New schemes
-
ఎస్బీఐ రెండు కొత్త డిపాజిట్ పథకాలు
న్యూఢిల్లీ: డిపాజిట్‌దారుల కోసం ఎస్బీఐ రెండు వినూత్నమైన పథకాలను ప్రకటించింది. ఇందులో ఒకటి ‘హర్ ఘర్ లఖ్పతి’ కాగా, మరొకటి ‘ఎస్బీఐ పాట్రాన్స్’. ఇందులో హర్ ఘర్ లఖ్పతి పథకం కింద రూ.లక్ష లేదా అంతకుమించి రూ.లక్ష చొప్పున ఎంత వరకు అయిన సమకూర్చుకునేందుకు ఉద్దేశించిన రికరింగ్ డిపాజిట్ పథకం. ఆర్థిక లక్ష్యాల సాధనను ఈ పథకం సులభతరం చేస్తుందని, కస్టమర్లు ప్రణాళిక మేరకు పొదుపు చేసుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది. ‘ఎస్బీఐ పాట్రాన్స్’ అన్నది 80 ఏళ్లు, అంతకుమించి వయసున్న వృద్ధుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన టర్మ్ డిపాజిట్ పథకం. సాధారణంగా సీనియర్ సిటిజన్లకు ఆఫర్ చేసే రేటుపై అదనంగా 0.10% వడ్డీ రేటును ఈ పథకం కింద ప్రస్తుత డిపాజిటర్లతోపాటు, కొత్త టర్మ్ డిపాజిటర్లకు ఇవ్వనున్నట్టు ఎస్బీఐ తెలిపింది. ఇవి కస్టమర్ల ఆకాంక్షలను తీర్చడంతోపాటు అదనపు రాబడులను అందిస్తాయని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ప్రకటించారు. -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త డిపాజిట్ స్కీములు..
భారతీయులు ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లలో (fixed deposits) పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. రిస్క్ లేకుండా మంచి వడ్డీ వస్తుండటంతో ఎఫ్డీలు చాలా కాలంగా సామాన్యులకు ఇష్టమైన పెట్టుబడి ఎంపికగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బ్యాంకులతోపాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా ఆకర్షణీయమైన ఎఫ్డీ పథకాలను ప్రారంభిస్తున్నాయి.ఈ క్రమంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) కూడా తాజాగా వివిధ టెన్యూర్లలో రెండు కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ స్కీములను (FD schemes) ప్రారంభించింది. 303 రోజులు, 506 రోజుల టెన్యూర్ ఉండే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలలో రూ.3 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త 303 రోజుల వ్యవధి ఎఫ్డీలో డబ్బు డిపాజిట్ చేసే పెట్టుబడిదారులు 7 శాతం వడ్డీని పొందుతారు. అదేవిధంగా 506 రోజుల వ్యవధికి వడ్డీ రేటు 6.7 శాతం. ఈ కొత్త వడ్డీ రేట్లు 2025 జనవరి 1 నుండి అమలులోకి వచ్చాయి. సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లు అయితే ఈ రెండు ఎఫ్డీలలో ఎక్కువ వడ్డీని పొందుతారు.ఇదీ చదవండి: క్రెడిట్‌కార్డుతో పొరపాటున కూడా ఈ లావాదేవీలు చేయొద్దు.. చేశారో అంతే..!సీనియర్ సిటిజన్లకు 303 రోజుల వ్యవధి కలిగిన ఎఫ్డీలపై 7.5 శాతం వడ్డీ, 506 రోజుల టెన్యూర్ ఎఫ్డీలపై 7.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక సూపర్ సీనియర్ సిటిజన్లకు 300 రోజుల వ్యవధి ఎఫ్డీలపై 7.85 శాతం, 506 రోజుల టెన్యూర్ ఎఫ్డీలపై 7.5 శాతం వడ్డీని బ్యాంక్ ఇస్తోంది.ఇతర ఎఫ్డీలుపంజాబ్ నేషనల్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఎఫ్డీ స్కీములను అందిస్తోంది. వీటిపై సాధారణ పౌరులకు వడ్డీ రేటు 3.50% నుండి 7.25% ఉంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 4% నుండి 7.75% వడ్డీని అందిస్తోంది. 400 రోజుల వ్యవధి కలిగిన ఎఫ్డీలపై అత్యధికంగా సాధారణ పౌరులకు 7.25%, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీ రేటు లభిస్తోంది.సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ ఉన్నఎఫ్డీలపై 4.30% నుండి 8.05% వడ్డీని అందిస్తోంది. వీరికి ప్రస్తుతం 400 రోజుల కాలవ్యవధి ఎఫ్డీలపై 8.05% వడ్డీని బ్యాంక్ చెల్లిస్తోంది. -
ఈక్విటీ ఫండ్స్ అదే జోరు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆగస్ట్‌లోనూ తమ జోరు చూపించాయి. నికరంగా రూ.38,239 కోట్లను ఆకర్షించాయి. ముఖ్యంగా థీమ్యాటిక్ ఫండ్స్, కొత్త పథకాల (న్యూ ఫండ్ ఆఫర్లు/ఎన్‌ఎఫ్‌వోలు) రూపంలో ఎక్కువ పెట్టుబడులను సమీకరించాయి. ఈ ఏడాది జూలైలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచి్చన రూ.37,113 కోట్లతో పోల్చి చూస్తే 3.3 శాతం మేర ఆగస్ట్‌లో వృద్ధి నమోదైంది. జూన్‌లో వచి్చన రూ.40,608 కోట్ల పెట్టుబడులు ఇప్పటి వరకు నెలవారీ గరిష్ట రికార్డు కాగా, ఆగస్ట్‌లో పెట్టుబడులు రెండో గరిష్ట రికార్డుగా ఉన్నాయి. ఈ గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వ్యాప్తంగా అన్ని రకాల పథకాల్లోకి కలిపి ఆగస్ట్‌లో రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూలైలో ఇవి రూ.1.9 లక్షల కోట్లుగా ఉన్నాయి. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ జూలై చివరికి ఉన్న రూ.65 లక్షల కోట్ల నుంచి ఆగస్ట్ చివరికి రూ.66.7 లక్షల కోట్లకు చేరింది. కొత్త గరిష్టానికి సిప్ పెట్టుబడులు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా వచ్చే పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో రూ.23,547 కోట్లుగా నమోదయ్యాయి. జూలైలో ఇవి రూ.23,332 కోట్లుగా ఉన్నాయి. విభాగాల వారీగా పెట్టుబడులు.. → థీమ్యాటిక్ ఫండ్స్ (రంగాలు/ప్రత్యేక థీమ్‌లలో ఇన్వెస్ట్ చేసేవి) పథకాల్లోకి అత్యధికంగా రూ.18,117 కోట్లు వచ్చాయి. ఈ తరహా పథకాలు జూలైలో రూ.18,336 కోట్లు, జూన్‌లో రూ.22,352 కోట్ల చొప్పున ఆకర్షించడం గమనార్హం. → ఆగస్ట్‌లో ఆరు కొత్త పథకాలు ప్రారంభం కాగా, అందులో ఐదు సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ ఉన్నాయి. ఇవి రూ.10,202 కోట్లను సమీకరించాయి. → లార్జ్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,637 కోట్లు వచ్చాయి. మిడ్‌క్యాప్ పథకాలు రూ.3,055 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ.3,209 కోట్ల చొప్పున ఆకర్షించాయి. అన్ని రకాల పథకాల్లోకి పెట్టుబడుల రాక ఇన్వెస్టర్లలో మార్కెట్ల పట్ల ఉన్న సానుకూల ధోరణిని తెలియజేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. → ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక రూ.3,513 కోట్లుగా ఉంది. → కేవలం ఫోకస్డ్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. → డెట్ పథకాల్లోకి నికరంగా రూ.45,169 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూలైలో వచ్చిన రూ.1.2 లక్షల కోట్ల కంటే 62 శాతం తక్కువ. → డెట్‌లో ఓవర్‌నైట్ ఫండ్స్ అత్యధికంగా రూ.15,106 కోట్లను ఆకర్షించాయి. ఆ తర్వాత లిక్విడ్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. మొత్తం పెట్టుబడుల్లో 86 శాతం ఈ మూడు విభాగాల్లోని పథకాల్లోకే వచ్చాయి. → గోల్డ్ ఈటీఎఫ్‌లు రూ.1,611 కోట్లను ఆకర్షించాయి. జూలైలో వచ్చిన రూ.1,337 కోట్లతో పోల్చి చూస్తే 20 శాతానికి పైగా వృద్ధి కనిపిస్తోంది. → మొత్తం ఫోలియోలు (ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాలు) జూలై చివరకి ఉన్న 19.84 కోట్ల నుంచి ఆగస్ట్ చివరికి 20 కోట్ల మార్క్‌ను అధిగమించాయి. -
ప్యాసివ్ ఫండ్స్ బూమ్
న్యూఢిల్లీ: ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్స్) పథకాల పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతోంది. పనిలో పనిగా ఈ డిమాండ్‌ను సొంతం చేసుకునేందుకు ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) కొత్త పథకాలతో (ఎన్ఎఫ్వో) మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. యాక్టివ్‌గా నిర్వహించే ఈక్విటీ పథకాలు రాబడుల విషయంలో సూచీలతో వెనుకబడుతున్న తరుణంలో ప్యాసివ్ ఫండ్స్‌కు ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు నిదర్శనం.. గడిచిన ఏడు నెలల్లో (జనవరి–జూలై) 63 ప్యాసివ్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లోకి రావడమే. గతేడాది మొత్తం మీద 51 ప్యాసివ్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోల రికార్డును ఈ ఏడాది ఇప్పటికే అధిగమించడం గమనార్హం. ముఖ్యంగా ఈ నెలలో మార్కెట్లోకి 12 ఎన్‌ఎఫ్‌వోలు రాగా, అందులో సగం మేర ప్యాసివ్ ఫండ్స్ నుంచే ఉన్నాయి. జూలై చివరి నాటికి అత్యధికంగా టాటా మ్యూచువల్ ఫండ్ 10 ప్యాసివ్ ఫండ్ ఎన్‌ఎఫ్‌వోలను చేపట్టింది. హెచ్డీఎఫ్సీ ఏఎంసీ 5, మిరే అస్సెట్ మేనేజ్మెంట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చెరో నాలుగు చొప్పున ప్యాసివ్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోలను తీసుకొచ్చాయి. ప్యాసివ్ ఫండ్స్ పరిధిలోని ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 22 శాతం పెరిగి జూలై చివరికి 3.22 కోట్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో యాక్టివ్ ఫండ్స్ విభాగంలో ఫోలియోలు 19 శాతం పెరిగి 13.84 కోట్లుగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్యాసివ్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 24 శాతం వృద్ధితో రూ.10.95 లక్షల కోట్లకు చేరాయి. నెలవారీ ఈ పథకాల్లోకి వచ్చే పెట్టుబడులు ఈ ఏడాది జనవరిలో రూ.3,983 కోట్లుగా ఉండగా.. జూలైలో రూ.14,778 కోట్లకు వృద్ధి చెందడం, వీటి పట్ల ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తోంది.ప్రత్యామ్నాయాలపై దృష్టికొత్త పెట్టుబడులు ఆకర్షించేందుకు మ్యూచువల్ ఫండ్స్ వినూత్న మార్గాలపై దృష్టి సారించాయి. సంప్రదాయ పథకాల పరంగా ఇప్పటికే తగినంత మార్కెట్ ఏర్పడడంతో.. కొత్త పెట్టుబడుల ఆకర్షణ దిశగా ఇన్వెస్టర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా ఫండ్స్ సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. యాక్టివ్ పథకాలు ఇప్పటికే తగినంతగా మార్కెట్లో ఉండడంతో, ప్రముఖ ఏఎంసీలు ప్యాసివ్, థీమ్యాటిక్ ఎన్‌ఎఫ్‌వోల బాట పట్టినట్టు మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా డైరెక్టర్ కౌస్తభ్ బేల్‌పుర్కార్ తెలిపారు. ప్యాసివ్, యాక్టివ్ ఫండ్స్ మధ్య అంతరాన్ని భర్తీ చేసే విధంగా స్మార్ట్ బీటా తదితర వినూత్నమైన విధానాలను కొత్త ప్యాసివ్ ఫండ్స్ విషయంలో ఏఎంసీలు అమలు చేస్తున్నాయి. స్మార్ట్ బీటా అంటే.. ఆయా ప్యాసివ్ ఫండ్ ఒక సూచీని అనుసరించి పెట్టుబడులు పెట్టినప్పటికీ.. రాబడుల్లో మార్కెట్‌ను అధిగమించేలా ఉంటుంది. ఈ తరహా ప్యాసివ్ ఫండ్ వ్యూహాల్లో ‘ఈక్వల్ వెయిట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండెక్స్’ ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకర్షిస్తోంది. నిఫ్టీ సూచీలో టాప్–10లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, తక్కువ రిస్క్‌తో కూడిన రాబడులు ఆఫర్ చేసే విధానానికీ ప్రాచుర్యం పెరుగుతోంది. మొత్తానికి ప్యాసివ్ ఫండ్స్ రూపంలో మెరుగైన రాబడులు ఆఫర్ చేయడం ద్వారా ఇన్వెస్టర్ల ఆదరణ సొంతం చేసుకునే దిశగా ఏఎంసీలు ప్రయతి్నస్తుండడం గమనార్హం. -
మహిళలకు శుభవార్త.. బ్యాంకుల్లో ప్రత్యేక స్కీమ్స్!
ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) మహిళల కోసం, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ ఫౌండర్ల కోసం త్వరలోనే ప్రత్యేక ఆర్థిక పథకాలను ప్రారంభించనున్నాయి.ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ (ఈఎస్ఈ 7.0) సంస్కరణల ఎజెండాలో భాగంగా మహిళా కస్టమర్లకు మద్దతు ఇచ్చే వ్యూహాన్ని రూపొందించాలని ఆర్థిక సేవల విభాగం బ్యాంకులను కోరినట్లు ‘లైవ్ మింట్’ కథనం పేర్కొంది. ఈఎస్ఈ 7.0 రిస్క్‌ను అంచనా వేయడం, నిరర్థక ఆస్తుల నిర్వహణ, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, కస్టమర్ సర్వీస్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై దృష్టి పెడుతుంది.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 31.2 కోట్ల మంది మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటు వేశారని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏకు ఎక్కువ మంది మహిళలు ఓటేశారని సర్వేలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల ద్వారా మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చే ప్రత్యేక పథకాలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది.మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక బ్యాంకింగ్ సేవలు, తమ వెంచర్లకు ఆర్థిక సహాయం కోరుకునే వారికి 'లోన్ మేళాలు' వంటివి తాజా ఈఎస్ఈ సంస్కరణల్లో ఉన్నాయి. మహిళా వ్యవస్థాపకులను స్టార్టప్ ఇంక్యుబేటర్లతో అనుసంధానం చేసి వారి వెంచర్లను విస్తరించడానికి సహాయపడే కార్యక్రమాలను కూడా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా నిర్వహించున్నారు. అయితే ఆర్థిక శాఖ నుంచి దీనిపై స్పందన రాలేదు. -
మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాల వెల్లువ
న్యూఢిల్లీ: అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు) గతేడాది నూతన పథకాల రూపంలో ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధులు సమీకరించాయి. మొత్తం 212 న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో)లు 2023లో మార్కెట్లోకి వచ్చాయి. ఇవి సంయుక్తంగా రూ.63,854 కోట్లను సమీకరించాయి. అంతకుముందు ఏడాది (2022) కూడా 228 ఎన్‌ఎఫ్‌వోలు రూ.62,817 కోట్లు సమీకరించడం గమనార్హం. ఇక 2021లో రూ.99,704 కోట్లు, 2020లో రూ.53,703 కోట్ల చొప్పున కొత్త పథకాల ద్వారా సమీకరించాయి. ఈ వివరాలను ఫైయర్స్ రీసెర్చ్ విడుదల చేసింది. ‘‘వినియోగం విషయంలో మారుతున్న ధోరణి, అధిక ప్రమాణాలతో కూడిన జీవన అవసరాల నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టడాన్ని గుర్తిస్తున్నారు. అత్యవసర సమయాలను గట్టేక్కేందుకు తగినంత నిధి, ఆర్థిక ప్రణాళిక అవసరాన్ని కరోనా మహమ్మారి తెలియజేసింది’’అని ఫైయర్స్ రీసెర్చ్ తన నివేదికలో తెలిపింది. బలమైన ఆర్థిక కార్యకలాపాలు, స్థిరమైన జీఎస్టీ వసూళ్లు, ప్రభుత్వ సంస్కరణలతో సూచీలు గతేడాది మంచి పనితీరు చూపించినప్పటికీ, 2024లోనూ అదే మాదిరి పనితీరు ఆశించరాదని పేర్కొంది. మార్కెట్ విలువలు ఖరీదుగా మారిన తరుణంలో అప్రమత్తత అవసరమని ఇన్వెస్టర్లకు సూచించింది. పెరిగిన రిస్క్ ధోరణి.. 2023 జనవరి–మార్చి కాలంలో అత్యధికంగా 57 ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లోకి వచ్చాయి. జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో అత్యధికంగా రూ.22,049 కోట్లను ఎన్‌ఎఫ్‌వోలు సమీకరించాయి. 2023లో 29 థీమాటిక్/సెక్టోరల్ ఫండ్స్ (ఎన్‌ఎఫ్‌వోలు) రూ.17,946 కోట్లను ఆకర్షించాయి. ఈక్విటీల విషయంలో ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే ధోరణి పెరగడంతో వారు థీమాటిక్/సెక్టోరల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మార్కెట్ ర్యాలీ సమయంలో ఎన్‌ఎఫ్‌వోలు ఎక్కువగా వస్తుంటాయి. సానుకూల సెంటిమెంట్ నేపథ్యంలో అధిక పెట్టుబడులను సులభంగా సమీకరించొచ్చని అలా చేస్తుంటాయి. స్టాక్ మార్కెట్ మెరుగైన పనితీరుకు తోడు, ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంట్ గతేడాది భారీగా ఎన్‌ఎఫ్‌వోలు నిధులు సమీకరించడానికి తోడ్పడినట్టు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 2023లో నిఫ్టీ–50 సూచీ 20 శాతం రాబడులను ఇచి్చంది. ఇక నిఫ్టీ మిడ్‌క్యాప్ అయితే 47 శాతం, స్మాల్‌క్యాప్ 56 శాతం చొప్పున ర్యాలీ చేయడం గమనార్హం. గతేడాది దేశీయ ఇనిస్టిట్యూషన్స్ రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడులతో ఈక్విటీల ర్యాలీలో ముఖ్యపాత్ర పోషించాయి. గతేడాది మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ రూ.2.74 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 2022లో వచి్చన రూ.71,000 కోట్లతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా వచ్చాయి. -
Interim Budget 2024: బయో–ఫౌండ్రీకి స్కీము
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల చర్యల్లో భాగంగా త్వరలో బయో–తయారీ, బయో–ఫౌండ్రీ కోసం కొత్తగా స్కీమును ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బయో–ఫార్మా, బయో–ప్లాస్టిక్స్, బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ మొదలైన వాటికి ఇది ఊతమివ్వనుంది. ప్రపంచ ఎకానమీని మార్చేయగలిగే సత్తా ఈ స్కీముకు ఉంటుందని కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్‌ను సాకారం చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యానికి ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. 2014లో కేవలం 10 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ బయో ఆర్థిక వ్యవస్థ గడిచిన ఎనిమిది, తొమ్మిదేళ్లలో 140 బిలియన్ డాలర్లకు చేరిందని సింగ్ చెప్పారు. -
ఫండ్స్ కొత్త పథకాల జోరు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో నూతన పథకాలు (ఎన్ఎఫ్వో) సెపె్టంబర్ త్రైమాసికంలో పెద్ద మొత్తంలో నిధుల సమీకరించాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 48 ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లోకి వచ్చాయి. ఇవన్నీ కలసి ఇన్వెస్టర్ల నుంచి రూ.22,049 కోట్ల నిధులను సమీకరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కేవలం 25 కొత్త పథకాలు రాగా, అవి వసూలు చేసిన మొత్తం రూ.5,539 కోట్లుగానే ఉంది. దీంతో పోలిస్తే సెపె్టంబర్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. సాధారణంగా మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడు, బుల్లిష్ సెంటిమెంట్‌ను అనుకూలంగా భావించి ఎన్‌ఎఫ్‌వోలు ఎక్కువగా వస్తుంటాయి. -
మేనిఫెస్టోలో చెప్పినవీ, చెప్పనివీ అమలు చేశాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవతరణ సమయంలో తెలంగాణ అత్యంత సంక్లిష్ట పరిస్థితిలో ఉండేదని, ఆర్థికవేత్తల సాయంతో రాష్ట్ర పరిస్థితిపై లోతుగా మదింపు చేసుకుని ప్రయాణాన్ని ప్రారంభించా మని భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలలో చేర్చిన హామీలు కేవలం పది శాతమేనని.. ప్రజల అవసరాలు, స్వీయ అనుభవం ఆధారంగా మరో 90% కొత్త పథకాలను అమలు చేశామన్నారు. కేసీఆర్ ఆదివారం తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పేదలకు పెంచాలన్నదే తమ విధానమని.. మళ్లీ అధికారంలోకి వచి్చన ఆరు నెలల్లోనే హామీ లన్నింటినీ అమలు చేస్తా మని ప్రకటించారు. గతంలో మేనిఫెస్టో చెప్పినవీ, చెప్పనివీ కలిపి 99.9 % హామీలను నెరవేర్చామని చెప్పారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల సంక్షేమం లక్ష్యంగా పనిచేశామన్నారు. దళిత బంధు ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం, గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా మార్చడం, పోడు భూముల పట్టాలు, గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు వంటివి అమలు చేశామన్నారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టిన బీసీ బంధు వంటి కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. చేపలు, గొర్రెల పెంపకంలో తెలంగాణ నంబర్ వన్ స్థానానికి ఎదిగిందన్నారు. ఉత్తమ వ్యవసాయ, తాగునీరు, విద్యుత్, సాగునీరు, దళిత, సంక్షేమ, విద్య, ఆరోగ్య, పారిశ్రామిక, గృహ నిర్మాణ పాలసీలను రూపొందించుకున్నామని చెప్పారు. వ్యవసాయ రంగంలో దేశానికే తలమానికంగా ఎదిగామని పేర్కొన్నారు. ప్రస్తుత విధానాలను కొనసాగిస్తూనే ‘సందర్భోచిత ఉద్దీపన’తో ముందుకు సాగుతామని ప్రకటించారు. ఏపీలో పెన్షన్ల తీరు బాగుంది ప్రస్తుతం తెలంగాణలో ఇస్తున్న ఆసరా పెన్షన్ రూ.2,016ను దశల వారీగా పెంచి రూ.5 వేలకు చేర్చుతామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పెన్షన్ల తీరు బాగుందన్నారు. పేదలకు పెన్షన్‌ను క్రమంగా పెంచుతూ ప్రతీ నెలా రూ.3 వేల చొప్పు న అందించే పథకాన్ని ఏపీ విజయవంతంగా అమలు చేస్తోందని కితాబునిచ్చారు. -
నిధుల సమీకరణలో కొత్త పథకాలు డీలా..! మొదటి ఆరు నెల్లలో రూ.25,712 కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ నూతన పథకాల ద్వారా (ఎన్ఎఫ్వో) నిధుల సమీకరణ ఈ ఏడాది అనుకున్నంత ఆశాజనకంగా లేదు. మొదటి ఆరు నెలల్లో (జనవరి–జూన్) ఎన్‌ఎఫ్‌వోల రూపంలో సమీకరించిన నిధులు రూ.25,712 కోట్లుగా ఉన్నా యి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఎన్‌ఎఫ్‌వోలు సమీకరించిన రూ.38,929 కోట్లతో పోలిస్తే 34 శాతం తగ్గాయి. ఈక్విటీ, డెట్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితులు ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. ఒకే విభాగంలో ఒకటికి మించిన పథకాలు ఆవిష్కరించకూడదంటూ సెబీ విధించిన ఆంక్షలు పెద్ద మ్యూచువల్ ఫండ్స్ సంస్థలపై ప్రభావం చూపించింది. జనవరి నుంచి జూన్ వరకు మొత్తం 115 ఎన్‌ఎఫ్‌వోలు నిధుల సమీకరణ కోసం మార్కెట్లోకి వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన 160 ఎన్ఎఫ్వోలతో పోలిస్తే క్షీణత కనిపిస్తోంది. ఈక్విటీ ఫండ్స్ జనవరి నుంచి జూన్ వరకు ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలు రూ.14,917 కోట్లు సమీకరించాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈక్విటీ కొత్త పథకాలు సమీకరించిన రూ.16,370 కోట్లతో పోలిస్తే 9 శాతం క్షీణత కనిపిస్తోంది. మొత్తం నూతన పథకాల ఆవిష్కరణ కూడా క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 22 నుంచి 17కు పరిమితమయ్యాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ, దేశీ ఈక్విటీలు అదే పనిగా పెరుగుతూ వెళుతుండడంతో చాలా మంది ఇన్వెస్టర్లు నూతన పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి బదులు, ఇప్పటికే ఉన్న పెట్టుబడులపై లాభాల స్వీకరణకు మొగ్గు చూపి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెద్ద మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు రిస్క్‌తో కూడిన థీమ్యాటిక్ పథకాల ఆవిష్కరణకు మొగ్గు చూపించారు. హైబ్రిడ్ ఫండ్స్ హైబ్రిడ్ (ఈక్విటీ, డెట్ కలిసిన) న్యూ ఫండ్ ఆఫర్ల రూపంలో సమీకరించిన నిధులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 22 శాతం తగ్గి, రూ.2,141 కోట్లుగా ఉన్నాయి. డెట్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోలపై ప్రభావం ఎక్కువగా పడింది. ఇవి రూ.6,235 కోట్లను రాబట్టాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో డెట్ ఎన్ఎఫ్వోల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.12,649 కోట్లుగా ఉన్నాయి. డెట్ ఎన్‌ఎఫ్‌వోల సంఖ్య 51 నుంచి 38కి తగ్గింది. ఇక ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్) విభాగంలోనూ ఎన్‌ఎఫ్‌వోల నిధుల సమీకరణ 66 శాతం క్షీణించి రూ.2,419 కోట్లుగా ఉంది. ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని (ద్రవ్యోల్బణం మినహాయింపు) ఎత్తివేయడం డెట్ ఫండ్స్ సమీకరణపై ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో ప్యాసివ్ లిక్విడ్, గిల్ట్ ఫండ్స్, టార్గెట్ మెచ్యూరిటీ పథకాలు ఆకర్షణ కోల్పోయాయి. మారిన పరిస్థితులు.. ఈ పరిణామంపై నిప్పన్ ఇండియా మ్యూ చువల్ ఫండ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సౌగతా ఛటర్జీ స్పందిస్తూ.. ‘‘కొత్తగా ప్రవేశించిన సంస్థలు మిన హాయిస్తే చాలా వరకు ఫండ్‌హౌస్‌ల ఉత్పత్తుల ఆఫర్ అనేది పరిమితికి చేరింది. దీంతో కొన్ని థీమ్యాటిక్ ఫండ్స్‌తో మార్కెట్లోకి వస్తున్నాయి. నిప్పన్ మ్యూచువల్ ఫండ్ మాత్రం ఎన్‌ఎఫ్‌వోల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇన్వెస్టర్లకు వినూత్న మైన ప్రతిపాదనలు ఉన్నాయని అనిపించినప్పుడే కొత్త పథకాలను తీసుకొస్తోంది. గడిచిన రెండేళ్లలో రెండే పథకాలను ఆవిష్కరించాం’’అని సౌగతా ఛటర్జీ తెలిపారు. ఇన్వెస్టర్లు కొత్త పథకాల్లో యూనిట్ ఎన్ ఏవీ రూ.10కే లభిస్తుందన్న ఉద్దేశ్యంతో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుంటారని స్మార్ట్ వెల్త్ అడ్వైజర్స్ సీఈవో రమేశ్ పవార్ తెలిపారు. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను ఇన్వెస్ట్ చేసినప్పు డే యూ నిట్ల అసలు విలువ ప్రతిఫలిస్తుందన్నారు. పెద్ద సంస్థలు కాకుండా కొత్తగా ప్రవేశించిన సంస్థలు తెచ్చే ఎన్‌ఎఫ్‌వోలకు స్పందన పెద్దగా ఉండడం లేద మరోవైపు తక్షణ లాభాల కోసం ఇన్వెస్టర్లు ఐపీవోల పట్ల మొగ్గు చూపిస్తున్నట్టు చెప్పారు. -
కొత్త ఫండ్ పథకాల వసూళ్లు తగ్గాయ్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాల (ఎన్ఎఫ్వో) రూపంలో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల సమీకరణ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 42 శాతం తగ్గిపోయింది. మొత్తం 253 ఎన్‌ఎఫ్‌వోల ద్వారా ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) మొత్తం రూ.62,342 కోట్ల పెట్టుబడులను సమీకరించాయి. 2021–22లో మ్యూచువల్ ఫండ్స్ 176 ఎన్ఎఫ్వో ల రూపంలో సమీకరించిన మొత్తం రూ.1,07,896 కోట్లుగా ఉండడం గమనించొచ్చు. 2021–22తో పోలిస్తే గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ఎన్‌ఎఫ్‌వోలు వచ్చినప్పటికీ, సమీకరించిన మొత్తం తగ్గడం కనిపిస్తోంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ఇప్పటికి 12 ఎన్‌ఎఫ్‌వోలను ఫండ్స్ సంస్థలు తీసుకొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఎన్‌ఎఫ్‌వోలలో ప్యాసివ్ ఫండ్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్ ఎక్కువగా ఉన్నాయి. 182 ఓపెన్ ఎండె డ్ పథకాలు కాగా, 71 క్లోజ్ ఎండెడ్ పథకాలు న్నాయి. సాధారణంగా బుల్ మార్కెట్లలో ఎక్కువ ఎన్‌ఎఫ్‌వోలు వస్తుంటాయి. ఆ సమయంలో మార్కెట్ల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న సానుకూల సెంటిమెంట్ ఆధారంగా నిధులు సమీకరించడం ఏఎంసీ లకు సులభం అవుతుంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సెబీ కొత్త పథకాలను చేపట్టొద్దంటూ మూడు నెలల పాటు నిషేధం విధించడాన్ని గమనించాలి. ఇది కూడా ఎన్‌ఎఫ్‌వోల సంఖ్యపై ప్రభా వం చూపించింది. ఇక 2020–21లో 84 నూతన పథకాల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు రూ.42,038 కోట్లను ఆకర్షించాయి. ‘‘ఇన్వెస్టర్లు ఏదైనా కొత్త పథకం వినూత్నంగా ఉన్నప్పుడు, తమ పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం పరంగా అంతరా న్ని భర్తీ చేస్తుందని భావించినప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి పనితీరుతో కూడిన పథకాల్లో పెట్టుబడులు కొనసాగించుకోవాలి’’అని మార్నింగ్‌స్టార్ రీసెర్చ్ మేనేజర్ కౌస్తభ్ బేలపుర్కార్ సూచించారు. అన్ని కొత్త పథకాలు ఒక్కటే కాదని, వాటి ల్లోని అనుకూల, ప్రతికూలతలను చూసి పెట్టుబడు ల నిర్ణయం తీసుకోవడం సుముచితమని ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి పేర్కొన్నారు. -
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్.. ఒకే ప్లాన్‌లో అధిక ప్రయోజనాలు
హైదరాబాద్: రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ‘రిలయన్స్ హెల్త్ ఇన్ఫినిటీ’ పేరుతో ప్రీమియం ఉత్పత్తిని విడుదల చేసింది. ఈ ప్లాన్‌లో అపరిమిత కవరేజీ సదుపాయం ఉంటుందని సంస్థ తెలిపింది. రూ.5 కోట్ల వరకు కవరేజీ తీసుకోవచ్చని, మేటరి్నటీ కవరేజీ, అంతర్జాతీయ కవరేజీ, అపరిమిత రీస్టోరేషన్ (సమ్ ఇన్సూరెన్స్ అయిపోతే పునరుద్ధరించడం), 15 వరకు యాడాన్ ప్రయోజనాలు ఉన్నట్టు సంస్థ ప్రకటించింది. ఆర్థికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న వారికి రివార్డులు ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. మెరుగైన క్రెడిట్ స్కోర్ కలిగిన వారికి, శారీరక వ్యాయామాలతో ఆరోగ్యకర బీఎంఐను నిర్వహిస్తున్న వారికి రివార్డులు అందించనుంది. ఓపీడీ కన్సల్టేషన్ చార్జీలకు సైతం కవరేజీ ఉంది. అలాగే, ఒక్కటే క్లెయిమ్ సమ్ ఇన్సూరెన్స్ దాటినప్పుడు నూరు శాతం అదనపు కవరేజీ లభిస్తుంది. హాస్పిటల్ రూమ్‌ల విషయంలో పరిమితులు కూడా లేవు. -
ఇక కొత్త పథకాల జోరు.. ముగిసిన మూడు నెలల నిషేధం
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాలు ఇక మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. కొత్త పథకాల ఆరంభంపై సెబీ విధించిన మూడు నెలల నిషేధం ముగిసిపోయింది. దీంతో అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఫండ్స్ సంస్థలు) కొత్త పథకాలను (ఎన్‌ఎఫ్‌వోలు) ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒక్క జూలైలోనే 28 పథకాలను కంపెనీలు ప్రారంభించాయి. ఈక్విటీ, డెట్, ఇండెక్స్, ఈటీఎఫ్‌ల విభాగాల్లో వీటిని తీసుకొచ్చాయి. ఇన్వెస్టర్ల నిధుల పూలింగ్ విషయంలో తాను తీసుకొచ్చిన నిబంధనలను జూలై 1 నాటికి అమలు చేయాలని ఆదేశిస్తూ.. అప్పటి వరకు కొత్త పథకాలు ప్రారంభిచొద్దని ఈ ఏడాది ఏప్రిల్‌లో సెబీ ఆదేశించింది. జూలై 1తో నిషేధం ముగిసిపోయింది. పెట్టుబడుల ఉపసంహరణ సమయంలో డ్యుయల్ అథెంటికేషన్, ఖాతా మూలాలను గుర్తించాలని కూడా సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు కొత్త నిబంధనలు తెచ్చింది. జూలైలో 28 ఎన్‌ఎఫ్‌వోలు జూలైలో 18 ఏఎంసీలు కలసి 28 కొత్త పథకాలను ప్రారంభించాయి. ఇందులో నాలుగు పథకాలు ముగిసిపోగా, 24 పథకాలు ఇంకా పెట్టుబడుల స్వీకరణలో ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, బరోడా బీఎన్పీ పారిబాస్, కెనరా రొబెకో, డీఎస్పీ, మోతీలాల్ ఓస్వాల్, ఐడీఎఫ్సీ, మిరే అస్సెట్ నుంచి ఈ పథకాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ప్రారంభమైన పథకాల్లో చాలా వరకు సెబీ విధించిన మూడు నెలల నిషేధానికి ముందే అనుమతి పొందినవిగా ఆనంద్‌రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ హెడ్ అమర్ రాను తెలిపారు. ప్యాసివ్ విభాగంలో పథకాలు లేకపోతే వాటా కోల్పోతామన్న ఉద్దేశ్యంతో.. ఏఎంసీలు ప్యాసివ్ ఇండెక్స్ పథకాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. యాక్టివ్ నిర్వహణతో కూడిన ఈక్విటీ పథకాల్లో మంచి రాబడులు లేకపోవడంతో.. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కొంత పెట్టుబడులను ప్యాసివ్ పథకాలకు మళ్లిస్తున్నట్టు అమర్‌రాను వెల్లడించారు. ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నుంచి ఈటీఎఫ్‌లకు ఆసక్తి పెరిగినట్టు మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. 176 కొత్త పథకాలు.. 2021–22లో ఏఎంసీలు 176 కొత్త పథకాలను ఆవిష్కరించి, వీటి రూపంలో రూ.1.08 లక్షల కోట్లను ఇన్వెస్టర్ల నుంచి సమీకరించాయి. అంటే సగటున ఒక్కో నెలలో 15 పథకాలు ప్రారంభమయ్యాయి. 2020–21లో 84 కొత్త పథకాలు రాగా, అవి రూ.42,038 కోట్లను ఆకర్షించాయి. రానున్న రోజుల్లో మరిన్ని నూతన పథకాలు ఇన్వెస్టర్ల ముందుకు వస్తాయని, వీటిల్లో డెట్, ఈక్విటీ విభాగం నుంచి ప్యాసివ్ (ఇండెక్స్‌ల్లో) స్ట్రాటజీతో ఉంటాయని ఎపిస్లాన్ మనీ మార్ట్ ప్రొడక్ట్స్ హెడ్ నితిన్‌రావు చెప్పారు. -
ఫార్మా ఎంఎస్ఎంఈలకు కొత్త పథకాలు
న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి (ఎంఎస్ఎంఈ) కంపెనీలను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర సర్కారు మూడు కొత్త పథకాలను గురువారం ప్రారంభించింది. ఈ వివరాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి మన్సుఖ్ మాండవీయ మీడియాకు తెలిపారు. టెక్నాలజీ నవీకరణ, ఫార్మా ఎంఎస్ఎంఈ క్లస్టర్ల వద్ద ఉమ్మడి పరిశోధన కేంద్రాలు, వ్యర్థాల శుద్ధి కర్మాగాలను ఈ పథకాల కింద ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. చిన్న కంపెనీలు అయినా కానీ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తమ కేంద్రాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ‘‘ఈ పథకాల నుంచి ఫార్మా రంగం ఎంతో ప్రయోజనం పొందుతుంది. దీర్ఘకాలంలో భారత ఫార్మా పరిశ్రమ మరింత బలోపేతంగా, భవిష్యత్తుకు సన్నద్ధంగా, స్వావలంబన సాధిస్తుంది’’అని మాండవీయ అన్నారు. ఫార్మా ఎంఎస్ఎంఈ యూనిట్లు టెక్నాలజీ నవీకరణకు వడ్డీ సబ్సిడీతో కూడిన రుణాలను పొందొచ్చు. ఉమ్మడి పరిశోధన, టెస్టింగ్ కేంద్రాల ఏర్పాటుకు రూ.20 కోట్ల వరకు లభిస్తుంది. సిడ్బీ ఈ పథకాల అమలుకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తుంది. రూ.10 కోట్ల వరకు తీసుకునే రుణాలకు 10 శాతం క్యాపిటల్ సబ్సిడీ కూడా లభిస్తుంది. మూడేళ్ల కాల వ్యవధికి తీసుకోవచ్చు. ఫార్మా క్లస్టర్లలో సదుపాయాల అభివృద్ధికి చేపట్టే ప్రాజెక్టు వ్యయంలో 70 శాతాన్ని (రూ.20 కోట్ల వరకు) కేంద్రం సమకూరుస్తుంది. -
జూలై నుంచి మరిన్ని కొత్త ఫండ్స్
న్యూఢిల్లీ: ఆస్తుల నిర్వహణ కంపెనీలు(ఏఎంసీ)లు తాత్కాలిక నిలిపివేత తదుపరి తిరిగి కొత్త బ్రాండ్ మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)ను ఆవిష్కరించే సన్నాహాల్లో ఉన్నాయి. వచ్చే నెల(జూలై) నుంచి కొత్త ఫండ్ ఆఫర్ల(ఎన్‌ఎఫ్‌వోలు)కు తెరతీయనున్నాయి. ఎన్‌ఎఫ్‌వోలపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మూడు నెలలపాటు విధించిన ఆంక్షలు ఈ నెల(జూన్)తో ముగియనున్నాయి. దీంతో ఫిక్స్డ్ ఇన్కమ్, ఈక్విటీ సంబంధ ప్యాసివ్ ఫండ్స్‌ను ప్రవేశపెట్టేందుకు ఏఎంసీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. వీటితోపాటు నూతన ప్రొడక్టుల అవసరమున్న కొన్ని విభాగాలపైనా దృష్టిసారించాయి. జూలై 1నుంచి స్టాక్ బ్రోకర్లు, క్లియరింగ్ సభ్యులు ఏవిధంగానైనా ఇన్వెస్టర్ల ఫండ్స్‌ను, యూనిట్లనూ సమీకృతం(పూలింగ్) చేయడాన్ని సెబీ ఏప్రిల్ 1నుంచి నిషేధించింది. అంతేకాకుండా ఎంఎఫ్ పెట్టుబడుల అడ్వయిజర్లు లేదా పంపిణీదారులు ఫండ్స్ లావాదేవీలను చేపట్టడానికి సైతం చెక్ పెట్టింది. ఇందుకు సంబంధించిన నిర్వహణా సామర్థ్య పెంపునకు వీలుగా పరిశ్రమ ప్రతినిధులతో చర్చల అనంతరం సెబీ జూలై 1వరకూ గడువును పొడిగించింది. తద్వారా ఎంఎఫ్‌లు సబ్స్క్రిప్షన్లు, రిడెంపన్షన్లు వంటివి చేపట్టడంలో వ్యవస్థలను మరింత సమర్ధవంతంగా పనిచేసేందుకు వీలుగా మెరుగుపరచుకునేందుకు వీలు చిక్కింది. వెరసి పూల్ అకౌంట్ల విషయంలో ఆధునీకరించిన వ్యవస్థాగత మార్పులను ప్రవేశపెట్టేందుకు ఏఎంసీలకు సెబీ జూలై 1వరకూ గడువిచ్చింది. గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ నెలలో ఇప్పటికే కనీసం ఆరు ఏఎంసీలు ఎన్‌ఎఫ్‌వోలను ఆవిష్కరించేందుకు సెబీకి దరఖాస్తు చేశాయి. ఈ జాబితాలోని ఎంఎఫ్‌లలో పీజీఐఎం ఇండియా, సుందరం, బరోడా బీఎన్పీ పరిబాస్, ఎల్ఐసీ, ఫ్రాంక్లిన్ ఇండియా చేరాయి. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) ఇప్పటివరకూ నాలుగు ఎన్‌ఎఫ్‌వోలు మాత్రమే విడుదలకాగా.. రూ. 3,307 కోట్ల పెట్టుబడులు సమీకరించాయి. -
నూతన పథకాల వరద
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) గడిచిన ఆర్థిక సంవత్సరంలో 176 నూతన పథకాలను (ఎన్ఎఫ్వో) ఆవిష్కరిం చాయి. వీటి రూపంలో రూ.1.07,896 కోట్లను ఇన్వెస్టర్ల నుంచి అవి సమీకరించాయి. దాదాపు అన్ని కేటగిరీల్లో ఏఎంసీలు గత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలను ప్రారంభించాయి. 2020–21 సంవత్సరంలో ఏఎంసీలు 84 కొత్త పథకాల రూపంలో రూ.42,038 కోట్లను ఆకర్షించాయి. వీటితో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాల ఆవిష్కరణ రెట్టింపు కాగా.. సమీకరించిన మొత్తం ఒకటిన్నర రెట్లు ఉన్నట్టు తెలుస్తోంది. పరిస్థితులు భిన్నం.. సాధారణంగా మార్కెట్లు ర్యాలీ చేస్తున్నప్పుడు, బుల్లిష్ సెంటిమెంట్ ఉన్నప్పుడు ఏఎంసీలు కొత్త పథకాలు తీసుకొస్తుంటాయి. దీనివల్ల నిధుల సమీకరణ వాటికి సులభంగా ఉంటుంది. 2020 మార్కెట్ క్రాష్ తర్వాత మళ్లీ పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగడం.. ఏఎంసీలకు కలిసొచ్చింది. దీంతో అవి పెద్ద మొత్తంలో పథకాలను తీసుకొచ్చాయి. మరోవైపు ఇన్వెస్టర్లకు సానుకూలించే కొన్ని చర్యలను కూడా సెబీ అమల్లోకి తీసుకురావడం గురించి చెప్పుకోవాలి. ఎగ్జిట్ లోడ్‌ను తీసేసింది. ఎక్స్పెన్స్ రేషియోపై పరిమితులు విధించింది. పథకాల విభాగాల్లో పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఫ్లెక్సీక్యాప్ తదితర కొత్త విభాగాలను ప్రవేశపెట్టింది. ఇన్వెస్టర్లలో అవగాహన పెంచే చర్యలను కూడా అమలు చేసింది. ఇవి కూడా అనుకూలించినట్టు చెప్పుకోవాలి. దీర్ఘకాల పెట్టుబడుల విధానం, సెబీ, యాంఫి తీసుకున్న చర్యలు విభిన్న విభాగాల్లో పెద్ద ఎత్తున ఎన్‌ఎఫ్‌వోల ప్రారంభానికి దారితీసినట్టు ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి చెప్పారు. ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎక్కువ ఎక్కువగా ఇండెక్స్, ఈటీఎఫ్ విభాగాల్లో ఎన్‌ఎఫ్‌వోలు వచ్చాయి. ఇండెక్స్ ఫండ్ విభాగంలో 49 కొత్త పథకాలను ఏఎంసీలు ప్రారంభించాయి. ఇవి రూ.10,629 కోట్లు సమీకరించాయి. ఈటీఎఫ్ విభాగంలో 34 ఎన్‌ఎఫ్‌వోలు రూ.7,619 కోట్లు, ఫిక్స్డ్ టర్మ్ ప్లాన్ల విభాగంలో 32 కొత్త పథకాలు రూ.5,751 కోట్లు సమీకరించాయి. విదేశీ ఫండ్స్ రూపంలో రూ.5,218 కోట్లు, 11 సెక్టోరల్ లేదా థీమ్యాటిక్ ఫండ్స్ రూపంలో రూ.9,127 కోట్లు ఇన్వెస్టర్ల నుంచి ఆకర్షించాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ఇప్పటి వరకు నాలుగు ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లోకి రాగా, ఇవి రూ.3,307 కోట్లు సమీకరించాయి. మార్కెట్లో లిక్విడిటీ తగ్గుతుండడం, వడ్డీ రేట్ల పెరుగుదల క్రమంలో స్టాక్ మార్కెట్లలో దిద్దుబాటు, స్థిరీకరణ చూస్తూనే ఉన్నాం. దీనికితోడు ఇంటి నుంచి పనికి బదులు తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిన పరిస్థితులతో ఇక మీదట ఎన్‌ఎఫ్‌వోలకు ఆదరణ తగ్గొచ్చని ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు (ఎఫ్ఎంపీలు) విభాగంలో పథకాల ఆవిష్కరణ ఎక్కువగా ఉండొచ్చని చెప్పారు. -
ఆర్బీఐ నూతన పథకాలను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
ఆర్బీఐ నూతన పథకాలను ప్రారంభించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఆర్బీఐ నూతనంగా తీసుకొచ్చిన రెండు పథకాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి సమయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో రిజర్వ్ బ్యాంక్ పనిచేసిన విధానాన్ని అభినందించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'ఈ దశాబ్దం దేశాభివృద్ధికి చాలా ముఖ్యమైనది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐ పాత్ర కూడా చాలా పెద్దది. అందుకు అనుగుణంగానే ఆర్బీఐ బృందం దేశం యొక్క అంచనాలను అందుకోగలదని నమ్మకం ఉంది. రిటైల్ డైరెక్ట్ పథకంతో, దేశంలోని చిన్న పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడికి సులభమైన, సురక్షితమైన మార్గాన్ని అందించింది. ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకం, వన్ నేషన్ వన్ అంబుడ్స్‌మన్ సిస్టమ్ ఈ రోజు బ్యాంకింగ్ రంగంలో రూపుదిద్దుకుంది. ఈ రోజు ప్రారంభించబడిన రెండు పథకాలు దేశంలో పెట్టుబడి పరిధిని విస్తరింపజేస్తాయి. ఈ పథకాలు మరింత సురక్షితమైనవి. పెట్టుబడిదారులకు క్యాపిటల్ మార్కెట్లను యాక్సెస్ చేయడాన్ని సులభతరం చేస్తాయి' అని ప్రధాని మోదీ అన్నారు. చదవండి: (నిఖిల్‌తో పెళ్లిపై నుస్రత్ సంచలన వ్యాఖ్యలు) -
ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.8,666 కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ పథకాలు ఆగస్ట్ నెలలో నికరంగా రూ.8,666 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. నూతన ఫండ్ పథకాల ఆవిష్కరణ (ఎన్‌ఎఫ్‌వోలు), సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఇన్వెస్టర్ల నుంచి స్థిరమైన పెట్టుబడులు రావడం ఇందుకు దోహదం చేశాయి. ఇలా ఈక్విటీ పథకాల్లోకి సానుకూల పెట్టుబడులు ప్రవేశించడం వరుసగా ఆరో నెలలోనూ నమోదైంది. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) ఆగస్ట్ చివరికి రూ.36.6 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది జూలై ఆఖరుకు రూ.35.32 లక్షల కోట్లుగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) ఆగస్ట్ నెలకు సంబంధించి గణాంకాలను విడుదల చేసింది. ఈ ఏడాది జూలైలో రూ.22,583 కోట్లు, జూన్‌లో రూ.5,988 కోట్లు, మేలో రూ.10,083 కోట్లు, ఏప్రిల్‌లో రూ.3,437 కోట్లు, మార్చిలో రూ.9,115 కోట్ల చొప్పున పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి రావడం గమనార్హం. 2020 జూలై– 2021 ఫిబ్రవరి మధ్య ఎనిమిది నెలల పాటు ఈక్విటీ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లాయి. నూతన మైలురాయి.. ‘‘ఓపెన్ ఎండెడ్ పథకాల్లోని సానుకూల పెట్టుబడుల రాకకుతోడు.. ఈక్విటీ మార్కెట్లు గరిష్ట స్థాయిలకు చేరుకోవడం మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని నికర ఏయూఎం రూ.36 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించేందుకు తోడ్పడ్డాయి’’ అని యాంఫి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. సిప్ ఖాతాలు పెరగడం అన్నది ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో సంపద సృష్టికి మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోందన్నారు. ఆగస్ట్‌లో ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలలో ఇన్వెస్టర్లు రూ.6,863 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్టు మైవెల్త్‌గ్రోత్ సహ వ్యవస్థాపకుడు హర్షద్ చేతన్‌వాలా పేర్కొన్నారు. విభాగాల వారీగా... ► ఫ్లెక్సీక్యాప్ విభాగం అత్యధికంగా రూ.4,741 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ► ఫోకస్డ్ ఫండ్స్ విభాగంలోకి రూ.3,073 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ► మల్టీక్యాప్, లార్జ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ పథకాల నుంచి ఆగస్ట్‌లో నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం గమనార్హం. ముఖ్యంగా స్మాల్‌క్యాప్ పథకాల నుంచి ఆగస్ట్‌లో ఇన్వెస్టర్లు రూ.163 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ► హైబ్రిడ్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్టర్లు రూ.18,706 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ► సిప్ ఖాతాలు జూలై ఆఖరుకు 4.17 కోట్లుగా ఉంటే, ఆగస్ట్ చివరికి 4.32 కోట్లకు పెరిగాయి. ► నెలవారీ సిప్ పెట్టుబడులు రూ.9,923 కోట్లుగా ఉన్నాయి. జూలైలో ఈ మొత్తం రూ.9,609 కోట్లుగా ఉంది. ► గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా రూ.24 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూలైలో మాత్రం ఈ విభాగం నుంచి ఇన్వెస్టర్లు రూ.61 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ► ఆగస్ట్‌లో డెట్ పథకాల్లోకి నికర పెట్టుబడులు రూ.1,074 కోట్లుగానే ఉన్నాయి. జూలైలో వచి్చన రూ.73,964 కోట్లతో పోలిస్తే డెట్‌లోకి పెట్టుబడులు గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. ► డెట్‌లో ఫ్లోటర్ ఫండ్స్‌లోకి రూ.9,991 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌లోకి రూ.3,065 కోట్ల చొప్పున వచ్చాయి. ► లిక్విడ్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.11,808 కోట్లను ఉపసంహరించుకున్నారు. ► ఆగస్ట్‌లో ఫండ్స్ పరిశ్రమలోకి (అన్ని విభాగాలూ) నికరంగా రూ.32,976 కోట్లు వచ్చాయి. -
రాబడి ఘనమే కానీ...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ ఆదాయం ఘనంగా ఉన్నప్పటికీ అప్పులు, వడ్డీల మోత కారణంగా ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. ప్రతి నెలా వచ్చే రెవెన్యూ రాబడికి మించి ఖర్చులుండటం ఆర్థిక నిర్వహణను ప్రభావితం చేస్తోంది. ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన ప్రతిష్టాత్మక పథకాలన్నీ భారీ బడ్జెట్‌తో కూడుకున్నవి కావడంతో ఖజానాపై అంతకంతకూ భారం పెరిగిపోతోంది. దీంతో కొత్త పథకాలు, కార్యక్రమాలు చేపట్టేందుకు సర్కారు వెనకాడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన మధ్యంతర భృతిని ప్రకటించకుండా ఆపేయడానికి ఇదే ప్రధాన కారణమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీ, రాష్ట్ర పన్నుల వాటా, ఎఫ్ఆర్బీఏం పరిధిలో తెచ్చుకునే అప్పులన్నీ కలిపితే ఒక్కో నెలా రాష్ట్రానికి సగటున రూ. 9,800 కోట్ల నుంచి రూ. 10,500 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల (ఏప్రిల్‌లో) రూ. 9,866 కోట్ల ఆదాయం రాగా అందులో రూ. 4,938 కోట్లు అప్పుగా తెచ్చినదే. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు నివేదించిన లెక్కలివి. ఇదే తీరుగా వచ్చే రెవెన్యూ రాబడితో పోలిస్తే నెలనెలా ఖర్చు సైతం అదే స్థాయిలో ఉండటం గమనార్హం. ఇప్పటికే చేసిన అప్పులకు ప్రభుత్వం ప్రతి నెలా దాదాపు రూ. 2,000 కోట్లు కిస్తులు చెల్లించాల్సి ఉంది. వీటికితోడుగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, సబ్సిడీలకు రూ. 6 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ లెక్కన ప్రభుత్వం చేపట్లే పనులకు మిగిలే నిధులు రూ. 2 వేల కోట్లకు మించడం లేదు. ఇదే సమయంలో రైతుల సంక్షేమానికి వరుసగా చేపట్టిన పథకాలు బడ్జెట్లో సింహభాగాన్ని ఆక్రమించాయి. జీతాలు మినహా నిలిచిన ఇతర బిల్లులు..! రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లున్నారు. గత ఆర్థిక సంవత్సరం ఉద్యోగులకు చెల్లించిన వేతనాల మొత్తం దాదాపు రూ. 24 వేల కోట్లు. ఈసారి 63 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2014లో పదో పీఆర్సీ 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిందని.. ఈసారి అంతకు మించిన వేతన సవరణ వస్తుందని ఉద్యోగులు ఆశలు, అంచనాలు పెంచుకున్నారు. మూల వేతనం అప్పుడే భారీగా పెరిగిందని, పెరిగిన మొత్తంపై మరోసారి భారీగా సవరణ చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక శాతం వేతన సవరణ చేసినా రూ. 300 కోట్ల భారం పడుతుంది. ఆ లెక్కన 63 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలంటే ఒక్కసారిగా జీతాల భారం అదనంగా రూ. 18,900 కోట్లకు చేరుతుంది. అదే జరిగితే ప్రభుత్వం చేపట్టే ఇతర పనులు, కార్యక్రమాలకు నిధుల కొరత ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే రైతు బంధు చెక్కుల పంపిణీ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలుగా అనధికారికంగా నిధుల ఖర్చుపై ఆంక్షలు విధించింది. ఉద్యోగుల జీతాలు తప్ప ఇతర పనుల బిల్లులన్నీ దాదాపుగా నిలిపేసింది. దాదాపు రూ. 3 వేల కోట్లకుపైగా బిల్లులకు చెక్కులు ఇచ్చినా డబ్బులు విడుదల చేయకుండా ఆపేసింది. దీంతో అన్ని విభాగాల్లో తమకిచ్చిన చెక్కులు డ్రా చేసుకోలేకపోతున్నామం టూ కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. రైతు పథకాలకే అధిక వాటా... గతంలో మూడేళ్లు రైతు రుణమాఫీకి నిధులు సర్దుబాటు చేసిన ప్రభుత్వం... ఈ ఏడాది రైతు పెట్టుబడి సాయం పథకానికి నిధులు ధారపోసింది. ఏటా ఎకరానికి రూ. 8 వేల చొప్పున రెండు విడతల్లో చెక్కుల పంపిణీకి దాదాపు రూ. 12 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే రూ. 6 వేల కోట్లు పంపిణీ చేసిన ప్రభుత్వం నవంబర్‌లో మరో రూ. 6 వేల కోట్ల పంపిణీకి సిద్ధమవుతోంది. ఇదే వ్యవధిలో రైతులకు రూ. 5 లక్షల జీవిత బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఆగస్టులోనే దాదాపు రూ. 1,000 కోట్లను రైతుల పేరిట ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించనుంది. దీంతో రైతు పథకాలకు ఈ ఏడాది రూ. 13 వేల కోట్లు ఖర్చు చేయనుంది. అందుకే ప్రభుత్వం కొత్త పనులకు వెనకాడుతోంది. రైతులకు అవసరమైన నిధులను సమీకరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ. 8 వేల కోట్ల మార్కెట్ రుణాలను సమీకరించింది. ఏప్రిల్‌లో రూ. 4,932 కోట్లను ఆర్బీఐ వేలం ద్వారా అప్పు తీసుకోగా మే, జూన్ నెలల్లో రూ. 3,500 కోట్లు అప్పు చేసింది. తాజాగా ఈ నెల ఒకటో తేదీన జరిగిన వేలంలో రూ. వెయ్యి కోట్లు అప్పు తీసుకుంది. -
సంబరం.. ‘సంక్షేమ’ం
► నేడు రాష్ట్ర అవతరణ వేడుకలు ► నూతన పథకాలకు శ్రీకారం ► బాలింతలకు కేసీఆర్ కిట్టు.. ► ఒంటరి మహిళలకు పింఛన్ ► గుడుంబా తయారీ కుటుంబాలకు పునరావాసం ► హోంగార్డుల సేవలకు గుర్తింపు ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ముందుకు కొత్త పథకాలను తీసుకొస్తోంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతోపాటు వివిధ వర్గాలకు చేయూతనిచ్చేందుకు కొత్త పథకాలను ప్రారంభించనుంది. అమ్మఒడి, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళలకు పింఛన్లు, గుండుంబా తయారీ కుటుంబాలకు పునరావాసం వంటి పథకాలకు శ్రీకారం చుట్టనుంది. దీంతో ఈ ఏడాది వేడుకలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఆయా పథకాలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో వేడుకలను అంబరాన్నంటేలా జరిపించేందుకు ప్రభుత్వం రూ.10 లక్షలు కేటాయిచింది. ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ కోసం అసువులు బాసిన అమరులకు నివాళులు అర్పించడం, జాతీయ పతాక ఆవిష్కరణ, ఆస్పత్రులు, ఆశ్రమాల్లో పండ్ల పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. కేసీఆర్ కిట్టు.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా జూన్ 3న ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడంతోపాటు బాలింతలకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు కేసీఆర్ కిట్టును అందజేయనున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో ప్రసవించే ఒక్కో బాలింతకు రూ.12 వేలు విలువ చేసే కేసీఆర్ కిట్టును పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆడపిల్ల పుడితే అదనంగా రూ.వెయ్యి అందజేస్తారు. దీనికి సంబంధించి నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులను వేసే విధంగా వైద్య సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని గర్భిణుల బ్యాంకు వివరాలు సేకరిస్తున్నారు. వైద్య పరీక్షల సమయంలో రూ.4 వేలు, ప్రసవ సమయంలో రూ.4 వేలు, పిల్లలకు అందించే టీకాల సమయంలో రూ.4 వేల చొప్పున ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. కాగా కేసీఆర్ కిట్టులో సబ్బులు, పౌడర్, దోమతెర వంటి 12 రకాల వస్తువులను బాలింతలకు అందజేస్తారు. ఒంటరి మహిళలకు పింఛన్లు కుటుంబ సభ్యుల ఆదరణ కరువై ఒంటరిగా నివసిస్తున్న మహిళలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం వారికి నెలవారీ పింఛన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆసరా పింఛన్ పథకంలోనే ఒంటరి మహిళలకు సైతం నెలకు రూ.వెయ్యి పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 4న పింఛన్ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. కాగా జిల్లాలోని 13 మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో 1,605 మంది ఒంటరి మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒంటరి మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి తొలివిడతగా ఏప్రిల్, మే నెలకు సంబంధించిన రూ.2 వేలు పంపిణీ చేయనున్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 4న పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పునరావాస పథకం.. ఈ ఏడాది ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్రాన్ని గుడుంబా రహిత రాష్ట్రంగా ప్రకటించనున్నారు. గుడుంబా తయారీపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలకు పునరావాస పథకం కింద ఆర్థిక సాయం అందజేయనున్నారు. గుడుంబా మానేసిన వారికి రూ.2 లక్షలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించిన అధికారులు జూన్ 2న పునరావాస పథకాన్ని అధికారికంగా ప్రారంభించి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేసేందుకు సిద్ధమవుతున్నారు.అమ్మఒడి, ఒంటరి మహిళ పింఛన్లు, పునరావాస పథకంలాగే ప్రభుత్వం ఈ ఏడాది గొల్లకుర్మలకు ప్రభుత్వం 75 శాతం రాయితీపై గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూన్ చివరి వరకు తొలివిడతగా గొర్రెలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే గొల్లకుర్మ సంఘాలను గుర్తించారు. ఇప్పటి వరకు 150 సంఘాలు ఏర్పడగా 6 వేల వరకు సభ్యులు ఉన్నారు. తొలివిడతగా 3 వేల మంది లబ్ధిదారులకు జూన్ చివరిలోగా అందించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆవిర్భావ వేడుకలకు కొత్త పథకాలను ప్రవేశపెట్టడంతో ప్రత్యేకను సంతరించుకున్నాయి. గతేడాది వేడుకల్లో సాంస్కృతిక, ఇతర ప్రదర్శన కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది సంక్షేమ పథకాలపై దృష్టి సారిచింది. ఇందులో ముఖ్యమైన పథకాలు కేసీఆర్ కిట్, ఒంటరి మహిళలకు పింఛన్ పథకాలు మహిళలకు ఎంతగానో లబ్ధి చేకూర్చనున్నాయి. నిరంతర సేవలకు గుర్తింపు.. జిల్లాలో పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న నిరంతర సేవకులైన హోంగార్డులకు ప్రభుత్వం వేతనాలు పెంచనుంది. ఇప్పటికే రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు హోంగార్డుల వేతనాలు పెంచిన కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ కానుకగా మరోసారి వేతనాలు పెంచేందుకు నిర్ణయించారు. రూ.6 వేల ఉన్న వేతనాన్ని రూ.12 వేలుకు పెంచింది. ఈ ఏడాది ఆవిర్భావం రోజు రూ.19,884కు పెంచేందుకు సిద్ధమయ్యారు. వేడుకల్లో ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 900, ఆదిలాబాద్‌లో 300 మంది హోంగార్డులు లబ్ధి పొందనున్నారు. సంతోషంగా ఉంది.. హోంగార్డులకు ప్రభుత్వం వేతనాలు పెంచడం సంతోషంగా ఉంది. హోంగార్డుల కష్టాలను గుర్తించి ఇప్పటికే రెండు సార్లు కేసీఆర్ వేతనాలు పెంచడం జరిగింది. మళ్లీ ఆవిర్భావం సందర్భంగా వేతనాలుపెంచేందుకు నిర్ణయించడం పట్ల కృతజ్ఞతలు. – హైదర్‌ఖాన్, హోంగార్డు -
ఎల్ఐసీ రెండు కొత్త ప్లాన్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) జీవన్ సంగమ్, చిల్డ్రన్స్ మనీబ్యాక్ అనే రెండు సరికొత్త పథకాలను ప్రారంభించింది. జీవన్ సంగమ్.. ఇది ఒక నాన్ లింక్డ్, సింగిల్ ప్రీమియం పథకం.ఈ సింగిల్ ప్రీమియం పథకం 6-50 ఏళ్ల లోపు వారికి కొన్ని నిబంధనలకు లోబడి అందుబాటులో ఉంటుంది. 12 ఏళ్ల లోపు పిల్లలకు చిల్డ్రన్స్ మనీబ్యాక్. పిల్లల విద్య తదితర అవసరాల కోసం ఉద్దేశించబడిన నాన్ లింక్డ్ మనీబ్యాక్ పథకమే ఇది. ఈ పాలసీ కాలవ్యవధిలో పిల్లల జీవితానికి రిస్క్‌ను కవ ర్ చేస్తుంది. నిర్దేశించిన సమయం పూర్తయిన తర్వాత కాలానుగత చెల్లింపులూ చేయబడతాయి. ఒకవేళ పాలసీ సమయంలో తల్లిదండ్రులు మరణించినట్లయితే ఆ తర్వాత ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేదు. -
‘కోతల’ పథకాలు!
* పాత వాటి స్థానంలో కొత్త పథకాలకు రూపకల్పన * గ్రాంట్‌ను 90 శాతం నుంచి 60 శాతానికి కుదింపు * లక్ష్యాలను అధిగమిస్తే మరో 15 శాతం అదనంగా చెల్లింపు * 15 శాతం కోతకు సిద్ధం.. 10 వేల కోట్ల మేర కత్తిరింపు * డిస్కంలపై పెనుభారం, ప్రత్యేక రాష్ట్రాలకు మినహాయింపు * రేపు ఢిల్లీలో రాష్ట్రాలతో భేటీకి అవకాశం * కొత్త పథకాల విధివిధానాలపై చర్చించనున్న కేంద్రం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో కేంద్రం ఇచ్చే నిధుల కత్తిరింపునకు రంగం సిద్ధమైంది. విద్యుత్ రంగంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాల స్థానంలో కొత్త వాటిని తీసుకొస్తూ గ్రాంట్ల భారాన్ని కేంద్రం తగ్గించుకుంటోంది. పర్యవసానంగా రాష్ట్రాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లపై ఆర్థికంగా పెనుభారం పడనుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టే కొత్త పథకాల విధివిధానాలపై మంగళవారం(23న) అన్ని రాష్ట్రాలతో ఢిల్లీలో సమావేశం నిర్వహించే అవకాశముంది. ఈ మేరకు రాష్ర్ట ఇంధన శాఖ వర్గాలకు సమాచారం కూడా అందింది. విద్యుత్ రంగంలో మార్పులపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే గ్రాంట్ల విషయంపైనే ఇంధన శాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గ్రామీణ, పట్టణ విద్యుదీకరణకు సంబంధించి ప్రస్తుతం రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన(ఆర్‌జీజీవీవై), రీ స్ట్రక్చర్డ్ యాక్సిలరేటడ్ పవర్ డెవలప్మెంట్ రిఫా ర్మ్స్ ప్రోగ్రాం(ఆర్‌ఏపీడీఆర్‌పీ) పేరిట దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్ర పథకాలు అమల్లో ఉన్నాయి. వీటి కింద గత యూపీఏ ప్రభుత్వం 90 శాతం నిధులను గ్రాంట్‌గా విడుదల చేసింది. మిగతా పది శాతాన్ని రుణంగా సమకూర్చుకునేందుకు రాష్ట్రాల డిస్కంలకు వెసులుబాటు కల్పించింది. అయితే ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం వీటి స్థానంలో కొత్త పథకాలను రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను మెరుగుపరిచేందుకు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన(డీడీయూజీజేవై), పట్టణ ప్రాంతాల్లో ఐటీ ఆధారిత విద్యుత్ పంపిణీకి ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్(ఐపీడీఎస్)పేరిట కొత్త పథకాల అమలుకుకసరత్తు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఇంధన శాఖ ఇటీవలే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే నిధుల కూర్పును మార్చడం వల్ల ఈ పథకాలు రాష్ట్రాల పాలిట గుదిబండగా మారనున్నాయి. ఇకపై భారీగా కత్తిరింపు కొత్త పథకాల్లో కేంద్రం నుంచి రాష్ట్రాలకు కేవలం 60 శాతం గ్రాంట్ రానుంది. మిగతా 40 శాతం నిధుల్లో పది శాతాన్ని డిస్కంలు సొంతంగా జమ చేసుకోవాలి. 30 శాతం నిధులను రుణంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో పథకం అమలులో మైలురాళ్లను అధిగమిస్తే.. అదనంగా మరో 15 శాతం గ్రాంటు మంజూరవుతుందని కేంద్రం మెలిక పెట్టింది. దీంతో నిర్ణీత లక్ష్యాలను సాధించిన రాష్ట్రాలకు సైతం మొత్తంగా 75 శాతం గ్రాంట్ మాత్రమే అందుతుంది. అప్పటికీ గతంతో పోల్చితే 15 శాతం నిధులను కేంద్రం కత్తిరించినట్లే అవుతుంది. అంతమేరకు డిస్కంలపై అదనపు భారం పడనుంది. సొంతంగా పది శాతం నిధులు భరించటంతో పాటు... రుణం తీసుకునే నిధుల్లో పది శాతాన్ని డిస్కంలు తమ వంతు వాటాగా డిపాజిట్ రూపంలో ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సి వస్తుందని, ఇది పెను భారమేనని తెలంగాణ నార్తర్న్ డిస్కంకు చెందిన ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత కూడా డిస్కంలపైనే ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే విద్యుత్ రాయితీలతో ఆర్థికంగా కుదేలైన డిస్కంలు.. ఈ గ్రాంట్ల కుదింపుతో మరింత సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముంది. కేవలం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం నుంచి 85 శాతం గ్రాంట్ లభించనుంది. సిక్కిం, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. దీంతో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రత్యేక హోదాకు నోచుకోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికీ నిధుల కోత ఇబ్బందికరంగానే మారనుంది. రాష్ట్రాలపై వేల కోట్ల భారం ప్రస్తుతం అమల్లో ఉన్న 12వ పంచవర్ష ప్రణాళికతో పాటు.. 13వ పంచవర్ష ప్రణాళికలోనూ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పథకానికి కేంద్రం ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ ప్రాజెక్టు కింద 2022 సంవత్సరం వరకు మొత్తం రూ. 43,033 కోట్లను ఖర్చు చేయనుంది. ప్రస్తుతమున్న ఆర్జీజీవీవైని ఇందులోనే విలీనం చేసి.. మొత్తం రూ. 33,453 కోట్లను గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు మంజూరు చేయాల్సి ఉంటుందని కేంద్రం లెక్కగట్టింది. 90 శాతం గ్రాంటు కిందైతే రూ.38,729 కోట్లను చెల్లించాల్సి వచ్చేది. కానీ, కొత్త తిరకాసులతో అన్ని రాష్ట్రాల్లోని డిస్కంలు ఏకంగా రూ. 5,276 కోట్ల భారాన్ని మోయాల్సి ఉంటుంది. దీంతో పాటు పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, సోలార్ విద్యుత్, మీటరింగ్, ఐటీ ఆధారిత విద్యుత్ పంపిణీ లక్ష్యంగా అమలయ్యే ఐపీడీఎస్ పథకానికి రూ.32,612 కోట్లు అవసరమని అంచనా. ఇందులో రూ.25,354 కోట్లను గ్రాంట్లుగా ఇచ్చేందుకు ఆర్థిక ప్రణాళికను కేంద్రం సిద్ధం చేసింది. ప్రస్తుతమున్న ఆర్‌ఏపీడీఆర్‌పీ బదులు ఈ కొత్త పథకం అమలుకానుంది. అయితే గ్రాంట్లలో కోత విధించడంతో ఈ పథకం కింద కూడా రాష్ట్రాలపై రూ. 4 వేల కోట్లకుపైగా భారం పడనుంది. మొత్తంగా రెండు పథకాలు కలిపి రూ.10 వేల కోట్ల వరకు గ్రాంట్లకు కేంద్ర ప్రభుత్వం కత్తెర వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు డిస్కంలకు 2012లో కేంద్రం నుంచి దాదాపు రూ.2,000 కోట్లు మంజూరయ్యాయి. రుణ భారం తప్ప సొంత వాటాలు చెల్లించే అవసరం లేకపోవటంతో ఈ గ్రాంట్లతో డిస్కంలకు ఆర్థికంగా ఊరట లభించింది. కానీ, కొత్త నిబంధనలతో ఇరు రాష్ట్రాల్లోని డిస్కంలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రూ.800 కోట్ల భారం పడనుంది. ఢిల్లీలో మంగళవారం రాష్ట్రాలతో భేటీ నిర్వహించేందుకు కేంద్ర ఇంధన శాఖ, కేంద్ర విద్యుత్ అథారిటీ సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశానికి రాష్ర్ట ప్రభుత్వం తరఫున టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో చైర్మన్ ప్రభాకర్‌రావు, టీఎస్-ఎస్పీడీసీఎల్ చైర్మన్ సి.రఘుమారెడ్డి హాజరుకానున్నారు. అయితే సమావేశ తేదీ మారే అవకాశం ఉంది. -
కెసిఆర్ ఏం చేస్తున్నారు?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అధికారం చేపట్టిన తరువాత అత్యధికంగా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలే తీసుకున్నారు. తీసుకుంటున్నారు. కొన్ని నిర్ణయాలకు జనామోదం అద్వితీయంగా లభిస్తోంది. అయితే రెండు మూడు నిర్ణయాల విషయంలో మిశ్రమ స్పందన వస్తోంది. సమైక్యాంధ్ర రెండుగా విడిపోయిన నేపధ్యంలో ఏపికి ఆర్థిక కష్టాలు, రాజధాని ప్రాంత ఎంపిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో అర్ధంకాక ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల పట్టుకు కూర్చున్నారు. తాము సిఎం అయిన తరువాత పెడతానన్న తొలి సంతకానికే దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో మరో రాష్ట్రం తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులులేవు. నిధులకు కొరతలేదు. కెసిఆర్ మాత్రం సునాయసంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. అదే ఊపులో పథకాలమీద పథకాలు ప్రకటించేస్తున్నారు. పనిలో పనిగా కొన్ని సంస్థల పేర్లు కూడా మార్చేస్తున్నారు. కెసిఆర్ ప్రకటించిన పథకాలలో ముఖ్యమైనవి: 1.లక్ష రూపాయల వరకు రైతుల రుణాల మాఫీ 2.దళితులకు మూడు ఎకరాల భూమి 3. ఆటో రిక్షాలకు పన్న రద్దు 4. రైతులు ఉపయోగించే ట్రాక్టర్లకు పన్ను రద్దు 5. మూడున్నర లక్షల రూపాయల ఖర్చుతో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం 6. వృద్ధులకు వెయ్యి రూపాయల పెన్షన్ 7. వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ 8. బీడి కార్మికులకు వెయ్యి రూపాయల భృతి 9.దళితులు, ఆదివాసీలు, లంబాడీల ఆడపిల్లలకు 50 వేల రూపాయలు ఇచ్చే కళ్యాణ లక్ష్మి పథకం 10.పలు సాగునీటి పథకాలు 11.కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం 12. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం, ఇల్లు, వారి పిల్లలకు విద్య,వైద్యం. 13.తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగింపు 14. సామాజిక సర్వే ........ ఈ రకమైన పథకాలన్నింటికీ దాదాపు సంపూర్ణ మద్దతు లభిస్తోంది. సామాజిక సర్వే అంశం కాస్త కష్టమైనప్పటికీ దీని వల్ల తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ప్రభుత్వానికి కూడా సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సర్వే విషయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడివారు మాత్రం కొంత భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వే ద్వారా స్థానికులు కానివారు ఎవరో తెలుసుకునే అవకాశం ఉంటుంది. వారిని సంక్షేమ పథకాల నుంచి కాలక్రమంలో తొలగించే అవకాశం ఉంటుంది. ఇకపోతే స్థానికత, మతప్రాతిపదికపై రిజర్వేషన్లు, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు మార్పు వంటి వాటిపై మిశ్రమ స్పందన వస్తోంది. ప్రధానంగా స్థానికత అంశంపై విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక కుటుంబం 50 ఏళ్ల క్రితం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడింది. వారికి పిల్లలు ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరుగుతారు. వారికి వారి కుటుంబ పెద్దల స్వస్థలాలతో సంబంధాలు ఉండవు. అటువంటి వారి పరిస్థితి ఏమిటి? వారిని స్థానికులు కాదంటే వారు ఎక్కడికి పోవాలి? ఇటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే ఇది ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. మత ప్రాతిపధికపై రిజర్వేషన్లను ముఖ్యంగా బిజెపి విమర్శిస్తోంది. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు మార్చవలసిన అవసరం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. రంగా స్వాత్రంత్ర్యసమరయోథుడు, రైతు నాయకుడు, జాతీయస్థాయిలో రైతు నాయకుడిగా పేరు ఘడించినవారు. అటువంటి వ్యక్తి కేవలం ఏపికి చెందినవారవడం వల్ల అతని పేరు మార్చడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది ఒక జాతీయ నాయకుని అవమానించడంగా భావిస్తున్నారు. ప్రొఫెసర జయశంకర్ గొప్ప వ్యక్తే. అందులో అనుమానానికి తావులేదు. అతని పేరు కావాలంటే మరో ముఖ్యమైనదానికి పెట్టవచ్చుగదా అని అంటున్నారు. అంబేద్కర్ దూర విశ్వవిద్యాలయం పేరు మార్చగలరా? అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం కొత్త నిర్ణయాలను ఇష్టం ఉన్నా లేకున్నా అంగీకరించక తప్పదని, ఇటువంటి విషయాలలో విమర్శలు అనవసరం అని మరికొందరి వాదన. పోరాటాల నేపధ్యంలో ఏర్పడిన ప్రభుత్వాల పాలనలో ఇటువంటి కొత్తపోకడలు తప్పవు. కొత్తనీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోకతప్పదు. - శిసూర్య