Post office deposits
-
ఫైనాన్స్‌లో దిట్ట.. అయినా వాటి జోలికి వెళ్లలేదు!
"సర్దార్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ" అని పిలిచే భారత మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ( Manmohan Singh ) కన్నుమూశారు. ఫైనాన్స్ పట్ల అసమానమైన అవగాహన ఉన్న ఆయన దేశ ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ( Prime Minister ) పనిచేశారు. ఆర్థిక సంస్కర్తగా ( Economic Reforms ) ఘనత వహించిన మన్మోహన్ సింగ్ ఎక్కడ ఇన్వెస్ట్ (invest ) చేసేవారు.. ఆయన పొదుపు ప్రణాళికల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సంప్రదాయ పెట్టుబడులకు ప్రాధాన్యత1991లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయినప్పుడు సెన్సెక్స్ 999 పాయింట్ల వద్ద ఉండేది. ఆయన సంచలనాత్మక బడ్జెట్ సంస్కరణల తరువాత ఆ సంవత్సరం చివరి నాటికి సెన్సెక్స్ ( Sensex ) దాదాపు రెండింతలు పెరిగింది. భారతదేశ ఆర్థిక రూపును దిద్దడంలో ముఖ్యమైన పాత్ర ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయలేదు. ఫిక్స్డ్ డిపాజిట్లు ( FD ), పోస్టాఫీసు పొదుపు పథకాలు వంటి సాంప్రదాయ పెట్టుబడి సాధనాలకు ప్రాధాన్యత ఇచ్చారు.ఎఫ్డీలు, పోస్టాఫీసు పొదుపులుప్రధానమంత్రిగా ఆయన 2013 అఫిడవిట్ ప్రకారం.. మన్మోహన్ సింగ్ మొత్తం ఆస్తుల విలువ రూ. 11 కోట్లు. మన్మోహన్ సింగ్, ఆయన సతీమణి గురు శరణ్ కౌర్ ఇద్దరూ కలిసి రూ. 1 లక్ష నుండి రూ. 95 లక్షల విలువైన ఎనిమిది ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టారు. 2013 నాటికి వారి ఎప్డీలు, బ్యాంకు సేవింగ్స్ మొత్తం రూ. 4 కోట్లు కాగా వారి పోస్టాఫీసు ( Post office ) పొదుపు రూ. 4 లక్షలు.ఆస్తులు ఇవే.. 2019 నాటికి మన్మోహన్ సింగ్ ఆస్తుల విలువ రూ. 15 కోట్లు. ఢిల్లీ, చండీగడ్‌లోని ఆయన ఆస్తుల విలువ రూ. 7 కోట్లు. ఇక గురుశరణ్ కౌర్ వద్ద రూ. 3 లక్షల విలువైన 150 గ్రాముల బంగారం ఉండగా వారి బ్యాంకు ఎఫ్డీలు, సేవింగ్స్ రూ. 7 కోట్లు ఉన్నాయి. అదనంగా, వారు జాతీయ పొదుపు పథకం ( NSS )లో రూ.12 లక్షలు పొదుపు చేశారు.ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనంమన్మోహన్ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం. ఉదాహరణకు 2013 ఫిబ్రవరి 2 నుండి క్రమశిక్షణతో కూడిన ఆయన ఆర్థిక ప్రణాళికను పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. ఆ రోజున ఆయన మూడు ఎఫ్డీలలో రూ.2 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మూడేళ్లలో ఇవి రూ. 2.62 కోట్లు అయ్యాయి. ఈ మొత్తాన్ని తిరిగి పెట్టుబడి పెట్టారు. ఆరేళ్లలో ఆయన సంపద రూ.4 కోట్లకు చేరింది. ఈ క్రమశిక్షణతో కూడిన విధానం ఆయన పెట్టుబడులును సురక్షితంగా, ఒత్తిడి లేకుండా ఉండేలా చూసింది.స్టాక్ మార్కెట్‌కు దూరంఫైనాన్స్ మీద అపారమైన అవగాహన ఉన్నప్పటికీ అధిక రాబడి కోసం మన్మోహన్ సింగ్ ఎన్నడూ స్టాక్ మార్కెట్ ( Stock market ) జోలికి వెళ్లలేదు. 1992లో స్టాక్ మార్కెట్ అస్థిరత సమయంలో అప్పటి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ‘స్టాక్‌మార్కెట్‌ను తలుచుకొని నా నిద్రను చెడగొట్టుకోను’ అంటూ స్టాక్ మార్కెట్‌పై తన అంతరంగాన్ని పార్లమెంటులో వెల్లడించారు. -
పోస్టు ఆఫీసు డిపాజిట్లకూ ఆధార్
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్‌ను మరింత విస్తృతిలోకి తీసుకురావాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం, అన్నింటికీ దీన్ని ఆధారం చేస్తూ వెళ్తోంది. ప్రస్తుతం 12 అంకెల ఈ ఆధార్‌ను అన్ని పోస్టు ఆఫీసు డిపాజిట్లకు, పీపీఎఫ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్, కిషాన్ వికాస్ పాత్రలకు తప్పనిసరి చేసింది. ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌ను సమర్పించడానికి 2017 డిసెంబర్ 31ను తుది గడువుగా విధించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీచేసిన నాలుగు గెజిట్ నోటిఫికేషన్లలో ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పోస్టు ఆఫీసుల్లో డిపాజిట్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్‌ను సమర్పించని వారు, ప్రస్తుతం ఆధార్ నెంబర్‌ను సంబంధిత పోస్టు ఆఫీసు సేవింగ్స్ బ్యాంకు లేదా డిపాజిట్ ఆఫీసు వద్ద సమర్పించాలని ఓ నోటిఫికేషన్లో తెలిపింది. అన్ని బ్యాంకు డిపాజిట్లకు, మొబైల్ ఫోన్ సిమ్‌లకు, పలు ప్రభుత్వ పథకాలకు ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలకు ఆధార్‌ను సమర్పించే గడువును సెప్టెంబర్ 30 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగించారు. ఆధార్ అన్నింటికీ తప్పనిసరి చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆధార్ నెంబర్ లేని వాళ్ల కోసం ప్రభుత్వం ఎన్రోల్మెంట్ సెంటర్లను కూడా తెరచింది. 2017 డిసెంబర్ 31 వరకు వారు ఆధార్‌ను ఎన్రోల్ చేసుకుని, ఈ నెంబర్‌ను పొందాల్సి ఉంటుంది. -
పోస్టాఫీస్ వడ్డీ రేట్లపై సమీక్ష
న్యూఢిల్లీ : పోస్టాఫీస్ డిపాజిట్లు, పీపీఎఫ్ వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షించనున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. అయితే, ఈ క్రమంలో ఖాతాదారుల ప్రయోజనాలను పరిగణించి త గు నిర్ణయం తీసుకుంటామన్నారు. అధిక వడ్డీ రేటు ఇచ్చే ఈ తరహా పొదుపు పథకాలతో పోటీపడేందుకు తాము కూడా ఫిక్సిడ్ డిపాజిట్ స్కీములను ఆకర్షణీయంగా ఉంచేందుకు ఎక్కువ వడ్డీ రేట్లు ఇవ్వక తప్పడం లేదని, ఫలితంగా వ్యాపారంపై ప్రభావం పడుతోందని బ్యాంకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం చిన్న మొత్తాల డిపాజిట్లపై వడ్డీ రేట్లు 8.7-9.3% శ్రేణిలో ఉంటున్నాయి. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్(ఎంఐఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్, పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా వంటివి చిన్న మొత్తాల పొదుపు పథకాల కిందికి వస్తాయి. ప్రభుత్వ అండ ఉండే వీటిపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల.. వాటితో పోటీపడాల్సి వస్తుండటంతో ఆర్బీఐ రేట్లు తగ్గించినా ఆ ప్రయోజనాలను పూర్తిగా ఖాతాదారులకు బదలాయించలేకపోతున్నామనేది బ్యాంకుల వాదన