ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) మహిళల కోసం, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ ఫౌండర్ల కోసం త్వరలోనే ప్రత్యేక ఆర్థిక పథకాలను ప్రారంభించనున్నాయి.
ఎన్‌హాన్స్‌డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ (ఈఎస్ఈ 7.0) సంస్కరణల ఎజెండాలో భాగంగా మహిళా కస్టమర్లకు మద్దతు ఇచ్చే వ్యూహాన్ని రూపొందించాలని ఆర్థిక సేవల విభాగం బ్యాంకులను కోరినట్లు ‘లైవ్ మింట్’ కథనం పేర్కొంది. ఈఎస్ఈ 7.0 రిస్క్‌ను అంచనా వేయడం, నిరర్థక ఆస్తుల నిర్వహణ, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, కస్టమర్ సర్వీస్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై దృష్టి పెడుతుంది.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 31.2 కోట్ల మంది మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటు వేశారని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏకు ఎక్కువ మంది మహిళలు ఓటేశారని సర్వేలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల ద్వారా మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చే ప్రత్యేక పథకాలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక బ్యాంకింగ్ సేవలు, తమ వెంచర్లకు ఆర్థిక సహాయం కోరుకునే వారికి 'లోన్ మేళాలు' వంటివి తాజా ఈఎస్ఈ సంస్కరణల్లో ఉన్నాయి. మహిళా వ్యవస్థాపకులను స్టార్టప్ ఇంక్యుబేటర్లతో అనుసంధానం చేసి వారి వెంచర్లను విస్తరించడానికి సహాయపడే కార్యక్రమాలను కూడా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా నిర్వహించున్నారు. అయితే ఆర్థిక శాఖ నుంచి దీనిపై స్పందన రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment