భారతీయులు ఎక్కువగా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో (fixed deposits) పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. రిస్క్ లేకుండా మంచి వడ్డీ వస్తుండటంతో ఎఫ్‌డీలు చాలా కాలంగా సామాన్యులకు ఇష్టమైన పెట్టుబడి ఎంపికగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బ్యాంకులతోపాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా ఆకర్షణీయమైన ఎఫ్‌డీ పథకాలను ప్రారంభిస్తున్నాయి.
ఈ క్రమంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) కూడా తాజాగా వివిధ టెన్యూర్‌లలో రెండు కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీములను (FD schemes) ప్రారంభించింది. 303 రోజులు, 506 రోజుల టెన్యూర్ ఉండే ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలలో రూ.3 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త 303 రోజుల వ్యవధి ఎఫ్‌డీలో డబ్బు డిపాజిట్ చేసే పెట్టుబడిదారులు 7 శాతం వడ్డీని పొందుతారు. అదేవిధంగా 506 రోజుల వ్యవధికి వడ్డీ రేటు 6.7 శాతం. ఈ కొత్త వడ్డీ రేట్లు 2025 జనవరి 1 నుండి అమలులోకి వచ్చాయి. సీనియర్ సిటిజన్‌లు, సూపర్ సీనియర్ సిటిజన్‌లు అయితే ఈ రెండు ఎఫ్‌డీలలో ఎక్కువ వడ్డీని పొందుతారు.
ఇదీ చదవండి: క్రెడిట్‌కార్డుతో పొరపాటున కూడా ఈ లావాదేవీలు చేయొద్దు.. చేశారో అంతే..!
సీనియర్ సిటిజన్‌లకు 303 రోజుల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 7.5 శాతం వడ్డీ, 506 రోజుల టెన్యూర్ ఎఫ్‌డీలపై 7.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 300 రోజుల వ్యవధి ఎఫ్‌డీలపై 7.85 శాతం, 506 రోజుల టెన్యూర్ ఎఫ్‌డీలపై 7.5 శాతం వడ్డీని బ్యాంక్
ఇస్తోంది.
ఇతర ఎఫ్‌డీలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఎఫ్‌డీ స్కీములను అందిస్తోంది. వీటిపై సాధారణ పౌరులకు వడ్డీ రేటు 3.50% నుండి 7.25% ఉంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 4% నుండి 7.75% వడ్డీని అందిస్తోంది. 400 రోజుల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై అత్యధికంగా సాధారణ పౌరులకు 7.25%, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీ రేటు లభిస్తోంది.
సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఉన్నఎఫ్‌డీలపై 4.30% నుండి 8.05% వడ్డీని అందిస్తోంది. వీరికి ప్రస్తుతం 400 రోజుల కాలవ్యవధి ఎఫ్‌డీలపై 8.05% వడ్డీని బ్యాంక్ చెల్లిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment