న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల చర్యల్లో భాగంగా త్వరలో బయో–తయారీ, బయో–ఫౌండ్రీ కోసం కొత్తగా స్కీమును ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బయో–ఫార్మా, బయో–ప్లాస్టిక్స్, బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ మొదలైన వాటికి ఇది ఊతమివ్వనుంది.
ప్రపంచ ఎకానమీని మార్చేయగలిగే సత్తా ఈ స్కీముకు ఉంటుందని కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్‌ను సాకారం చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యానికి ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. 2014లో కేవలం 10 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ బయో ఆర్థిక వ్యవస్థ గడిచిన ఎనిమిది, తొమ్మిదేళ్లలో 140 బిలియన్ డాలర్లకు చేరిందని సింగ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment