమశిక్షణతో కూడిన విధానం ఆయన పెట్టుబడులును సురక్షితంగా, ఒత్తిడి లేకుండా ఉండేలా చూసింది.
స్టాక్ మార్కెట్‌కు దూరం
ఫైనాన్స్ మీద అపారమైన అవగాహన ఉన్నప్పటికీ అధిక రాబడి కోసం మన్మోహన్ సింగ్ ఎన్నడూ స్టాక్ మార్కెట్ ( Stock market ) జోలికి వెళ్లలేదు. 1992లో స్టాక్ మార్కెట్ అస్థిరత సమయంలో అప్పటి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ‘స్టాక్‌మార్కెట్‌ను తలుచుకొని నా నిద్రను చెడగొట్టుకోను’ అంటూ స్టాక్ మార్కెట్‌పై తన అంతరంగాన్ని పార్లమెంటులో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment