సాక్షి,సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ కొత్త నాలుగు పథకాల కార్యక్రమం అంతా బోగస్సేనని, ముందురోజు వరకు దరఖాస్తులు తీసుకుని తెల్లారే లబ్ధిదారుల ఎంపిక అంటున్నారని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో ఆదివారం(జనవరి26) జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘గ్రామ సభలన్నీ ఒక ప్రహాసనంగా మార్చారు.
రెండు సార్లు దరఖాస్తులు తీసుకుని బుట్టదాఖలు చేసి మళ్లీ దరఖాస్తులు అంటున్నారు. పైరవీ చేసుకున్న వారికి మాత్రమే లబ్ధి చేకూరుతోంది. హామీలు ఎగ్గొట్టడానికే కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలాడుతున్నాయి.
ఒకరు రాష్ట్రానికి టోకరా వేస్తే మరొకరు దేశానికి టోకరా వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు తెలంగాణ ద్రోహులే. ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్‌కు చేతకావడంలేదు. దోచుకోవడం కప్పం కట్టడంతోనే రేవంత్‌కు సమయం సరిపోవడంలేదు’అని జగదీష్‌రెడ్డి విమర్శించారు.
కాగా ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్‌కార్డుల జారీ అనే నాలుగు కొత్త స్కీమ్‌లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆదివారం(జనవరి26) ప్రారంభించింది. ఈ స్కీములను కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గీలో సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే రైతు భరోసా నిధులు రైతు ఖాతాలో జమవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: అర్ధరాత్రి నుంచే రైతుభరోసా డబ్బులు ఖాతాల్లోకి
Comments
Please login to add a commentAdd a comment